Elon Musk Networth: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, పాపులర్ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా CEO అయిన ఎలాన్ మస్క్, కేవలం 2 నెలల్లో దాదాపు 9 లక్షల కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. అంటే, మస్క్ సంపద విలువ రెండు నెలల్లో 9 లక్షల కోట్ల రూపాయలు తగ్గింది. మస్క్ మామ ఆస్తిపాస్తుల్లో ఒడుదొడుకులు గతం నుంచి ఉన్నవే. అయితే, డొనాల్డ్ ట్రంప్‌తో జట్టు కట్టిన నాటి నుంచి అతను డబ్బు పోగొట్టుకోవడమే ఇక్కడున్న అసలు విషయం. అంటే, ట్రంప్‌తో స్నేహం కారణంగా మస్క్ మహా ఇబ్బంది పడుతున్నారు. వాస్తవానికి, ట్రంప్‌తో స్నేహం వల్ల మస్క్‌కు లాభం చేకూరుతుందని ప్రపంచమంతా భావిస్తే, ఇప్పుడు, దానికి విరుద్ధంగా జరగడం విశేషం.
మస్క్‌పై కోపంగా ఉన్న ప్రపంచ దేశాల ప్రజలు
అమెరికా ఫస్ట్ నినాదంతో ఓట్లు సంపాదించి అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్, తన ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి సుంకాల బెదిరింపులతో ప్రపంచ దేశాలన్నింటినీ ఇబ్బంది పెట్టాడు & పెడుతున్నాడు. ముఖ్యంగా, ఒకప్పుడు అమెరికాకు అత్యంత సన్నిహతంగా మెలిగిన ఉన్న యూరోపియన్ దేశాలు ఇప్పుడు క్రమంగా దూరదూరంగా జరుగుతున్నాయి. సుంకాల విధానం ట్రంప్‌తో పాటు అమెరికా మీద కూడా ఇతర దేశాలలో కోపాగ్నిని సృష్టించాయి. ప్రతీకార సుంకాల వల్ల అమెరికాలోనూ ధరలు పెరుగుతాయని యూఎస్ ప్రజలు కూడా ట్రంప్ & గవర్నమెంట్ మీద మండిపడుతున్నారు. యూఎస్‌తో పాటు ప్రపంచ దేశాల ప్రజల కోపాగ్ని సెగ ట్రంప్ సన్నిహితుడు ఎలాన్ మస్క్‌కూ తగులుతోంది. ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లా నుంచి కార్లు కొనకుండా ప్రజలు తమ కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ కారణంగా, మస్క్ ప్రతి నెలా భారీ నష్టాలను చవిచూస్తున్నారు.
అమ్ముడుపోని టెస్లా కార్లు
వాస్తవానికి, టెస్లా కార్లు హై ప్రీమియం & హై క్వాలిటీ కార్లు. అయినప్పటికీ, టెస్లా కార్ల అమ్మకాలు ఇప్పుడు వేగంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా యూరోపియన్ దేశాలలో, టెస్లా అమ్మకాలు భారీగా క్షీణించాయి (Tesla car sales are declining). ఒక్క జర్మనీలోనే టెస్లా కార్ సేల్స్ 76 శాతం తగ్గాయి. ఫ్రాన్స్‌లో 45 శాతం, ఇటలీలో 55 శాతం, నెదర్లాండ్స్‌లో 24 శాతం, స్వీడన్‌లో 42 శాతం, స్పెయిన్‌లో 10 శాతం పడిపోయాయి. ఆస్ట్రేలియా, చైనాలో కూడా టెస్లా కార్లు అమ్ముడుబోవడం లేదు. టెస్లా కార్ అమ్మకాలు ఆస్ట్రేలియాలో 66 శాతం క్షీణత కనిపించగా, చైనాలో 49 శాతం క్షీణత కనిపించింది.
టెస్లా షేర్లు కూడా పడిపోతున్నాయి
ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి టెస్లా షేర్లు దాదాపు 30 శాతం పడిపోయాయి. కేవలం నెల రోజుల్లోనే టెస్లా షేర్లు దాదాపు 25 శాతం పతమయ్యాయి. గూగుల్, ఎన్‌విడియాలో వచ్చిన క్షీణత కంటే టెస్లా షేర్లలో వచ్చిన పతనమే ఎక్కువగా ఉంది.
రూ.9 లక్షల కోట్ల నష్టం
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ రిపోర్ట్ ప్రకారం, ఈ సంవత్సరం ఎలాన్ మస్క్ సంపద 103 బిలియన్ డాలర్లు లేదా దాదాపు రూ. 9 లక్షల కోట్లు తగ్గింది. ఎలాన్ మస్క్ ప్రస్తుత నికర విలువ దాదాపు 330 బిలియన్ డాలర్లు. డొనాల్డ్ ట్రంప్‌తో స్నేహంతో, ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్ అవుతాడని అంతా అనుకుంటే, ఇప్పుడు దానికి భిన్నంగా జరుగుతోంది.
మరో ఆసక్తికర కథనం: పాత పద్ధతులు వదిలేయండి, ఈ క్వాలిటీస్ ఉంటే మీ సంపద సరసరా పెరుగుతుంది!