Bank Stocks: MSMEలకు (Micro, Small & Medium Enterprises) క్రెడిట్ గ్యారెంటీ పథకాన్ని రూ. 9,000 కోట్లు పెంచుతామని 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ప్రతిపాదించారు. దీనివల్ల, MSMEలకు రూ. 2 లక్షల పూచీకత్తు లేని అదనపు రుణం అవకాశం దక్కుతుందని ప్రకటించారు. బ్యాంక్‌ రుణాలు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన వంటి కొన్ని పథకాలను మరింత సులభంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి మూలధన వ్యయ (capex outlay) కేటాయింపులను కూడా ప్రభుత్వం పెంచింది. బడ్జెట్ 2023లో ప్రకటన తర్వాత, ఈ పథకాలు బ్యాంకింగ్ రంగానికి ప్రయోజనం చేకూరుస్తాయని వివిధ బ్రోకరేజీలు నమ్ముతున్నాయి. 


బడ్జెట్ 2023 ప్రకటన తర్వాత ఫోకస్‌లో ఉన్న 8 బ్యాంక్ స్టాక్స్‌ జాబితా ఇది:


బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (Bank of Baroda)
ప్రస్తుత మార్కెట్‌ ధర: రూ. 171
52 వారాల గరిష్ట స్థాయి: రూ. 197
52 వారాల గరిష్ట స్థాయి నుంచి ప్రస్తుతం ఎంత తక్కువ: 15%
కంపెనీ మార్కెట్‌ విలువ: రూ. 86,879 కోట్లు


ఇండియన్‌ బ్యాంక్‌ (Indian Bank)
ప్రస్తుత మార్కెట్‌ ధర: రూ. 289
52 వారాల గరిష్ట స్థాయి: రూ. 310
52 వారాల గరిష్ట స్థాయి నుంచి ప్రస్తుతం ఎంత తక్కువ: 7% 
కంపెనీ మార్కెట్‌ విలువ: రూ. 35,788 కోట్లు


కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌ (Kotak Mahindra Bank)
ప్రస్తుత మార్కెట్‌ ధర: రూ. 1,773
52 వారాల గరిష్ట స్థాయి: రూ. 1,997
52 వారాల గరిష్ట స్థాయి నుంచి ప్రస్తుతం ఎంత తక్కువ: 12%
కంపెనీ మార్కెట్‌ విలువ: రూ. 3,50,485 కోట్లు


ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ (IndusInd Bank)
ప్రస్తుత మార్కెట్‌ ధర: రూ. 1,151
52 వారాల గరిష్ట స్థాయి: రూ. 1,275
52 వారాల గరిష్ట స్థాయి నుంచి ప్రస్తుతం ఎంత తక్కువ: 10%
కంపెనీ మార్కెట్‌ విలువ: రూ. 88,878 కోట్లు


Axis Bank
ప్రస్తుత మార్కెట్‌ ధర: రూ. 868
52 వారాల గరిష్ట స్థాయి: రూ. 970
52 వారాల గరిష్ట స్థాయి నుంచి ప్రస్తుతం ఎంత తక్కువ: 10%
కంపెనీ మార్కెట్‌ విలువ: రూ. 2,68,223 కోట్లు


ఐసీఐసీఐ బ్యాంక్‌ (ICICI Bank)
ప్రస్తుత మార్కెట్‌ ధర: రూ. 860
52 వారాల గరిష్ట స్థాయి: రూ. 958
52 వారాల గరిష్ట స్థాయి నుంచి ప్రస్తుతం ఎంత తక్కువ: 10%
కంపెనీ మార్కెట్‌ విలువ: రూ. 5,99,302 కోట్లు


స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI)
ప్రస్తుత మార్కెట్‌ ధర: రూ. 555
52 వారాల గరిష్ట స్థాయి: రూ. 630
52 వారాల గరిష్ట స్థాయి నుంచి ప్రస్తుతం ఎంత తక్కువ: 13%
కంపెనీ మార్కెట్‌ విలువ: రూ. 4,90,452 కోట్లు


ఫెడరల్ బ్యాంక్‌ (Federal Bank)
ప్రస్తుత మార్కెట్‌ ధర: రూ. 131
52 వారాల గరిష్ట స్థాయి: రూ. 143
52 వారాల గరిష్ట స్థాయి నుంచి ప్రస్తుతం ఎంత తక్కువ: 8%
కంపెనీ మార్కెట్‌ విలువ: రూ. 27,763 కోట్లు


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.