భారత్‌లో బంగారం, వెండి ధరలు అక్టోబరు 4న స్వల్పంగా పెరిగాయి. తాజాగా బంగారం ధరలో భారత మార్కెట్‌లో గ్రాముకు రూ.1 పెరిగింది. దీంతో భారత మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ రూ.45,490 గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర తాజాగా రూ.46,490గా ఉంది. మొత్తానికి గత వారం రోజులతో పోలిస్తే బంగారం ధర నిలకడగా ఉంది.


భారత మార్కెట్‌లో బంగారం ధరలు పెరగ్గా వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్‌లోనూ వెండి ధరలో మార్పు లేదు. తాజాగా భారత్‌లో కిలో వెండి ధర రూ.60,500 గా ఉంది. హైదరాబాద్‌ మార్కెట్‌లో వెండి ధర కాస్త ఎక్కువగా రూ.64,600గా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ముఖ్య నగరాల్లో అక్టోబరు 4న పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.


ఏపీ, తెలంగాణలో బంగారం, వెండి తాజా ధరలివీ..
హైదరాబాద్‌ మార్కెట్‌లో బంగారం ధర గ్రాముకు రూ.1 చొప్పున పెరిగింది. దీంతో 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.47,470 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం (91.6 స్వచ్ఛత) ధర రూ.43,510 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.64,600గా పలికింది.


Also Read: డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు అరెస్ట్.. సోమవారం వరకు ఎన్‌సీబీ కస్టడీలోనే!


ఇక విజయవాడలో నేడు 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.47,470గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,510 గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.64,600గా ఉంది. ఇక విశాఖపట్నం పసిడి మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,510 గానే ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,470గా ఉంది. ఇక్కడ వెండి ధర కిలో రూ.64,600 కు తగ్గింది.


దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు అక్టోబరు 4న ఇలా ఉన్నాయి. ముంబయిలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.45,490ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,490గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,880 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,870గా ఉంది.


Also Read: రైతులపైకి దూసుకెళ్లిన కేంద్రమంత్రి కారు.. ఎనిమిది మంది మృతి!


ప్లాటినం ధరలో భారీ తగ్గుదల
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర మాత్రం నేడు స్వల్పంగా పెరిగింది. గ్రాముకు రూ.3 వరకూ తగ్గి ధర రూ.2,315గా ఉంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.23,150 గా ఉండగా.. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర అంతే ఉంది.


అనేక అంశాలపై పసిడి, వెండి ధరలు
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.


Also Read: Mumbai Rave Party: ఎవరీ ఆర్యన్ ఖాన్.. మార్షల్ ఆర్ట్స్ నుంచి డ్రగ్స్ కేసు వరకు.. స్టార్ కిడ్ ఆసక్తికర విషయాలు


వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి