Banks Will Remain Closed For 15 Days In October 2024: సెప్టెంబర్ ముగియబోతోంది, కొత్త నెల అక్టోబర్‌ అతి త్వరలో ప్రారంభమవుతుంది. కీలకమైన పండుగల కారణంగా అక్టోబర్‌లో బ్యాంక్‌లకు చాలా రోజులు సెలవులు వస్తున్నాయి. శారదీయ నవరాత్రి నుంచి దసరా, దీపావళి వరకు హాలిడేస్‌ లిస్ట్‌ చాలా పెద్దగా ఉంటుంది. వచ్చే నెలలో మీరు ఏదైనా బ్యాంక్‌ లావాదేవీ చేయాలనుకుంటే, ముందుగా ఈ హాలిడేస్‌ లిస్ట్‌ను (Bank Holidays List October 2024) సేవ్‌ చేసుకోండి. ఈ లిస్ట్‌ చూసిన తర్వాత మాత్రమే ఇంటి నుంచి బయలుదేరండి, లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది.


అక్టోబర్‌లో బ్యాంకులకు 15 రోజులు సెలవులు
బ్యాంక్ అనేది ప్రజా జీవితంతో పెనవేసుకుపోయిన ముఖ్యమైన ఆర్థిక సంస్థ. ఏ కారణం వల్లనైనా బ్యాంక్‌ మూతబడితే, ప్రజలకు సంబంధించిన చాలా పనులు ఆగిపోతాయి. ఈ నేపథ్యంలో, కస్టమర్ల సౌలభ్యం కోసం, రిజర్వ్ బ్యాంక్ నెల ప్రారంభానికి కంటే ముందే బ్యాంక్‌ హాలిడేస్‌ లిస్ట్‌ను విడుదల చేస్తోది. ఆర్‌బీఐ ప్రకారం, అక్టోబర్‌లోని 31 రోజుల్లో బ్యాంకులు 15 రోజులు సెలవుల్లోనే ఉంటాయి. శనివారం, ఆదివారం సెలవులు సహా వివిధ పండుగల సెలవులు కూడా ఇందులో కలిసి ఉన్నాయి. అక్టోబర్‌లో... గాంధీ జయంతితో పాటు దుర్గాపూజ, దసరా, లక్ష్మీపూజ, కటి బిహు, దీపావళి వంటి పర్వదినాలు ఉన్నాయి. జమ్ము&కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల కారణంగా బ్యాంకులు అదనంగా ఒక రోజు మూతబడతాయి.


అక్టోబర్‌ నెల ప్రారంభం నుంచే బ్యాంక్‌ హాలిడేస్‌ స్టార్ట్‌ అవుతాయి, నెల చివరి రోజు వరకు కంటిన్యూ అవుతాయి. అయితే, రాష్ట్రాన్ని బట్టి సెలవు తేదీలు మారతాయి.


అక్టోబర్‌ నెలలో బ్యాంక్‌ సెలవు రోజులు ‍‌(Bank Holidays in October 2024): 


01 అక్టోబర్ 2024 ---- అసెంబ్లీ ఎన్నికల కారణంగా జమ్ములో బ్యాంకులు పని చేయవు
02 అక్టోబర్ 2024 ---- గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
03 అక్టోబర్ 2024 ---- నవరాత్రుల ప్రారంభం సందర్భంగా జైపుర్‌లోని బ్యాంకులకు హాలిడే
06 అక్టోబర్ 2024 ---- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా సెలవు
10 అక్టోబర్ 2024 ---- దుర్గాపూజ, దసరా, మహా సప్తమి కారణంగా అగర్తల, గౌహతి, కోహిమా, కోల్‌కతాలో బ్యాంకులు మూతబడతాయి
11 అక్టోబర్ 2024 ----  దసరా, మహా అష్టమి, మహా నవమి, ఆయుధ పూజ, దుర్గాపూజ, దుర్గాష్టమి కారణంగా చాలా రాష్ట్రాల్లో బ్యాంక్‌లకు సెలవు
12 అక్టోబర్ 2024 ---- రెండో శనివారం + దసరా, విజయదశమి, దుర్గాపూజ కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు పని చేయవు
13 అక్టోబర్ 2024 ---- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలిడే
14 అక్టోబర్ 2024 ---- దుర్గాపూజ లేదా దాసేన్ కారణంగా గాంగ్‌టక్‌లోని బ్యాంకులకు సెలవు ఇస్తారు
16 అక్టోబర్ 2024 ---- లక్ష్మీ పూజ కారణంగా అగర్తల, కోల్‌కతాలో బ్యాంకులు మూతబడతాయి
17 అక్టోబర్ 2024 ---- మహర్షి వాల్మీకి జయంతి, కాంతి బిహు సందర్భంగా బెంగళూరు, గౌహతిలోని బ్యాంకులకు హాలిడే
20 అక్టోబర్ 2024 ---- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
26 అక్టోబర్ 2024 ---- నాలుగో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు సెలవు తీసుకుంటాయి
27 అక్టోబర్ 2024 ---- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది
31 అక్టోబర్ 2024 ---- దీపావళి కారణంగా దేశంలోని అన్ని బ్యాంకులకు హాలిడే


బ్యాంకులు మూతబడినా మీ పనులు ఆగవు
పండుగల సీజన్‌లో అక్టోబర్‌ నెల చాలా కీలకం. ఈ నెలలో వివిధ పండుగల సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న బ్యాంకులకు సెలవులు వస్తాయి. బ్యాంక్‌ పని చేయనంత మాత్రాన మీ పని మాత్రం ఆగదు. బ్యాంక్ సెలవుల్లో కూడా లావాదేవీలు చేయొచ్చు. ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు డబ్బును బదిలీ చేయడానికి UPI, నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్‌ను ఉపయోగించవచ్చు. నగదు విత్‌డ్రా చేయడానికి ATMను ఉపయోగించవచ్చు.  


మరో ఆసక్తికర కథనం: పండుగ సీజన్‌లో పసిడి మంట - రికార్డ్‌ స్థాయిలో గోల్డ్‌, రూ.80 వేలు దాటే ఛాన్స్‌