Income Tax: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదో బడ్జెట్‌ను శనివారం లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో చేపట్టే భారీ మార్పులు వెల్లడించారు. దేశంలోని మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించే ఉద్దేశ్యంతో పన్ను మినహాయింపు పరిమితి పెచ్చారు. పాత పన్ను విధానంలో ఎటువంటి మార్పులు చేయలేదు. 
కొత్త ఆదాయపు పన్ను విధానంలో పన్ను స్లాబ్‌ల్లో సవరణలు కూడా ప్రకటించారు.

పన్ను స్లాబ్‌లతో ప్రతిపాదిత కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ఎలా ఉందో చూద్దాం. 12 లక్షల ఆదాయం దాటిన వాళ్లకు ఈ లెక్కన పన్ను వేస్తారు. 

కొత్త ఆదాయపు పన్ను విధానంలో ప్రతిపాదిత మార్పులు

మొత్తం ఆదాయం(రూపాయల్లో..)  పన్ను శాతం  (%)
0-4 లక్షల మధ్య  Nil
4-8 లక్షల మధ్య  5%
8-12 లక్షల మధ్య  10%
12-16 లక్షల మధ్య  15%
16-20 లక్షల మధ్య  20%
20-24 లక్షల మధ్య  25%
24 లక్షలకు మించితే  30%

 

రూ. 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేదు
రూ. 12 లక్షల వరకు ఆదాయం ఉన్న ఉద్యోగులు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని సీతారామన్ తెలియజేశారు. అయితే, ఈ రాయితీ ప్రాథమిక ఆదాయంపై మాత్రమే వర్తిస్తుంది. "కొత్త విధానంలో రూ. 12 లక్షల ఆదాయం వరకు ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదని ప్రకటించడానికి నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. రూ. 75,000 స్టాండర్డ్‌ డిడక్షన్ కారణంగా పన్ను చెల్లింపుదారులకు ఈ పరిమితి రూ. 12.75 లక్షలుగా ఉంటుంది" అని మంత్రి తెలిపారు. 

Also Read: రూ. 50.65,345 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్‌ ఏ శాఖకు ఎంత కేటాయించారంటే...?

కొత్త ఆదాయపు పన్ను విధానంలో మీరు ఎంత పన్ను ఆదా చేస్తారు?
ప్రభుత్వం ప్రకారం, ప్రతిపాదిత కొత్త ఆదాయపు పన్ను విధానంలో మీ పన్నును ఎలా లెక్కిస్తారో కొన్ని ఉదాహరణలు ఇవి.

ఆదాయం ఆదాయపు పన్ను శ్లాబ్‌ (ప్రస్తుతం ఉన్నది) ఆదాయపు పన్ను శ్లాబ్‌ (కొత్తది) Benefit Of Rate/Slab Rebate Benefit (Full up to Rs 12 Lakh) Total Benefit Tax After Rebate Benefit
8 Lakh Rs 30,000 Rs 20,000 Rs 10,000 Rs 20,000 Rs 30,000 0
9 Lakh Rs 40,000 Rs 30,000 Rs 10,000 Rs 30,000 Rs 40,000 0
10 Lakh Rs 50,000 Rs 40,000 Rs 10,000 Rs 40,000 Rs 50,000 0
11 Lakh Rs 65,000 Rs 50,000 Rs 15,000 Rs 50,000 Rs 65,000 0
12 Lakh

Rs 80,000

Rs 60,000 Rs 20,000 Rs 60,000 Rs 80,000 0
16 Lakh Rs 1,70,000 Rs 1,20,000 Rs 50,000 0 Rs 50,000 Rs 1,20,000
20 Lakh Rs 2,90,000 Rs 2,00,000 Rs 90,000 0 Rs 90,000 Rs 2,00,000
24 Lakh Rs 4,10,000 Rs 3,00,000 Rs 1,10,000 0 Rs 1,10,000 Rs 3,00,000
50 Lakh Rs 11,90,000 Rs 10,80,000 Rs 1,10,000 0 Rs 1,10,000 Rs 10,80,000

Also Read: బడ్జెట్‌ 2025లో ప్రకటించిన కొత్త ఐటీ శ్లాబ్‌ల ప్రకారం ఎవరికి ఎంత జీతం ఆదా అవుతుంది?