Cryptocurrency Prices Today, 02 January 2022: క్రిప్టో మార్కెట్లు ఆదివారం స్తబ్దుగా ఉన్నాయి. కొనుగోళ్లు భారీగా జరగడం లేదు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ 0.38 శాతం పెరిగి రూ.37.69 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.67.28 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథిరియమ్ 0.80 శాతం పెరిగి రూ.2,99,431 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ విలువ రూ.33.30 లక్షల కోట్లుగా ఉంది.
బైనాన్స్ కాయిన్ 1.53 శాతం పెరిగి రూ.41,735, టెథెర్ 0.06 శాతం పెరిగి రూ.79.76, సొలానా 1.64 శాతం పెరిగి రూ.14,055, కర్డానో 2.50 శాతం పెరిగి రూ.1౦9, యూఎస్‌డీ కాయిన్ 0.05 శాతం పెరిగి 79.87 వద్ద కొనసాగుతున్నాయి. పవర్ లెడ్జర్, అయిలెఫ్, ఇంటర్‌నెట్ కో, సివిక్, గోలెమ్, యార్న్ ఫైనాన్స్, కర్వ్ డావో 7 నుంచి 52 శాతం లాభపడ్డాయి. సుషి, ఆగర్, ది సాండ్‌బాక్స్, పాలీగాన్, లూప్‌రింగ్, ఠీటా నెట్‌వర్క్ 0 నుంచి 2 శాతం వరకు నష్టాల్లో ఉన్నాయి.
హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.
క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ అసెట్. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.
భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి.
Also Read: Year End 2021: 2021లో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన టాప్-10 ఎస్‌యూవీ కార్లు ఇవే..
Also Read: Dual Mode Vehicle: ఇది బస్సే కాదు రైలు కూడా.. ఐడియా సూపర్ ఉంది కదా!
Also Read: Alto 2022: త్వరలో ఆల్టో కొత్త మోడల్ కూడా... బడ్జెట్‌లో సూపర్ కారు!