Gold Silver Price Today: అలంకరణ + పెట్టుబడి లోహాలైన బంగారం, వెండి రెండూ పోటీ పడి మారథాన్‌ చేస్తున్నాయి, కొత్త జీవిత కాల గరిష్టాలను (life time high) టచ్‌ చేస్తున్నాయి. ఇవాళ (బుధవారం, 05 ఏప్రిల్‌ 2023) కూడా బంగారం ధర మరోసారి రూ. 61,000 స్థాయి దాటింది. వెండి కూడా తక్కువ తినలేదు, రూ. 75,000 మైలురాయిని అధిగమించింది. ఆల్ టైమ్ హై దగ్గర వెండి ట్రేడవుతోంది.


ఈరోజు MCXలో బంగారం, వెండి ధరలు
బంగారం & వెండి రెండూ MCXలో (మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్) గ్రీన్ మార్క్‌లో ట్రేడవుతున్నాయి. ఇవాళ, బంగారం ఏప్రిల్‌ ఫ్యూచర్స్‌లో ట్రేడింగ్‌ రూ. 61,024 వద్ద ప్రారంభమైంది. 10 గ్రాముల బంగారం ధర గరిష్టంగా రూ. 61,145కు చేరింది. రూ. 60,958 వద్ద కనిష్ట స్థాయిని తాకింది. ప్రస్తుతం రూ. 130 లేదా 0.61 శాతం లాభంతో ట్రేడవుతోంది.


మంగళవారం (04 ఏప్రిల్‌ 2023) ట్రేడ్‌లో, గోల్డ్‌ జూన్‌ ఫ్యూచర్స్‌ రూ. 61,145 వద్ద 'లైఫ్‌ టైమ్‌ హై'ని టచ్‌ చేసింది. 10 గ్రాములకు రూ. 970 లేదా 1.62% లాభపడింది. 


ఇవాళ, MCXలో, వెండి మే నెల ఫ్యూచర్స్‌ రూ. 400 పైగా ఎగబాకి ట్రేడ్‌ అవుతున్నాయి. ప్రస్తుతం, రూ. 412 లేదా 0.55 శాతం పెరిగి కిలోకు రూ.75,030 వద్ద ఉంది. ఇవాళ గరిష్టంగా కిలోకు రూ. 75,175, కనిష్టంగా రూ. 74,905 స్థాయికి 


రిటైల్ మార్కెట్‌లోనూ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు


రిటైల్ మార్కెట్‌లో కూడా బంగారం, వెండి విపరీతమైన బూమ్‌తో ట్రేడవుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.1,000కి పైగా పెరిగింది.


దిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 1,030 పెరిగి రూ. 61,510 వద్ద ట్రేడవుతోంది.


చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 980 పెరిగి రూ. 62,070 వద్ద ట్రేడవుతోంది.


ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 1,030 పెరిగి రూ. 61,360 వద్ద ట్రేడవుతోంది.


కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 1,030 పెరిగి రూ. 61,360 వద్ద ట్రేడవుతోంది.


హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 1,030 పెరిగి రూ. 61,360 వద్ద ట్రేడవుతోంది.



రిటైల్ మార్కెట్‌లో వెండి ధర


వెండి ధరలు రిటైల్ మార్కెట్‌లో విపరీతమైన జంప్‌తో ట్రేడ్‌ అవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో రూ. 80,000 పైన ఉన్నాయి.


దిల్లీలో కిలో వెండి ధర రూ. 2900 పెరిగి రూ. 80,700కి చేరింది.


ముంబైలో రూ. 2,490 పెరిగి రూ. 77,090గా ఉంది.


చెన్నైలో రూ. 2,900 పెరిగి రూ. 80,700కి ఎగబాకింది.


కోల్‌కతాలో రూ. 2,490 పెరిగి రూ. 77,090గా ఉంది.


హైదరాబాద్‌లో రూ. 2,900 పెరిగి రూ. 80,700 గా ఉంది. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.