Reliance-Disney Merger Deal Update: భారత్‌లో మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగాన్ని (Media & Entertainment Sector in India) గుప్పెట్లో పెట్టుకుని, ఆధిపత్యం చెలాయించేందుకు తహతహలాడుతున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (Reliance Industries - RIL), టార్గెట్‌ వైపు వేగంగా అడుగు వేస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ - వాల్ట్‌ డిస్నీకి ‍‌(Walt Disney) చెందిన డిస్నీ ఇండియా ‍మెర్జర్‌ డీల్‌ వచ్చే వారంలో ఖరారయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రెండు పక్షాల మధ్య ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని, విలీన ఒప్పందం మీద వచ్చే వారం సంతకాలు జరుగుతాయని నేషనల్‌ మీడియాలో రిపోర్ట్స్‌ వస్తున్నాయి. 


అతి పెద్ద కంపెనీల్లో ఒకటి
ఇండియాలో... రిలయన్స్‌కు జియో సినిమా (Jio Cinema), డిస్నీకి డిస్నీ+ హాట్‌స్టార్‌ (Disney+ Hotstar) స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌ ఉన్నాయి. ఇవి కాకుండా, రిలయన్స్‌కు చెందిన వయాకామ్‌ 18 (Viacom 18) కింద 38 ఛానళ్లు ఉన్నాయి. మరోవైపు, 8 భాషల్లో 70 ఛానల్స్‌తో స్టార్‌ ఇండియా (Star India) రాజ్యమేలుతోంది. రిలయన్స్‌ - డిస్నీ మధ్య ఒప్పందం కుదిరితే, ఈ మొత్తం ఛానెళ్లు ఒకే గొడుగు (Merger entity) కిందకు వస్తాయి. విలీనం తర్వాత ఏర్పడే కొత్త సంస్థ భారతదేశ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగాల్లోని అతి పెద్ద కంపెనీల్లో ఒకటిగా అవతరిస్తుంది. ఈ కొత్త కంపెనీ, వయాకామ్‌ 18కి అనుబంధ సంస్థగా (Subsidiary) ఉంటుంది. అంటే, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు స్టెప్‌-డౌన్‌ సబ్సిడియరీగా మారుతుంది.


రిలయన్స్‌ - డిస్నీ కంపెనీల విలీనం గురించి ప్రపంచమంతా కోడై కూస్తున్నా, ఈ విషయంపై ఈ రెండు కంపెనీలు అధికారికంగా ఒక్క ప్రకటన కూడా విడుదల చేయలేదు.


విలీనం తర్వాత ఏర్పడే కొత్త సంస్థలో కంట్రోలింగ్‌ స్టేక్‌ (నియంత్రణ వాటా) రిలయన్స్‌ దగ్గర ఉంటుంది. అంటే, రిలయన్స్‌ చేతికి 51 శాతం వాటా వస్తుంది. మిగిలిన 49 శాతం డిస్నీ దగ్గర ఉంటుంది. ఈ ప్రపోర్షన్‌ ప్రకారం రెండు కంపెనీలు పెట్టుబడులు పెడతాయి. ప్రస్తుతం, విలీన కంపెనీ విలువను లెక్కించే పని జరుగుతోందని తెలుస్తోంది. ఈ లెక్క తేలిదే, 51 శాతం వాటా ప్రకారం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ పెట్టుబడి ఎంత, 49 వాటా ప్రకారం డిస్నీ ఎంత తెస్తుందో తేలిపోతుంది.


రిలయన్స్‌ చేతిలో నియంత్రణ అధికారం!        
రిలయన్స్‌ దగ్గర 51 శాతం షేర్లు ఉంటాయి కాబట్టి, మెర్జర్‌ ఎంటిటీ తీసుకునే అన్ని నిర్ణయాలను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కంట్రోల్‌ చేయగలదు. అంతేకాదు, బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ విషయంలోనూ RILదే ఆధిపత్యం అవుతుంది. మెర్జర్‌ ఎంటిటీ 
బోర్డులో రిలయన్స్‌ నుంచి ఇద్దరు డైరెక్టర్లు, డిస్నీ నుంచి ఇద్దరు డైరెక్టర్లు ఉంటారని సమాచారం. వయాకామ్‌ 18లో అతి పెద్ద స్టేక్‌ హోల్డర్‌ అయిన బోధి ట్రీ మల్టీమీడియా (Bodhi Tree Multimedia Ltd) నుంచి ఒకరు డైరెక్టర్‌గా వచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే, బోధి ట్రీ డైరెక్టర్‌ కూడా రిలయన్స్‌ చేతిలోనే ఉంటారు.  


మరో ఆసక్తికర కథనం: రూ.62 వేల కంటే కిందకు దిగిన గోల్డ్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి