భారత్‌లో బంగారం ధర నేడు (సెప్టెంబర్ 4న) స్థిరంగా కొనసాగుతోంది. నిన్న గ్రాముకు అతి స్వల్పంగా రూ.10 చొప్పున తగ్గగా నేడు ధరలు నిలకడగా ఉన్నాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, నేడు భారత మార్కెట్‌లో రూ.46,350గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,580 అయింది.
భారత మార్కెట్లో బంగారం ధరలు నిలకడగా ఉండగా.. వెండి ధర ఢిల్లీలో పెరగగా, హైదరాబాద్‌లో మాత్రం భారీగా దిగొచ్చింది. హైదరాబాద్ మార్కెట్‌లో వెండి ధర భారీగా దిగొచ్చింది. తాజాగా భారత మార్కెట్‌లో రూ.100 మేర పెరగడంతో కిలో వెండి ధర రూ.63,600 కు చేరింది. హైదరాబాద్ మార్కెట్‌లో వెండి ధర రూ.600 మేర దిగొచ్చింది. నేడు రూ.67,800 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ముఖ్య నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి తాజా ధరలివీ..
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర నిలకడగా ఉంది. దాంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (99.99) ధర ప్రస్తుతం రూ.48,220 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం (91.6) ధర రూ.44,200 వద్ద మార్కెట్ అవుతోంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర రూ.600 మేర మేర తగ్గడంతో హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,800 కి పతనమైంది.
ఇక విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర సెప్టెంబర్ 4న నిలకడగా ఉంది. నేడు 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,200 గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.68,700గా ఉంది. విశాఖపట్నం పసిడి మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,560 గానే ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,610గా ఉంది. విజయవాడలో వెండి ధర కిలో హైదరాబాద్ తరహాలోనే రూ.67,800 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది.
Also Read: Gold Vada Pav: వేడి వేడి బంగారు వడపావ్ కావాలా నాయనా? ధరెంతో తెలుసా..
దేశంలోని పలు నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు సెప్టెంబర్ 4న ఇలా ఉన్నాయి. ముంబయిలో బంగారం పది గ్రాముల ధర రూ.80 మేర దిగొచ్చింది. నేడు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.46,200 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,200కి పతనమైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.44,510 అయింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,560 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ప్లాటినం ధర..
బంగారం తరహాలో మరో విలువైన లోహం ప్లాటినం ధరలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. నిన్న తగ్గిన ప్లాటినం ధర నేడు పెరిగింది. ఢిల్లీలో పది గ్రాముల ప్లాటినం ధర రూ.23,400కు చేరింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం- రూ.30 తగ్గడంతో ధర రూ.23,300కి దిగొచ్చింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్లాటినం ఇదే ధరల వద్ద కొనసాగుతోంది.