I-T Dept raids Dolo-650 manufacturer Micro Lab's office in Bengaluru : డోలో-650 తయారీ కంపెనీ మైక్రో ల్యాబ్స్‌ లిమిటెడ్‌కు ఆదాయపన్ను శాఖ షాకిచ్చింది! బెంగళూరు రేసుకోర్సు రోడ్‌లోని కంపెనీ ప్రాంగణంలో 20కి పైగా అధికారులు సోదాలు చేపట్టారు. అంతేకాకుండా దిల్లీ, సిక్కిం, పంజాబ్‌, తమిళనాడు, గోవా సహా దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో 200 మంది అధికారులు దాడులు కొనసాగించారని తెలిసింది. కంపెనీ సీఎండీ దిలీప్‌ సురానా, డైరెక్టర్‌ ఆనంద్‌ సురానా ఇళ్లలోనూ తనిఖీలు చేపట్టారు.


Also Read: ఫర్వాలేదే! నిలదొక్కుకున్న మార్కెట్లు - లాభాల్లోనే నిఫ్టీ, సెన్సెక్స్‌


రేసు కోర్సులోని మైక్రో ల్యాబ్స్‌ నుంచి అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. పన్ను ఎగవేత అంశంలోనే ఈ దాడులు చేపట్టారని ఆదాయపన్ను శాఖా వర్గాల ద్వారా తెలిసింది. కొవిడ్‌-19 వేవ్స్‌లో ఈ కంపెనీ కోట్లాది రూపాయాల డబ్బును కూడబెట్టిందని సమాచారం. 2020 నుంచి మైక్రో ల్యాబ్స్‌ 350 కోట్ల డోలో మాత్రలను విక్రయించింది. ఒకే ఏడాదిలో రూ.400 కోట్ల మేర ఆర్జించి ప్రత్యర్థులను అణగదొక్కింది. డోలో అమ్మకాల్లో సరికొత్త రికార్డులు సృష్టించింది.


సాధారణంగా జ్వరం వస్తే పారాసిటమాల్‌ మాత్రలు వేసుకుంటారు. కొవిడ్‌ సమయంలో జ్వరం వచ్చినా, ఏమాత్రం జ్వరం వస్తుందని అనుమానం వచ్చినా చాలామంది మెడికల్‌ దుకాణానికి వెళ్లి డోలో మాత్రలు తెచ్చుకున్నారు. కొందరైతే ఇంట్లోనే నిల్వ చేసుకున్నారు. తమ రంగాల్లో జీరాక్స్‌, బిస్లెరీలా పారాసిటమాల్‌కు డోలో బ్రాండ్‌గా మారిపోయింది. కొవిడ్ సమయంలో డోలోపై సోషల్‌ మీడియాలో మీమ్స్‌ సైతం ట్రెండ్‌ అయిన సంగతి తెలిసిందే.


Also Read: ప్రపంచ వ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్‌ డౌన్‌! ఆటోమేటిక్‌గా మెసేజులు మాయం!!


Also Read: గుడ్‌ న్యూస్‌! భారీగా తగ్గనున్న వంట నూనెలు, పప్పుల ధరలు!