Best Cycles Under 10000 : పిల్లలు, స్కూల్ విద్యార్థుల  అవసరాల కోసం చాలా మంది  సైకిళ్లు కొనుగోలు చేస్తుంటారన్న సంగతి తెలిసిందే. మరి కొంతమంది ఆరోగ్యం కోసం సైకిల్‌ తొక్కేందుకు ఆసక్తి చూపుతుంటారు. అసలే ప్రస్తుతం బిజీ లైఫ్‌స్టైల్​తో  చాలా మంది వ్యాయామానికి దూరమవుతున్న సంగతి తెలిసిందే. శారీరక శ్రమ తక్కువ అవ్వడం, డెస్క్‌ జాబ్స్‌ కారణంగా చిన్న వయసులోనే అధిక బరువు, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.  అందుకే కసరత్తులు చేయని వారి కోసం  సైకిలింగ్‌ బెస్ట్‌ ఆప్షన్‌. కాబట్టి  చిన్న చిన్న పనులకు సైకిల్ మీద వెళితే  ఆరోగ్యంతో పాటు బండి తీయకపోవడం వల్ల పెట్రోల్ కూడా ఆదా అవుతుంది. శరీరానికి వ్యాయామం దొరుకుతుంది. కాబట్టి ఏ మాత్రం అవకాశం ఉన్నా సైకిల్ కొనడం ఎంతో మేలు.  


మరి మీరు కూడా మంచి సైకిల్‌  కొనాలని ఎదురు  చూస్తున్నారా? అయితే  రూ.10,000 బడ్జెట్లో మంచి గేర్​ సైకిళ్లు మార్కెట్​లో అందుబాటులో ఉన్నాయి. అలానే బెస్ట్ మౌంటెయిన్ బైస్కిల్స్ కూడా ఉన్నాయి.  కాబట్టి వీటిలో బెస్ట్ బ్రాండ్స్  ఏంటి? వాటిలో ఏ ఫీచర్స్ ఉన్నాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


1. Urban Terrain Galaxy  - ఇది మల్టీ స్పీడ్ హై పెర్ఫామెన్స్​ మౌంటెయిన్ సైకిల్. ముఖ్యంగా మగవారికి పర్ఫెక్ట్ ఛాయిస్​. ఈ సైకిల్ హై క్వాలిటీ యాక్ససరీస్​తో వస్తోంది.


ఫీచర్స్‌..
18 అంగుళాల ఫ్రేమ్ సైజ్
షిమానో గేర్స్
స్మూత్ గేర్ షిఫ్టింగ్
ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్​
26 ఇంచ్ వీల్స్​
అడ్జస్టబుల్ సీట్ అండ్ హ్యాండిల్ బేర్స్



2. Leader Gladiator 26t -  ఇది మల్టీస్పీడ్ బైస్కిల్​. లైట్​ వేట్​ ఉంటుంది. వేగంగా వెళ్లే వారి కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఫాస్ట్​ రైడింగ్ చేసేవారికి బెస్ట్ ఛాయిస్. 


ఫీచర్స్​..
అలుమినియమ్ అలాయ్​ ఫ్రేమ్
21 స్పీడ్ షిమానో గేర్స్
ఫ్రంట్ సస్పెన్షన్ ఫోర్క్
27.5 ఇంచ్ వీల్స్​
పవర్​ ఫుల్ వీ బ్రేక్స్



3. Leader Beast 24T -  ఈ మౌంటెయిన్ బైస్కిల్ ఆఫ్​ రోడ్ అడ్వెంచర్స్​ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. డుయెల్ డిస్క్​ బ్రేక్, పవర్ ఫుల్ సస్పెన్షన్​, డూరబుల్​ ఫ్రేమ్​ ఇందులో ఉన్నాయి. మౌంటెయిన్ బైకింగ్​ చేసే రైడర్స్​ ఇది పర్ఫెక్ట్​గా ఉంటుంది.


ఫీచర్స్​..
 స్టీల్ ఫ్రేమ్​, ఫ్రంట్ సస్పెన్షన్​
18 స్పీడ్ షిమానో గేర్స్​
29 ఇంచ్​ నాబీ టైర్స్​
మెకానికల్ డిస్క్ బ్రేక్స్​
డుయెల్ డిస్క్​ బ్రేక్
వైడ్ హ్యాండిల్ బార్స్​
బ్లాక్ అండ్ ఆరెంజ్​ కలర్​లో అందుబాటులో ఉంటుంది.


4. Urban Terrain UT1000S26  -  ఇది మగవారి కోసం ప్రత్యేకంగా రూపొందించారు. అర్బన్​, ఆఫ్​ రోడ్​.. రెండింటిలోనూ అద్భుతంగా నడుస్తుంది. స్లీక్ డిజైన్​, స్టైలిష్​గా ఉంటుంది. 


ఫీచర్స్​..


స్టీల్ ఫ్రేమ్​, ఫ్రంట్ సస్పెన్షన్​
21 స్పీడ్ షిమానో గేర్స్​
స్మూత్ గేర్ సిస్టమ్
26 ఇంచ్ డబుల్ వాల్ అలాయ్ రిమ్స్​
పవర్​ఫుల్ వీ బ్రేక్స్​
అడజ్టబుల్ సాడిల్​ అండ్ హ్యాండిల్ బార్స్​


5. VESCO Drift NXG 26-T - ఈ మౌంటెయిన్ బైస్కిల్ ఆఫ్ రోడ్ మీడ్​ హై స్పీడ్ పెర్ఫామెన్స్ ఇస్తుంది. ఛాలెంజింగ్ ఉన్న రోడ్లపై కూడా రైడర్స్​కు మంచి థ్రిల్​ను ఇస్తుంది. ఈ స్పీడ్ గేర్​ సైకిల్ డురబుల్ ఫ్రేమ్​తో  వస్తోంది.


ఫీచర్స్​..
స్టీల్ ఫ్రేమ్, సస్పెన్షన్ ఫోర్క్​
18 స్పీడ్ షిమానో గేర్స్
26 ఇంచ్ డబుల్ వాల్ అలాయ్ రిమ్స్​
ఫ్రంట్​ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్​
అగ్రెసివ్​ నాబీ టైర్స్​
 బ్రేక్​ సిస్టమ్ పర్ఫెక్ట్​గా ఉంటుంది.


6. Geekay Speed 2.0  Multispeed 27.5T - ఈ బైస్కిల్​ 21 స్పీడ్​ గేర్స్​తో వస్తోంది. క్యాజువల్ రైడర్స్​, కొత్తగా నేర్చుకునేవారికి బెస్ట్ ఛాయిస్. సైకిల్ డిజైన్​ కూడా ఆకర్షణీయంగా ఉంటుంది.   


ఫీచర్స్..
స్టీల్ ఫ్రేమ్​, ఫ్రంట్ సస్పెన్షన్​
21 స్పీడ్ షిమానో గేర్స్​
26 ఇంచ్ డబుల్ అలాయ్​ రిమ్స్​
వీ బ్రేక్స్​ సిస్టమ్
అడ్జస్టబుల్​ సాడిల్ అండ్ హ్యాండిల్​ బార్స్​


Also Read: వాకింగ్ చేస్తుంటే కాలి పిక్కల్లో నొప్పి వస్తోందా? కారణాలు ఇవే!