Elon musk Really Become The Father Of His 13th Child: "ఎలాన్ మస్క్ నిజంగానే 13వ బిడ్డకు తండ్రి అయ్యాడా?". ఈ ప్రశ్న ఇప్పుడు ప్రపంచాన్ని వేగంగా చుట్టివస్తోంది. ప్రపంచ కుబేరుడు, ప్రముఖ గ్లోబల్ కంపెనీలకు అధినేత, ట్రంప్ ప్రభుత్వంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (డోజ్) వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న మస్క్ 13వ బిడ్డకు తండ్రి అయ్యాడంటగా? అని సోషల్ మీడియా గొంతు చించుకుని అరుస్తోంది. ఎలాన్ మస్క్ తరచుగా ఏదో ఒక కారణంతో వార్తల్లో హెడ్‌లైన్‌గా నిలుస్తుంటారు. ఇటీవల, ఆయన, భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు, దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాలలో, మస్క్ పిల్లలను కూడా చూడవచ్చు. విచిత్రంగా, ఇప్పుడు ఓ బిడ్డ కారణంగా, మస్క్ మామ మళ్లీ హెడ్‌లైన్‌గా మారారు.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ & రచయిత్రి ఆష్లే సెయింట్ క్లైర్ (Ashley St. Clair), ఫిబ్రవరి 15న, Xలో ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది, మొత్తం ప్రపంచానికి షాక్ ఇచ్చింది. "ఐదు నెలల క్రితం తాను మస్క్ బిడ్డకు జన్మనిచ్చా"నని ఆష్లే సెయింట్ క్లైర్ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. "ఎలాన్ మస్క్ ఆ బిడ్డకు తండ్రి" అని రాశారు. ఇంకా, "మా బిడ్డ గోప్యత & భద్రత కోసం నేను ఇప్పటివరకు దీనిని బహిరంగపరచలేదు. కానీ, గత కొన్ని రోజులుగా ఇది మీడియాలో హైలైట్ అవుతోంది. మా బిడ్డ సాధారణ & సురక్షితమైన వాతావరణంలో పెరగాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి, మా బిడ్డ వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని, అనవసరమైన జోక్యాన్ని నివారించాలని నేను మీడియాను అభ్యర్థిస్తున్నాను" అని రాశారు.
ఆష్లే సెయింట్ క్లైర్ Xలో షేర్ చేసిన పోస్ట్ దావాలనంగా ప్రపంచమంతా వ్యాపిస్తున్నప్పటికీ, టెస్లా & స్పేస్‌ఎక్స్ CEO (ఎలాన్ మస్క్) నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ, ఆష్లే సెయింట్ క్లైర్ చెబుతున్న మాటలు నిజమే అయితే, ఆ బిడ్డ ఎలాన్ మస్క్ 13వ సంతానం అవుతుంది.
ఆష్లీ సెయింట్ క్లైర్ ఎవరు? (Who Is Ashley St. Clair?)
ఆష్లే సెయింట్ క్లెయిర్ ఒక రచయిత్రి & సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. తాను రాసిన "ఎలిఫెంట్స్ ఆర్ నాట్ బర్డ్స్" అనే పుస్తకంతో ఆమె ప్రసిద్ధి చెందారు. ఆ పుస్తకాన్ని బ్రేవ్ బుక్స్ ప్రచురించింది. ఈ పుస్తకం బయటకు వచ్చాక ఆమె పాపులర్ అయ్యారు. లింగ మార్పిడికి సంబంధించిన కొన్ని అంశాల ఆధారంగా "ఎలిఫెంట్స్ ఆర్ నాట్ బర్డ్స్" పుస్తకాన్ని ఆష్లే సెయింట్ క్లెయిర్ రాశారు.
మరో ఆసక్తికర కథనం: 'నేను SBI నుంచి మాట్లాడుతున్నా' - క్రెడిట్ కార్డ్ మోసాల్లో కొత్త పద్ధతి, జాగ్రత్త సుమా!