CrickPe APP: భారత్‌పే సహ వ్యవస్థాపకుడు, థర్డ్‌ యూనికార్న్‌ (Third Unicorn) కంపెనీ ఓనర్‌ 'అష్నీర్ గ్రోవర్' (Ashneer Grover), కొత్తగా క్రికెట్‌ రంగంలోకి అడుగు పెట్టారు. క్రికెట్ ఫాంటసీ స్పోర్ట్స్ యాప్‌ "క్రిక్‌పే" (CRICKPE) లాంచ్‌తో తన అరంగ్రేటాన్ని చాటారు. 


ఇండియన్ ప్రీమియం లీగ్ (IPL) మరో వారంలో ప్రారంభం కానున్న తరుణంలో అష్నీర్‌ గ్రోవర్ ఈ యాప్‌ను తీసుకు వచ్చారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలియజేశారు.


క్రిక్‌పే యాప్‌ గురించి..
థర్డ్‌ యూనికార్న్‌ కంపెనీ క్రిక్‌పే యాప్‌ను లాంచ్‌ చేసింది. ఈ విషయం గురించి గురువారం (23 మార్చి 2023) రోజున ట్వీట్ చేసిన గ్రోవర్‌.. గూగుల్ ప్లే స్టోర్ & ఆపిల్ స్టోర్ నుంచి క్రిక్‌పే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. వాటి లింక్‌లను కూడా షేర్ చేశారు. 


'ఐపీఎల్ తర్వాత క్రికెట్‌లో అతి పెద్ద విప్లవం' (Biggest revolution in Cricket since IPL) అని తన యాప్‌ లాంచ్‌ను అభివర్ణించారు గ్రోవర్‌. మిమ్మల్ని, క్రికెట్‌ను గెలిపించే ఫాంటసీ యాప్‌ను పరిచయం చేసున్నట్లు వెల్లడించారు. 


 






"CrickPe అనేది భారతదేశానికి చెందిన అత్యంత ప్రత్యేకమైన & శక్తిమంతమైన ఫాంటసీ క్రికెట్ గేమింగ్ యాప్. ఇక్కడ ప్రతిరోజూ 'క్రికెట్ గెలుస్తుంది'!. ఇది ప్రపంచంలోని ఏకైక ఫాంటసీ క్రికెట్ యాప్. ఇందులో ప్రతి మ్యాచ్‌లో, ఆడే అసలైన క్రికెటర్లు, క్రికెట్ జట్లు, నిజమైన జట్టు యజమానులు ఫాంటసీ గేమ్-విన్నర్స్‌తో పాటు నగదు రివార్డులను గెలుచుకుంటారు" అని ఈ మొబైల్‌ అప్లికేషన్‌ గురించి గూగుల్ ప్లే స్టోర్‌లో వివరించారు.


అష్నీర్ గ్రోవర్‌ రోడ్‌ అంత సాఫీగా లేదు
క్రికెట్‌ యాప్‌ రంగంలో ఇప్పటికే కొన్ని కంపెనీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. డ్రీమ్ 11 (Dream11), మొబైల్ ప్రీమియర్ లీగ్ (Mobile Premier League - MPL) గేమ్స్‌24x7 సంస్థకు చెందిన మై 11 సర్కిల్ (My11Circle) యాప్‌లకు మిలియన్ల కొద్దీ యూజర్లు ఉన్నారు. ఈ యాప్‌ల పోటీని తట్టుకుని క్రిక్‌పే నిలబడాల్సి ఉంటుంది. కాబట్టి, అష్నీర్ గ్రోవర్‌కు ఈ మార్గం అంత సులభం కాదు.


అష్నీర్ గ్రోవర్, "థర్డ్ యునికార్న్ ప్రైవేట్ లిమిటెడ్" కోసం సుమారు $4 మిలియన్ల నిధులు సేకరించారు. ఫండింగ్ రౌండ్‌లో అన్మోల్ సింగ్ జగ్గీ, అనిరుధ్ కేడియా, విశాల్ కేడియా సహా రెండు డజన్ల మంది ఏంజెల్ ఇన్వెస్టర్లు పాల్గొన్నారు.


BharatPe, Grofers కంపెనీలు గ్రోవర్‌తో సంబంధం ఉన్న తొలి రెండు యునికార్న్‌లు.


గత సంవత్సరం, తన 40వ పుట్టినరోజు సందర్భంగా, మరో "యునికార్న్"ని నిర్మించే ప్రణాళికలతో వ్యాపార ప్రపంచంలోకి మళ్లీ ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నట్లు గ్రోవర్‌ ప్రకటించారు. తన ట్విట్టర్ పోస్ట్‌లో, “మరో రంగానికి అంతరాయం కలిగించే సమయం వచ్చింది. ఇది మూడో యునికార్న్ సమయం" అని రాసుకొచ్చారు.


అష్నీర్ గ్రోవర్ తరచుగా చర్చలో ఉంటాడు
అష్నీర్ గ్రోవర్ వెలుగులో ఉన్నాడు. భారత్‌పే విషయంలో అష్నీర్ గ్రోవర్ కూడా వివాదాల్లో ఉన్నారు. అష్నీర్ గ్రోవర్ భారత్ పే మరియు గ్రోఫర్ దో యునికార్న్‌తో అనుబంధం కలిగి ఉన్నాడు.