భారత్‌లో బంగారం ధరలు గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆగస్టు 3న రూ.44,990 ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, నేడు (ఆగస్టు 4) స్వల్పంగా తగ్గి రూ.44,900 గా ఉంది. అంటే గ్రాముకు రూ.9 తగ్గింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా ముందురోజు రూ.49,090 ఉండగా.. స్వల్పంగా తగ్గి రూ.48,980 కు క్షీణించింది. గత పది రోజులుగా బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తూ వస్తున్నాయి. గత 10 రోజుల ధరతో పోలిస్తే సుమారు రూ.200 మేర వ్యత్యాసం కనిపిస్తోంది.
బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా.. వెండి ధరలు కూడా అదే దారిలో నడిచింది. గత 10 రోజులుగా హెచ్చుతగ్గులు కనిపిస్తూనే ఉన్నా.. తాజాగా భారత్‌లో కిలో వెండి ధర రూ.72,700 గా ఉంది. నిన్న (ఆగస్టు 3న) రూ.73,100గా ఉంది. నిన్నటితో పోలిస్తే వెండి ధర తాజాగా రూ.400 వరకూ తగ్గింది.
హైదరాబాద్, విజయవాడల్లో పసిడి, వెండి తాజా ధరలివీ..
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల మేలిమి బంగారం (బిస్కెట్ బంగారం) ధర రూ.48,980 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,900 గా ఉంది. స్వచ్ఛమైన వెండి ధర కిలో రూ.72,700 పలుకుతుండగా.. ముందు రోజుతో పోలిస్తే వెండి ధర రూ.400 తగ్గింది.
ఇక విజయవాడలో 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ.44,900 కాగా.. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,980గా ఉంది. విజయవాడలో గ్రాముకు రూ.9 వరకూ బంగారం ధర తగ్గింది. ఇక్కడ కిలో వెండి ధర రూ.72,700గా ఉండగా.. వెండి ధర కిలోకు రూ.400 వరకూ తగ్గింది.
వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,360ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,500గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,380 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,380ఉంది.
దేశంలోని ఇతర నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ వాణిజ్య రాజధాని అయిన ముంబయిలో ఆర్నమెంట్ బంగారం ధర కాస్త తక్కువగా ఉంది. రూ.46,960 గా ఉంది. బిస్కెట్ బంగారం ధర రూ.47,960 గా ఉంది. ఇక చెన్నైలో ఆగస్టు 4న 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,330 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,450 గా ఉంది. చెన్నై గోల్డ్ మార్కెట్‌లో మాత్రం బంగారం ధరల్లో అతి స్వల్ప తగ్గుదల మాత్రమే కనిపించింది.
ప్లాటినం ధరలో స్వల్ప తగ్గుదల
ఇక సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర కొద్ది రోజులుగా స్వల్ప పెరుగుదల నమోదు చేస్తూ ఉంది. అయితే, గత ఆగస్టు 4న స్థిరంగా ఉంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.25,130 గా ఉంది. విశాఖపట్నంలో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.25,130గా ఉంది. ముంబయిలో మాత్రం గ్రాముకు రూ.7 తగ్గిన ప్లాటినం ధర ఆగస్టు 4న రూ.2506గా ఉంది.