New Uniform for Air India Staff: టాటా గ్రూప్ ‍‌(Tata Group) నేతృత్వంలోని ఎయిర్ ఇండియా కొత్త లుక్‌లోకి మారింది. విమాన పైలెట్స్‌, క్యాబిన్ & కాక్‌పిట్ సిబ్బంది కోసం కొత్త యూనిఫాం (New uniform for pilates, cabin & cockpit crew) లాంచ్‌ చేసింది. తన పైలట్లు, క్యాబిన్ & కాక్‌పిట్ సిబ్బంది ధరించిన సరి కొత్త డ్రెస్‌ కోడ్‌ను ఎయిర్‌ ఇండియా ప్రదర్శించింది. కొత్త యూనిఫామ్స్‌ ధరించిన సిబ్బందితో ఒక షార్ట్‌ వీడియో తీసి 'ఎక్స్‌'లో ఉంచింది.


ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా (Fashion designer Manish Malhotra) ఈ యూనిఫామ్స్‌ను డిజైన్ చేశారు. స్టైలిష్‌గా ఉండడమే కాదు, ధరించినవారికి సౌకర్యవంతంగా ఉండేలా వాటిని రూపొందించారు.


ఎయిర్ ఇండియా గొప్ప చరిత్ర, ఉజ్వల భవిష్యత్తునూ సూచించేలా కొత్త డ్రెస్‌ను మనీష్‌ మల్హోత్రా తీర్చిదిద్దారు. 


భారతీయులు ఎక్కువగా ఇష్టపడే ఎరుపు (red), వంకాయ (aubergine), బంగారం ‍‌(gold) రంగుల్లో యూనిఫామ్స్‌ను తయారు చేశారు. 


ఎయిర్ ఇండియా పైలెట్లు, కాక్‌పిట్‌, క్యాబిన్ క్రూ కొత్త యూనిఫామ్స్‌ను ఈ వీడియాలో చూడండి.






కొత్త యూనిఫామ్‌ ఎప్పట్నుంచి కనిపిస్తుంది?   
కొత్త యూనిఫామ్స్‌ మీద ఎయిర్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది. "కొత్త యూనిఫామ్‌ను రాబోయే కొన్ని నెలల్లో దశలవారీగా ప్రవేశపెడతాం. మొదట, ఎయిర్ ఇండియా మొదటి ఎయిర్‌బస్ A350 విమాన సర్వీస్‌ నుంచి ఇది ప్రారంభం అవుతుంది" అని వెల్లడించింది.


'ఫ్యాషన్ టేక్స్‌ ఫ్లైట్‌' అంటూ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రకటన       
తమ పైలెట్లు, క్యాబిన్ సిబ్బంది, విమాన సిబ్బంది కోసం యూనిఫారాలను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేస్తారని ఎయిర్ ఇండియా ఈ ఏడాది సెప్టెంబర్‌లో అధికారికంగా ప్రకటించింది. 6 దశాబ్దాల (60 ఏళ్లు) తర్వాత ఎయిర్ ఇండియా సిబ్బంది యూనిఫారం మార్చబోతున్నట్లు 2023 సెప్టెంబర్ 25న వెల్లడించింది. "ఫ్యాషన్ టేక్స్‌ ఫ్లైట్‌" ‍‌(Fashion takes flight) అని అప్పట్లో ట్వీట్‌ కూడా చేసింది. 


ఇండియాలో, మనీష్ మల్హోత్రా బాగా పేరున్న ఫ్యాషన్‌ డిజైనర్‌. ఆయన పేరు ఫ్యాషన్‌ పర్యాయపదంగా మారింది. ఎయిర్‌ ఇండియా మన దేశంలోని ప్రాచీన విమానయాన సంస్థ. కొత్త తరంతో కనెక్ట్ అయ్యేలా యూనిఫామ్స్‌లో ఫ్యాషనబుల్ లుక్‌ను అందించేందుకు ఎయిర్‌ ఇండియా ప్రయత్నం చేసినట్లు, డ్రెస్‌ కోడ్‌ కొత్త లుక్‌ను బట్టి స్పష్టంగా అర్ధమవుతుంది.


మరో ఆసక్తికర కథనం:  ఫైనల్‌ స్టేజ్‌లో రిలయన్స్‌-డిస్నీ విలీన ఒప్పందం, మిగిలింది సంతకాలే, వారంలో డీల్‌ క్లోజ్‌!