గ‌త కొన్ని రోజులుగా స్వల్పంగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు రెండు రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం స్వల్పంగా పెరిగిన బంగారం ధర బుధవారం కూడా మరింత పెరిగింది. బుధవారం (అక్టోబర్‌ 6)న భారత్ మార్కెట్లో  10 గ్రాముల బంగారం ధర  రూ. 190 పెరిగింది. ఆయా నగరాల్లో ధరల పెరుగుదలలో కాస్త హెచ్చుతగ్గులున్నాయి.  వెండి ధరలు కొన్ని నగరాల్లో స్థిరంగా ఉంటే మరికొన్ని నగరాల్లో రూ.100 పెరిగాయి. 


తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,730
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,730
విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,750, 24 క్యారెట్ల ధర రూ.47,730
ప్రధాన నగరాల్లో బంగారం ధర
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,080
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,060
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,680 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,680
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,150 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,850
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,730
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,730 


వెండిధరలు: వెండి ధరలు కొన్ని నగరాల్లో స్థిరంగా ఉంటే మరికొన్ని నగరాల్లో రూ.100 వరకూ పెరిగాయి. భారత్ మార్కెట్లో కిలో వెండి ధర బుధవారం 60,600 ఉంది. ప్రధాన నగరాల్లో ధరలు పరిశీలిస్తే ఢిల్లీ, ముంబై, కోల్ కతా, బెంగళూరులో కిలో వెండి రూ.60,600 ఉండగా  చెన్నై, కేరళ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.64,800 ఉంది.


ప్లాటినం ధరలో తగ్గుదల
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర  భారీగా పెరిగింది. భారత్ మార్కెట్లో మంగళవారంతో పోల్చుకుంటే బుధవారం గ్రాముకు రూ.24  పెరిగి.. ధర 2,294 ఉంది. తెలుగు రాష్ట్రాల్లో  10 గ్రాముల ప్లాటినం ధర రూ.22,940 ఉంది.


అనేక అంశాలపై పసిడి, వెండి ధరలు
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.


Also Read: విజయ దశమి ఎందుకు జరుపుకుంటారు.. శరన్నవరాత్రుల్లో అమ్మవారు ఏ రోజు ఏ అలంకారంలో అనుగ్రహిస్తుంది ... ఆ అలంకారం వెనుకున్న విశిష్టత ఏంటి...
Also Read: ఈ రాశుల వారు ఎవ్వరికీ సలహాలు ఇవ్వకండి...వారి ఆర్థిక పరిస్థితి బావుంటుంది...ఏ రాశిఫలితాలు ఎలా ఉన్నాయంటే...
Also Raed: మళ్లీ ఎగబాకిన పెట్రోల్, డీజిల్ ధరలు.. అన్నిచోట్లా ఇంతే.. తాజా ధరలు ఇవే..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి