యుతిని ప్రేమిస్తున్నానంటూ వెంట పడ్డాడు. అయితే ఆమె నిరాకరించింది. అయినా సరే ప్రేమించాల్సిందే, పెళ్ళి చేసుకోవాల్సిందేనంటూ ఒత్తిడి పెంచాడు. భయంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతను కృష్ణానదిలో దూకేశాడు. అయితే నీటి ప్రవాహం తక్కువగా ఉండటంతో బ్యారేజ్ గేటు వద్దకు కొట్టుకొచ్చాడు. చివరకు పోలీసులు అతన్ని కాపాడి స్టేషన్ కు తరలించారు.


లవర్ బాయ్ సిల్లీ వేషాలు...
అతని ప్రాణాలు గట్టివి కావటంతో చావుకు దగ్గరగా వెళ్లి మరి వెనక్కి వచ్చాడు. సినిమా సీన్‌కు మించి జరిగిన ఈ వ్యవహరం తాడేపల్లిలో సంచలనంగా మారింది. తాడేపల్లికి చెందిన బిట్ర దుర్గప్రసాద్, ఈరోజు తెల్లవారు జామున ప్రకాశం బ్యారేజిపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే మొన్నటి వరకు నీటి ప్రవాహం భారీగా ఉన్నప్పటికి వారం రోజులుగా బ్యారేజ్ వద్ద నీటి ప్రవాహం తగ్గింది. దీంతో నదిలో దూకిన దుర్గా ప్రసాద్ నీటిలో కొట్టుకుంటూ బరజ్ గేట్ వద్దకు చేరుకున్నాడు. గేట్ పైకి ఎక్కి తనను కాపాడాలంటూ కేకలు పెట్టాడు. తెల్లవారు జామున జరిగిన ఈ సంఘటనను స్థానికులు ఆలస్యంగా గుర్తించారు. 


అటుగా వెళ్లే వారు బ్యారేజీకి గేట్లు మీద దుర్గ ప్రసాద్ ను చూసి బ్యారేజి ఔట్ పోస్టు పోలీసులకు సమాచారం అందించారు.
ఔట్ పోస్టులో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ నాగేశ్వరరావు వెంటనే స్థానిక మత్స్యకారుల సంప్రదించి పడవలో వెళ్ళి దుర్గా ప్రసాద్‌ను కాపాడారు.


ఇంతకీ అసలు విషయం ఏంటంటే....


దుర్గ ప్రసాద్ తాడేపల్లికి చెందిన యువతిని గత కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. ఆ యువతి దుర్గ ప్రసాద్ ప్రేమను అంగింకరించలేదు. యువతి అంగీకరించకపోవటంతో గతంలో కూడా దుర్గా ప్రసాద్ ఆత్మహత్యయత్నం చేశాడు. అప్పుడు కూడా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయిన సరే ఆ యువతినే ప్రేమిస్తున్నానని, ఆమెనే వివాహం చేసుకుంటానంటూ, దుర్గప్రసాద్ ఆమె వెంట పడుతున్నాడు. యువతి తల్లిదండ్రులు తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో దుర్గా ప్రసాద్ భయాందోళనకు గురయ్యాడు. తనను పోలీసులు అరెస్ట్ చేసి, కేసు బనాయిస్తారని భయపడి కృష్ణానదిలో దూకి ఆత్మహత్య యత్నం చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా దుర్గా ప్రసాద్ పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు అవాక్కయ్యారు.


యువతిపై వత్తిడి పెంచటమే కారణం...


ఇటీవల కాలంలో మహిళలపై వరుసగా జరుగుతున్న దాడుల వ్యవహరం తెలుగు రాష్ట్రాల్లో కలకం రేపుతున్నాయి. ప్రేమించలేదని యువతులపై దాడులకు పాల్పడటం, పీక కోసేయటం వంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే దుర్గా ప్రసాద్ ఎపిసోడ్‌లో మాత్రం కాస్త డిఫరెంట్‌గా జరిగింది. దుర్గా ప్రసాద్ ప్రేమించిన అమ్మాయిని ఒప్పించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాడు. తనను ప్రేమించాలని యువతిని పదేపదే అడటంతో ఆమె విసిగిపోయి,చివరకు తన ఇబ్బందులను కుటుంబ సభ్యులకు తెలిపింది. కుటుంబ సభ్యులు కూడ దుర్గాప్రసాద్ కు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినప్పటికి ప్రయోజనం లేకుండాపోయింది. దీంతో కొన్ని రోజులపాటు యువతి వేరొక ప్రాంతానికి వెళ్లిపోయింది. ఇటీవల తిరిగి ఇంటికి వచ్చింది. దీంతో విషయం తెలుసుకున్న దుర్గాప్రసాద్ ఆమె ముందు మరలా లవ్ ప్రపోజల్ పెట్టాడు. యువతి భయాందోళనకు గురయ్యింది. 


దుర్గా ప్రసాద్ ఒత్తిడిని భరించలేక మానసికంగా ఆందోళనకు గురై గత్యంతరం లేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దుర్గా ప్రసాద్ మాత్రం ప్రేమించిన యువతి కోసం గతంలో రెండుసార్లు ఆత్మహత్యా యత్నం చేశాడు. ఇప్పుడు మూడోసారి కూడా ఆత్మహత్యకు యత్నించి, ఆఖరి నిమిషంలో ప్రాణాలను కాపాడుకున్నాడు.