Air India Expres Affordable Flight Offer: టాటా గ్రూపులోని విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు అనుబంధ సంస్థ అయిన 'ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్', ప్రయాణీకుల కోసం ధమాకా ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌ ద్వారా, చాలా తక్కువ ధరకే విమానంలో ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తోంది. ఆఫర్‌లో భాగంగా టిక్కెట్ల ఫ్లాష్ సేల్‌ను ఈ ఎయిర్‌లైన్స్‌ కంపెనీ అందుబాటులోకి తెచ్చింది.


ప్రయాణికులకు ఈ రోజు వరకే అవకాశం            
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఆఫర్‌లో ప్రయాణీకులు కేవలం 883 రూపాయలకే విమానం టిక్కెట్‌ బుక్ చేసుకోవచ్చు. ఇది కేవలం రెండు రోజుల ఆఫర్‌. ఈ ఆఫర్‌ను ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ నిన్న (గురువారం) ప్రారంభించింది, ఈ రోజుతో (శుక్రవారం) ముగుస్తుంది. బస్‌/ట్రైన్‌ టిక్కెట్‌ కన్నా తక్కువ రేటుకే విమానంలో ప్రయాణించాలి అంటే ఈ రోజు మాత్రమే సమయం ఉంది. 


ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లాష్ సేల్‌లో.. ప్రయాణీకులు ఈ ఏడాది సెప్టెంబర్ 30వ వరకు ఏ తేదీ కోసమైనా టిక్కెట్లు బుక్‌ చేసుకోవచ్చు. 


వెబ్‌సైట్, యాప్ ద్వారా టిక్కెట్‌ల బుకింగ్‌          
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లాష్ సేల్‌లో, ఎక్స్‌ప్రెస్ లైట్ ధర కేవలం రూ. 883 నుంచి ప్రారంభమవుతుంది. ఎక్స్‌ప్రెస్ వాల్యూ ధర రూ. 1,096 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఆఫర్‌ను వినియోగించుకునేందుకు ప్రయాణీకులు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ వెబ్‌సైట్ airindiaexpress.com లేదా ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ మొబైల్ యాప్ నుంచి టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చని ఎయిర్‌లైన్స్‌ కంపెనీ ప్రకటించింది.


బ్యాగేజీపైనా ఆఫర్‌లు            
వెబ్‌సైట్ ద్వారా టిక్కెట్‌ బుక్ చేసుకునే ప్రయాణీకులు, ఎయిర్‌లైన్స్‌ కంపెనీ ఇటీవల ప్రారంభించిన జీరో చెక్-ఇన్ ఎక్స్‌ప్రెస్ లైట్ ఫేర్‌ను పొందొచ్చు. ఈ ఆఫర్‌లో, ఎటువంటి రుసుము లేకుండా 3 కిలోల వరకు అదనపు క్యాబిన్ బ్యాగేజీని ప్రి-బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఈ ఆఫర్ కింద, దేశీయ విమానాలకు రూ. 1,000 డిస్కౌంట్‌ రేట్‌తో 15 కిలోల వరకు చెక్-ఇన్ బ్యాగేజీని బుక్ చేసుకోవచ్చు, అంతర్జాతీయ విమానాలకు 20 కిలోల వరకు చెక్-ఇన్ బ్యాగేజీని రూ. 1,300 రేట్‌తో బుక్ చేసుకోవచ్చు.


అదనపు ఆఫర్‌లు                   
విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, వైద్యులు, నర్సులు, సాయుధ దళాల సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతో పాటు.. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లోని లాయల్టీ సభ్యులకు ఈ ఆఫర్ అందుబాటులో ఉందని కంపెనీ తెలిపింది. లాయల్టీ సభ్యులకు కొన్ని అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. లాయల్టీ సభ్యులకు టిక్కెట్‌ బుకింగ్‌పై రూ. 100 నుంచి రూ. 400 వరకు ప్రత్యేక తగ్గింపు ఉంటుంది & 8 శాతం న్యూకాయిన్‌ కూడా లభిస్తుంది. బిజినెస్‌, ప్రైమ్ సీట్ల బుకింగ్‌పై 50 శాతం తగ్గింపు, పానీయాలపై 33 శాతం, ఆహార పదార్థాలపై 25 శాతం తగ్గింపు ప్రయోజనాలను కూడా లాయల్టీ సభ్యులు పొందుతున్నారు.


మరో ఆసక్తికర కథనం: ఒక్కో మెట్టు దిగుతూ జనానికి చేరువవుతున్న పసిడి - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి