Coca Cola liquor brand Lemon-Dou: కూల్‌డ్రింక్‌ అనగానే చాలా మందికి థమ్స్‌ అప్‌ ‍‌(Thumps Up) గుర్తుకొస్తుంది. ఇది కోకా కోలా కంపెనీకి చెందిన బ్రాండ్‌. మన దేశంలో, ధమ్స్‌ అప్‌తో పాటు ఇంకా చాలా బ్రాండ్స్‌ను (Coca Cola brands in India) కోకో కోలా అమ్ముతోంది. అవి.. లిమ్కా, ఫాంటా, స్ర్పైట్‌, మాజా, కోకా కోలా జీరో షుగర్‌, డైట్‌ కోక్‌, ష్వెప్స్, ఛార్జ్‌డ్‌. ఇవి కాకుండా... కిన్లే, మినిట్‌ మెయిడ్‌, స్మార్ట్‌ వాటర్‌, రిమ్‌ జిమ్‌, హానెస్ట్‌ టీ, కోస్టా కాఫీ, జార్జియా కూడా కోలా బ్రాండ్సే.


ప్రపంచంలో అతి పెద్ద కార్పొనేటెడ్‌ డ్రిక్స్‌ (Carbonated drinks) తయారీ కంపెనీ కోకా కోలా, మన దేశంలో తొలిసారిగా మద్యం విభాగంలోకి (alcohol beverages segment) అడుగు పెట్టింది, కొత్త లిక్కర్‌ బ్రాండ్‌ను ప్రజలకు రుచి చూపిస్తోంది. ఈ కంపెనీ, ఇండియాలో లాంచ్‌ చేసిన మద్యం బ్రాండ్ పేరు లెమన్ డో (Lemon-Dou). 


రెండు రాష్ట్రాల్లో లెమన్ డో టెస్టింగ్‌ 
ఎకనమిక్‌ టైమ్స్‌ కథనం ప్రకారం... ప్రస్తుతం గోవా, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో లెమన్ డో అమ్ముతున్నారు. దీని 250 ml క్యాన్ ధర 230 రూపాయలు.


ఇండియాలో మద్యం విక్రయాలు ప్రారంభించారన్న వార్తను కోకా కోలా ఇండియా ధృవీకరించింది. ఎకనమిక్ టైమ్స్‌కు ఆ కంపెనీ ఇచ్చిన సమాచారాన్ని బట్టి, ప్రస్తుతం, లెమన్ డో పైలట్ టెస్టింగ్ జరుగుతోంది. అంటే.. ఇండియా జనానికి దీని కిక్కు ఎక్కుతుందా, లేదా?; ఇక్కడ హిట్టవుతుందా, ఫట్టవుతుందా?; ఏవైనా మార్పులు చేయాలా అని టెస్ట్‌ చేస్తున్నారు. 


లెమన్ డో, ఇండియాలోకి ఈ మధ్యే అడుగు పెట్టినా... ఇది ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేశాల ప్రజలకు కిక్‌ ఇస్తోంది. ఇప్పుడు భారత్‌లో దీనిపై ప్రజల అభిప్రాయాలు సేకరిస్తున్నారు. జనాభిప్రాయాన్ని బట్టి... అవసరమైతే ఈ బేవరేజ్‌ టేస్ట్‌, రేట్‌ వంటి విషయాల్లో మార్పులు చేస్తారు. ఆ తర్వాత మొత్తం ఇండియాలో అందుబాటులోకి తెస్తారు.


లెమన్ డో టేస్ట్‌ ఎలా ఉంటుంది?
లెమన్ డో అనేది ఒక రకమైన ఆల్కహాల్ మిక్స్. ఇందులో వోడ్కా, బ్రాందీ వంటి డిస్టిల్డ్ లిక్కర్‌ను ఉపయోగిస్తున్నారు. కోకా కోలా ఇండియా చెప్పిన ప్రకారం, దీనిని విదేశాల్లో మాత్రమే తయారు చేస్తున్నారు. ఇండియాలో ఉన్న ఫ్లాంట్ల లెమన్‌ డోను ఉత్పత్తి చేయడం లేదు.


శీతల పానీయాల మార్కెట్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకున్న గ్లోబల్ కంపెనీలు కోక్, పెప్సీ (Pepsi).. ఇప్పుడు ఆల్కహాల్‌ సెగ్మెంట్‌ మీద ఫోకస్‌ పెంచాయి. ఈ రెండు జెయింట్స్‌ ఒకదాని తర్వాత ఒకటి లిక్కర్‌ మార్కెట్‌లోకి అడుగు పెట్టాయి. కోకా కోలా, జపాన్‌లో కూడా లెమన్ డోను విడుదల చేసింది. పెప్సికో, అమెరికన్ మార్కెట్‌లో మౌంటెన్ డ్యూ ఆల్కహాలిక్ వెర్షన్‌ను లాంచ్‌ చేసింది. దీనికి హార్డ్ మౌంటైన్ డ్యూ అని పేరు పెట్టింది. 


రూ.3300 కోట్ల పెట్టుబడితో గుజరాత్‌లోని సనంద్‌లో ప్లాంట్‌ ఏర్పాటు చేయనున్నట్లు కోకా కోలా ఇటీవల ప్రకటించింది.


మరో ఆసక్తికర కథనం: జాక్‌పాట్‌ కొట్టిన అదానీ ఇన్వెస్టర్లు, ఐదు రోజుల్లోనే రూ.20,000 కోట్ల లాభం