Income Tax Day 2023: ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్, ప్రతి సంవత్సరం జులై 24ను 'ఆదాయ పన్ను దినోత్సవం'గా జరుపుతుంది. మన దేశంలో ఇన్‌కమ్ టాక్స్ రూల్స్ అమలును గుర్తు చేస్తూ దీనిని జరుపుతుంది. ఈ ఏడాది కూడా ఇన్‌కమ్ టాక్స్ డే సందర్భంగా, IT డిపార్ట్‌మెంట్ కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. టాక్స్ ఇంపార్టెన్స్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి, దేశం అభివృద్ధి కోసం పన్నులు చెల్లించేలా ఎక్కువ మందిని ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం జులై 24న కొన్ని కార్యక్రమాలు జరుపుతారు.
164వ ఆదాయ పన్ను దినోత్సవంగా (164th Income Tax Day) ఈ ఏడాది వేడుకలు నిర్వహిస్తున్నారు.
ఆదాయ పన్ను విభాగం @IncomeTaxIndia ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా, దేశంలోని దాదాపు ప్రతి అధికారిక భాషలో ట్వీట్స్ చేస్తున్నారు. ఈ ట్వీట్లను భారత ఆర్థిక మంత్రిత్వ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి కూడా రీట్వీట్ చేస్తారు.
దిల్లీలో స్పెషల్ ఈవెంట్
164వ ఆదాయ పన్ను దినోత్సవం సందర్భంగా, ఈరోజు సాయంత్రం 6 గంటలకు దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగే స్పెషల్ ఈవెంట్‌లో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మల సీతారామన్ పాల్గొంటారు. ఆ ఈవెంట్ గురించి ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది, ఇన్ఫర్మేషన్ షేర్ చేసింది.
ఆదాయ పన్ను దినోత్సవం చరిత్ర
వాస్తవానికి, భారతదేశ స్వాతంత్ర పోరాటానికి, ఇన్‌కమ్ టాక్స్‌కు ఉన్న లింక్ ఉంది. 1857లో, తుపాకుల్లోని తూటాల్లో వాడే కొవ్వు విధానానికి వ్యతిరేకంగా భారత సైనికులు బ్రిటిష్ సర్కార్ మీద తిరుగుబాటు చేశారు. దానినే భారతదేశ మొదటి స్వాతంత్ర్య సంగ్రామంగా పరిగణిస్తున్నారు. భారత సిపాయిల తిరుగుబాటు ఫలితంగా బ్రిటిష్ గవర్నమెంట్ చాలా నష్టపోయింది. ఆ నష్టాలను పూడ్చుకోవడానికి, ఇప్పటికి 164 సంవత్సరా క్రితం, 1860 జులై 24న, సర్ జేమ్స్ విల్సన్ భారతదేశంలో మొదటిసారిగా ఇన్‌కమ్ టాక్స్ సిస్టమ్ లాంచ్ చేశాడు. మన దేశంలో మొదటిసారిగా, 2020 జులై 24న ఆదాయ పన్ను దినోత్సవాన్ని జరుపుకున్నారు. భారతదేశంలో ఆదాయ పన్ను వ్యవస్థ ఆవిర్భవించి 150 సంవత్సరాలు అయిన గుర్తుగా 2020లో ఈవెంట్స్ నిర్వహించారు.
ఆదాయ పన్ను విభాగం గురించి...
ఆదాయ పన్ను విభాగం హెడ్ క్వార్టర్స్ న్యూదిల్లీలో ఉంది. ఇది, కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యక్ష పన్ను వసూలు చేసిపెట్టే విభాగం. రెవెన్యూ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేస్తోంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) అనే అపెక్స్ బాడీ ఆదాయ పన్ను విభాగాన్ని నిర్వహిస్తోంది. ఆదాయ పన్ను విభాగం @IncomeTaxIndia ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా, దేశంలోని దాదాపు ప్రతి అధికారిక భాషలో ట్వీట్స్ చేస్తుంది. ఈ ట్వీట్లను భారత ఆర్థిక మంత్రిత్వ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి కూడా రీట్వీట్ చేస్తారు.
ఈ నెలాఖరు వరకే గడువు
2022-23 ఆర్థిక సంవత్సరానికి ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి ఈ నెలాఖరు వరకే గడువుంది. ఈ సంవత్సరం, ఇప్పటి వరకు 3 కోట్ల ITRలు ఫైల్ అయ్యాయి. గత సంవత్సరం కంటే 7 రోజుల ముందుగానే ఈ టార్గెట్‌ను ఐటీ డిపార్ట్‌మెంట్ చేరుకుంది. సబ్మిట్ చేసిన ITRలో 91 శాతం రిటర్న్స్‌ను ఎలక్ట్రానిక్‌గా ధృవీకరించినట్లు ఆదాయపు పన్ను విభాగం ప్రకటించింది.
మరో ఆసక్తికర కథనం: రిటైర్మెంట్ టెన్షన్‌కు చెక్ - రోజుకు ₹100 పక్కన పెట్టి ప్రతి నెలా ₹57,000 తీసుకోండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial