Gold Price Today 30th April 2022: బంగారం ధరలు గత వారం రోజులు తగ్గుతూ వచ్చాయి. నేడు మరోసారి భారీగా పెరిగి పసిడి ప్రియులకు షాకిచ్చాయి. వెండి సైతం బంగారం బాటలోనే పయనించి స్వల్పంగా పెరిగింది. రూ.590 మేర పెరగడంతో తాజాగా హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,960కు ఎగబాకింది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.48,550 కు చేరింది. మరోవైపు వెండి ధర వారం రోజుల్లో రూ.4000 మేర తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్లో 1 కేజీ వెండి ధర రూ.69,200గా ఉంది.
ఏపీలో బంగారం ధర.. (Gold Rate Today In AP)
ఏపీ మార్కెట్లోనూ బంగారం ధరలు వారం రోజుల తరువాత నేడు పుంజుకున్నాయి. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం (Gold Rate in Vijayawada 30th April 2022) 10 గ్రాముల ధర రూ.52,960 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,550 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. గత వారం రోజుల్లో రూ.4000 తగ్గడంతో విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.69,200 అయింది.
విశాఖపట్నం, తిరుపతిలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. లైఫ్ టైమ్ రికార్డ్ రేట్లు నమోదు చేసిన బంగారం ధరలు స్వల్పంగా దిగొచ్చినా, నేడు మాత్రం రేట్లు షాకిచ్చాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,960 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,550 కు చేరింది. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్లో రూ.200 పెరగడంతో 1 కేజీ వెండి ధర రూ.69,200 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ప్రధాన నగరాల్లో బంగారం ధర..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,550 కాగా, 24 క్యారెట్ల బంగారం రూ.52,960 కి ఎగబాకింది.
చెన్నైలో బంగారం గరిష్ట ధరలు నమోదు చేసింది. రూ.520 మేర ధర పెరగడంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,970 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,420 తో దేశంలోనే రికార్డ్ ధరలో విక్రయాలు జరుగుతున్నాయి.
ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,550 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.53,960కి పుంజుకుంది.
పసిడి, వెండి ధరలపై పలు అంశాలు ప్రభావం..
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: అమాయకంగా అనేశాను- బాధపడకండీ, తనపై వచ్చిన విమర్శలకు కేటీఆర్ కౌంటర్!