CRCS-Sahara Refund Portal: సహారా గ్రూప్‌లోని 4 కో-ఆపరేటివ్‌ సొసైటీల్లో డిపాజిట్లు చేసి నష్టపోయిన కోట్లాది మందికి డబ్బులు తిరిగి చెల్లించేందుకు "CRCS- సహారా రిఫండ్‌ పోర్టల్"ను (CRCS-Sahara Refund Portal) సెంట్రల్‌ గవర్నమెంట్‌ లాంచ్‌ చేసింది. సహారా బాధితులు ఈ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే, 45 రోజుల్లో రిఫండ్‌ వస్తుంది.


CRCS సహారా రిఫండ్‌ పోర్టల్ ద్వారా రిఫండ్‌ తీసుకోవడానికి ఎవరు అర్హులు?
ఈ 4 సహారా సొసైటీల్లో చట్టబద్ధంగా డబ్బులు డిపాజిట్‌ చేసిన వాళ్లు అర్హులు.
1. హమారా ఇండియా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, కోల్‌కతా
2 సహారా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, లఖ్‌నవూ
3. సహారాయన్ యూనివర్సల్ మల్టీపర్పస్ సొసైటీ లిమిటెడ్, భోపాల్
4. స్టార్స్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, హైదరాబాద్


CRCS సహారా రిఫండ్‌ పోర్టల్‌లో క్లెయిమ్‌ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఏంటి?
క్లెయిమ్ చేసుకునే డిపాజిటర్లకు ఈ కింది తేదీల కంటే ముందు, ఆయా సొసైటీల్లో బకాయిలు ఉండాలి:
22 మార్చి 2022కు ముందు:
1. హమారా ఇండియా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, కోల్‌కతా
2. సహారా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, లక్నో
3. సహారాయన్ యూనివర్సల్ మల్టీపర్పస్ సొసైటీ లిమిటెడ్, భోపాల్
29 మార్చి 2023 దీని కోసం:
a. స్టార్స్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, హైదరాబాద్


రిఫండ్‌ పొందడానికి ఏమేం అవసరం?
పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకోవడానికి.. ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్, ఆధార్‌తో లింక్ అయిన బ్యాంక్ ఖాతా ఉండాలి. మీ డిపాజిట్ నంబర్, మీ పెట్టుబడి వివరాలు సహా అవసరమైన డాక్యుమెంట్లు ఉండాలి. మీ క్లెయిమ్ రూ. 50,000 కంటే ఎక్కువ ఉంటే పాన్‌ నంబర్‌ ఇవ్వాలి. అవసరమైన డాక్యుమెంట్లను పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి.


క్లెయిమ్ ఫారాన్ని ఫైల్ చేయడానికి డబ్బులు కట్టాలా?
లేదు, ఇది ఉచితం


పోర్టల్‌ లింక్ ఏంటి?
వెబ్‌సైట్ లింక్ https://mocrefund.crcs.gov.in/Help


రిఫండ్‌ ప్రాసెస్‌కు 45 రోజులు ఎందుకు?
సహారా డిపాజిట్లర్లు రిఫండ్‌ కోసం అప్లై చేసిన తర్వాత, సహారా గ్రూప్ కమిటీ 30 రోజుల్లో ఆ వివరాలను ధృవీకరించుకుంటుంది. ఆ తర్వాత 15 రోజుల్లో లేదా దరఖాస్తు చేసిన 45 రోజుల లోపు పెట్టుబడిదార్లకు SMS లేదా వెబ్‌సైట్ ద్వారా ఇన్ఫర్మేషన్‌ అందుతుంది. క్లెయిమ్ చేసిన డబ్బు నేరుగా డిపాజిటర్ ఆధార్ సీడెడ్ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.


ఆధార్‌తో లింక్‌ అయిన బ్యాంక్ ఖాతా లేకుంటే రిఫండ్‌ కోసం ఫైల్ చేయవచ్చా?
ప్రస్తుతానికి దీనికి అనుమతి ఇవ్వలేదు. ఆధార్ లింక్‌డ్‌ బ్యాంక్ అకౌంట్‌ లేకుండా డిపాజిటర్ క్లెయిమ్ ఫైల్ చేయలేరు. 


సహారా రిఫండ్‌ కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
స్టెప్‌ 1: https://mocrefund.crcs.gov.in/Help లింక్‌ ద్వారా రిఫండ్ పోర్టల్‌లోకి వెళ్లండి
స్టెప్‌ 2: హోమ్ పేజీలో Registration క్లిక్ చేయండి
స్టెప్‌ 3: ఆధార్ లింక్ చేసిన మొబైల్ నంబర్, బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌ ఎంటర్ చేయండి. Generate OTPపై క్లిక్ చేయండి
స్టెప్‌ 4: OTP నమోదు చేసి వెరిఫై చేయండి
OTP వెరిఫై అయితే, మీ అప్లికేషన్‌ రిజిస్ట్రేషన్‌ పూర్తయినట్లు అర్ధం.


మరో ఆసక్తికర కథనం: రైలు ప్రయాణీకులకు బిగ్‌ రిలీఫ్‌, ₹10 లక్షల ఇన్సూరెన్స్‌ ఆటోమేటిక్‌గా అప్లై అవుతుంది


Join Us on Telegram: https://t.me/abpdesamofficial