Bank Fraud: అమ్మాయిల కోసం పర్సులు ఖాళీ చేసుకున్న మగాళ్లు చాలామందే ఉన్నారు! మరికొందరైతే ఏకంగా ఆస్తులే అమ్ముకున్నారు. బెంగళూరులో ఓ ఉద్యోగి మాత్రం ఏకంగా పనిచేస్తున్న బ్యాంకు సొమ్మునే తరలించాడు. డేటింగ్ యాప్‌లో పరిచయమైన యువతి కోసం ఏకంగా రూ.5.7 కోట్ల మోసానికి తెరతీశాడు.
Also Read : వర్క్ ఫ్రం హోమ్‌ను చట్టబద్ధం చేయనున్న అక్కడి పార్లమెంటు!
బెంగళూరులోని హనుమంతనగర్‌లోని ఇండియన్ బ్యాంక్ శాఖకు హరిశంకర్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఇన్నాళ్లూ బాగానే పనిచేస్తున్నారు. సడెన్‌గా డేటింగ్ యాప్‌లో ఓ అమ్మాయి పరిచయమైంది. ఆమె కోసం బ్యాంకు నుంచి రూ.5.7 కోట్ల నిధులను గుట్టుచప్పుడు కాకుండా బదిలీ చేశారు. ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్ నుంచి ఫిర్యాదు అందడంతో పది రోజుల క్రితం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు సహకరించారన్న అనుమానంతో అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ కౌసల్యా జెరాయి, క్లర్క్ మునిరాజు పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు.
Also Read : జులైలో పెరగనున్న జీతాలు! సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం!!
2022 మే 13 నుంచి 19 మధ్య ఈ మోసం జరిగిందని పోలీసులు గుర్తించారు. డేటింగ్ యాప్ ద్వారా కొందరు మోసం చేయడంతో తన సొంత డబ్బును పోగొట్టుకున్నానని శంకర్ పోలీసులు తెలిపారు. దాంతో ఆయన స్టేట్‌మెంట్‌ను అధికారులు తనిఖీ చేస్తున్నారు. కాగా కొన్ని రోజుల క్రితం ఓ మహిళ తన పేరుతో బ్యాంకులో రూ.1.3 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. దానిని సెక్యూరిటీగా పెట్టి రూ.75 లక్షల రుణం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన పత్రాలను బ్యాంకులో సమర్పించారు.
బ్యాంకు ఉద్యోగులతో కలిసి శంకర్ ఆ పత్రాలను దుర్వినియోగం చేశారని తెలిసింది. వాటిని తనఖా పెట్టి పలు దఫాల్లో ఓవర్‌డ్రాఫ్ట్ పద్ధతిలో రూ.5.7 కోట్ల వరకు నగదు బదిలీ చేశారు. పై అధికారులు చేపట్టిన అంతర్గత తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. పశ్చిమ్ బంగాల్‌లోని 28, కర్ణాటకలోని 2 బ్యాంకు ఖాతాల్లో 136 లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. హరిశంకర్‌కు చెందిన రూ.12.5 లక్షలు సైతం అవే ఖాతాల్లోకి బదిలీ అయినట్టు తెలిసింది. మరో రూ.7 లక్షలను బ్యాంకు నిలిపివేసింది.
Also Read : ట్రెండ్ రివర్సల్ అయిందా? రూ.6.5 లక్షల కోట్ల లాభమైతే వచ్చింది!