GST Rule On House Rent: వ్యక్తిగత, కుటుంబ అవసరాల కోసం చెల్లించే ఇంటి అద్దెపై వస్తు సేవల పన్ను (GST) లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇంటి అద్దెపై మోదీ ప్రభుత్వం 18 శాతం జీఎస్టీ విధించిందన్న వార్తలు అవాస్తమని తేల్చింది. ఇవి ప్రజలను తప్పు దోవ పట్టించే వార్తలని పేర్కొంది. రెసిడెన్షియల్‌ ప్రాపర్టీని వ్యాపార, వాణిజ్య అవసరాలకు అద్దెకు ఇచ్చినప్పుడే పన్ను వర్తిస్తుందని వెల్లడించింది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ ట్వీట్‌ చేసింది.


'క్లెయిమ్‌: అద్దెకు ఉండేవారు ఇంటి అద్దెపై 18 శాతం జీఎస్టీ చెల్లించాలి.


పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌


* కుటుంబ, వ్యక్తిగత అవసరాలకు ఉద్దేశించిన ఇళ్లను వ్యాపార, వాణిజ్య అవసరాలకు అద్దెకిస్తేనే పన్ను వర్తిస్తుంది.
* ప్రైవేటు వ్యక్తులు, వ్యక్తిగత అవసరాలకు అద్దెకిస్తే ఎలాంటి జీఎస్టీ ఉండదు.
* ఏదైనా కంపెనీ యజమాని, భాగస్వామి వ్యక్తిగత అవసరాలకు అద్దెకిస్తే దానిమీదా జీఎస్టీ ఉండదు' అని పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ ట్వీట్‌ చేసింది.