Cryptocurrency Prices Today, 15 December 2021: క్రిప్టో మార్కెట్లలో బుధవారం కాస్త కొనుగోళ్ల సందడి కనిపించింది. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ 2.84 శాతం తగ్గి రూ.38.88 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.69 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్‌ తర్వాత అతిపెద్ద మార్కెట్‌ విలువ కలిగిన ఎథిరియమ్‌ 2.57 శాతం తగ్గి రూ.3,11,200 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌ విలువ రూ.34 లక్షల కోట్లుగా ఉంది.


బైనాన్స్‌ కాయిన్‌ 0.80 శాతం పెరిగి రూ.42,505, టెథెర్‌ 0.07 శాతం తగ్గి రూ.80.74, సొలానా 7.89 శాతం పెరిగి రూ.13,436, కర్డానో 2.21 శాతం తగ్గి రూ.102, యూఎస్‌డీ కాయిన్‌ 0.08 శాతం తగ్గి రూ.80.67 వద్ద కొనసాగుతున్నాయి. ఎల్‌రాండ్‌, అవలాంచె, వేవ్స్‌, డోజీకాయిన్‌, పాలీగాన్‌, సొలానా, ది గ్రాఫ్‌ 10-17 శాతం లాభాల్లో ఉన్నాయి. స్టేటస్‌, న్యూమెరారి, లించ్‌, గోలెమ్‌, గాలా, ఫెచ్‌ ఏఐ, ఈఓఎస్‌ 3 శాతం వరకు నష్టపోయాయి.


హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్‌, ఎథిరెమ్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్‌ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్‌ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్‌, ఎథెర్‌, డోజీకాయిన్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.


క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్‌ అసెట్‌. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్‌ డేటాబేస్‌ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్‌ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.


భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, యాప్స్‌ చాలా అందుబాటులోకి వచ్చాయి.


Also Read: Netflix vs Amazon: అమెజాన్‌కు నెట్‌ఫ్లిక్స్ భారీ షాక్.. ధరలు 60 శాతం వరకు తగ్గింపు.. ఏ స్ట్రీమింగ్ సర్వీస్ ప్లాన్లు బెస్ట్?


Also Read: Bank Strike: కస్టమర్ అలర్ట్.. ఆ రెండు రోజులు బ్యాంకులు బంద్


Also Read: Upcoming Budget EVs: కొత్త కారు కొనాలనుకుంటున్నారా.. ఈ బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లపై ఓ లుక్కేయండి!


Also Read: Elon Musk: ఆ క్రిప్టోకరెన్సీని పేమెంట్‌గా యాక్సెప్ట్ చేస్తానన్న ఎలాన్ మస్క్.. ఏ కాయిన్ అంటే?


Also Read: Gold-Silver Price: గుడ్‌న్యూస్.. రూ.130 తగ్గిన పసిడి ధర.. నిలకడగా వెండి, నేటి ధరలు ఇవీ..


Also Read: Petrol-Diesel Price, 15 December: వాహనదారులకు గుడ్‌న్యూస్.. పెట్రో, డీజిల్ ధరల్లో స్వల్ప తగ్గుదల.. నేటి ధరలు ఎంతంటే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి