Income Tax Slab 2024: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. లోక్‌సభ ఎన్నికల ముందు ఓట్ ఆన్ అకౌంట్‌ బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన సీతారామన్ ఇప్పుడు పూర్తి స్థాయి పద్దు వివరాలు వెల్లడించారు. ఉద్యోగులంతా ఎంతగానో ఎదురు చూస్తున్న ఆదాయ పన్ను శ్లాబులపై కీలక ప్రకటన చేశారు. ఈ శ్లాబ్‌లలో ఎలాంటి మార్పు చేయడం లేదని వెల్లడించారు. పాత శ్లాబులే కొనసాగుతాయని స్పష్టం చేశారు. సకాలంలో టీడీఎస్ చెల్లించకపోవడం ఇకపై నేరం కాదని తెలిపారు. అంతే కాదు ఆదాయపన్ను చెల్లింపును మరింత సులభతరం చేేస్తామన్నారు. ప్రస్తుతమున్న శ్లాబ్‌ల ప్రకారం రూ.3 లక్షల ఆదాయం వరకూ ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదు. అయితే...ఈ పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని చాలా మంది కోరుకున్నారు. అందుకు తగ్గట్టుగానే శ్లాబ్‌లలో మార్పులు ఉంటాయని ఆశించినా అదేమీ కాలేదు. కాకపోతే స్టాండర్డ్ డిడక్షన్ ని మాత్రం రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. 


కొత్త పన్ను విధానమిదే..


కొత్త పన్ను విధానాన్ని ప్రకటించారు. రూ.3 లక్షల వరకూ ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. రూ.3-7 లక్షల వరకూ ఆదాయం ఉన్న వాళ్లు 5% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రూ.7-10 లక్షల వరకు ఆదాయమున్న వాళ్లకు 10% పన్ను, రూ.10-12 లక్షల వరకు 15%,  
రూ.12- 15 లక్షల వరకూ 20%, రూ.15 లక్షల వరకూ ఆదాయం ఉన్న వాళ్లకి 30% పన్ను వసూలు చేస్తారు. ఇక ఈ కొత్త పన్ను విధానం ద్వారా రూ.17,500 వరకూ ఆదా కానుంది. 






గత బడ్జెట్‌లో జరిగిన మార్పులివే..


గత బడ్జెట్‌లో అంటే..2023-24 ఆర్థిక సంవత్సరంలో పన్ను శ్లాబ్‌లకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. పన్ను శ్లాబ్‌లలో మార్పులు చేశారు. కొత్త శ్లాబ్‌లను డిఫాల్ట్‌గా ఎంచుకోవడంతో పాటు పాత పన్ను విధానాన్నీ ఎంచుకునే అవకాశం కల్పించింది. ఈ కొత్త శ్లాబ్‌ల ప్రకారం రూ.3 లక్షల వరకూ ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.3-6 లక్షల వరకూ 5% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక రూ. 6-9 లక్షల ఆదాయం ఉన్న వాళ్లు రూ.15 వేలతో పాటు 10% పన్ను చెల్లించాలి. రూ.9-12 లక్షల ఆదాయమున్న వాళ్లు రూ.45 వేలతో పాటు 15% పన్ను కట్టాలి. రూ. 12-15 లక్షల ఆదాయం ఉన్న వాళ్లని 20% శ్లాబ్‌గా పరిగణిస్తారు. వీళ్లు రూ. 90 వేలతో పాటు ఆ పన్నుకి కట్టాల్సి ఉంటుంది. రూ.15 లక్షలకు మించిన ఆదాయం ఉంటే రూ.లక్షన్నరతో పాటు 30% పన్ను చెల్లించాలి. ఇప్పుడు ఈ శ్లాబ్‌లలో సవరణలు చేసింది. రూ.3 లక్షల వరకూ ఎలాంటి పన్ను చెల్లించాల్సి పని లేదని వెల్లడించింది. 


Also Read: Union Budget 2024: మధ్య తరగతికి మేలు చేసే బడ్డెట్ ఇది, నిర్మలా సీతారామన్ పద్దుపై ప్రధాని ప్రశంసలు