బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటుచేసుకుంటూనే ఉంటాయి. ఈ రోజు ధరల విషయానికొస్తే భారత్‌లో బంగారం ధరలు ఈ రోజు (సెప్టెంబరు 9) న కూడా ధర కాస్త తగ్గింది. భారత్ లో 24 క్యారెట్ల బంగారం ధర మంగళవారం రూ.48,560 ఉండగా, బుధవారం రూ.47,410 ఉంది..ఈ రెండు రోజులతో పోలిస్తే ఈ రోజు ( గురువారం) కూడా బంగారం, వెండి ధరలు తగ్గాయి. భారత్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,120గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,120 గా ఉంది. కిలో వెండి ధర కూడా బుధవారం రూ.65,500 కాగా ఈ రోజు ( గురువారం) 64,800లు ఉంది.
తెలుగు రాష్ట్రాలో బంగారం, వెండి ధరలు
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,100, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,110
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 48,110
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 48,110 ఉంది.
బంగారం ధరల్లానే కిలో వెండి ధర కూడా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం ఈ మూడు ప్రధాన నగరాల్లోనూ ఒకేలా ఉంది. కిలో వెండి ధర రూ.69,100.
ప్రధాన నగరాల్లో బంగారం ధరల వివరాలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450
ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,120 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,120
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,520, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,570
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,350
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,110
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,110
ప్రధాన నగరాల్లో వెండి ధరల వివరాలు
కరోనా కాలంలో దేశీయంగా పెరిగిన వెండి ధరలు కూడా కొన్నిరోజుల నుంచి తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.
దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ.64,800 లుగా ఉంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వెండి ధర రూ. 64,800 వద్ద కొనసాగుతోంది.
తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ. 69,100గా ఉంది.
బెంగళూరులో వెండి ధర కిలో వెండి రూ.64,800 గా కొనసాగుతోంది.
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.64,800 లుగా ఉంది.
ఓవరాల్ గా గత పదిరోజులుగా (ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 8 వరకు) బంగారం ధరలు పరిశీలిస్తే సెప్టెంబరు 4,5 తేదీల్లో మాత్రమే స్వల్పంగా బంగారం ధర పెరింది. సెప్టెంబరు 1,6,7 తేదీల్లో ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. ఆ ముందు రోజు ఉన్న ధరే కొనసాగింది. మిగిలిన రోజుల్లో పసిడి ధర స్వల్పంగా తగ్గింది. ఈరోజు కూడా ధర స్వల్పంగా తగ్గంది.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు... ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..