గొప్ప వ్యాపార వేత్తగా ఎదగాలని ఉందా? కరోనా మహమ్మారి తర్వాత ఉద్యోగ, వాణిజ్య రంగాల పరిస్థితి ఎలా ఉండనుంది? మారుతున్న కాలంలో ఎలాంటి నైపుణ్యాలు అవసరం అవుతాయి? దేశంలోని గొప్ప వ్యక్తుల ఆలోచనలు తెలుసుకోవాలని ఉందా? అయితే ఇది మీ కోసమే!


ఎప్పటిలాగే ఐఐటీ హైదరాబాద్‌ ఈ -సెల్‌ (ఆంత్రప్రెన్యూర్‌ సెల్‌) ఔత్సాహికుల కోసం వార్షిక ఈ-సమ్మిట్‌ను నిర్వహిస్తోంది. 2022, జనవరి 21 నుంచి 23 వరకు వర్చువల్‌గా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. ఈ సదస్సుకు 'ఏబీపీ దేశం' (http://abpdesam.com) డిజిటల్ పాట్నర్ గా ఉంది.



భారత్‌లో నిర్వహించే అతిపెద్ద వ్యాపార సదస్సుల్లో ఇదొకటి. ఐఐటీ హైదరాబాద్‌ ఈ-సెల్‌ ప్రతి సంవత్సరం ఈ సదస్సును నిర్వహిస్తుంటుంది. విద్యార్థులు, ఎర్లీ ఆంత్రప్రిన్యూర్స్‌, కార్పొరేట్లు, వెంచర్‌ క్యాపిటలిస్టులు, అంకుర సంస్థలను ఒకే వేదక మీదకు తీసుకొచ్చి ఆలోచనలు, అనుభవాలు పంచుకోవడంమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా సరికొత్త ఆలోచనలు రేకెత్తించే ఉపన్యాసాలు, ప్యానెల్‌ డిస్కషన్లు, పోటీలు ఉంటాయి.


ఈ ఏడాది 'పునరుజ్జీవానికి నాందీ వాచకం' (An Exordium of Resurgence) అనే థీమ్‌తో సదస్సును నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ మహమ్మారి వల్ల వ్యాపార, వాణిజ్య రంగాల్లో పెను మార్పులు వచ్చాయి. ఎన్నో వ్యాపారాలు మూత పడ్డాయి. కొత్తగా ఆలోచిస్తున్న వారికి లాభాలు వస్తున్నాయి. కొవిడ్‌ అనంతర కాలంలో వ్యాపారంలో విజయవంతం అవ్వాలంటే ఎలాంటి వ్యూహాలు రచించాలి? ఎలాంటి అడుగులు వేయాలి? మున్ముందు అవకాశాలు ఎలా ఉన్నాయి? వంటి ప్రశ్నలకు సదస్సులో సమాధానాలు అన్వేషిస్తారు.






కీలక ఉపన్యాసకులు


ఆశీశ్‌ చౌహాన్‌ - సీఈవో, ఎండీ, బాంబే స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌ (BSE)
డాక్టర్‌ అనురాగ్‌ బాత్రా - బిజినెస్‌ వరల్డ్‌ ఛైర్మన్‌, ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌
ప్రభాకర్‌ గుప్తా - యూట్యూబర్‌ (ప్రఖార్‌ కె ప్రవచన్‌)
దేవవ్రత్‌ ఆర్య -  టెక్నాలజీ ఉపాధ్యక్షుడు, పెప్పర్‌ఫ్రై
ఆశీశ్‌ దేశ్‌ పాండే - కో ఫౌండర్‌, డైరెక్టర్‌, ఎలిఫెంట్‌ డిజైట్‌
ఉదయ్‌ మహాజన్‌ - సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (హార్డ్‌వేర్‌ ప్రొడక్ట్), రెబెల్‌ ఫుడ్స్‌


ప్యానెల్‌ డిస్కషన్‌ అంశాలు


భారత్‌లో క్రిప్టో కరెన్సీ భవిష్యత్తు
జాక్‌ ఆఫ్‌ ఆల్‌ vs మాస్టర్‌ ఆఫ్‌ వన్‌ : జనరల్‌ vs నైస్‌ మార్కెట్స్‌
అంతరిక్ష వ్యాపార రంగం ఎదుగుదల
వ్యాపార రంగంలో మహిళలు


ఈ సదస్సులో పాల్గొనేందుకు 2022, జనవరి 19లోపు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి. 'EARLY22' కూపన్‌ కోడ్‌ ఉపయోగించే తొలి 50 మందికి రాయితీ లభిస్తుంది. పేరు నమోదు చేసుకొనేందుకు ఈ లింక్‌ క్లిక్‌ చేయండి.


మరిన్ని వివరాలకు


గొర్లె వర్షిత్‌ (PR & Networking Head) - 8309037804
నిషితా పట్నాయక్‌  (PR & Networking Head) - 9849803210
మెయిల్‌ ecell@iith.ac.in