The Richest People In The World 2024: 2024 సంవత్సరానికి వీడ్కోలు & నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికే సమయం దగ్గరలోకి వచ్చింది. ఈ ఏడాది, ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల అదృష్టంలో చాలా మార్పులు వచ్చాయి, సంపద అనేక చేతులు మారింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజా అప్‌డేట్ ప్రకారం, ప్రపంచంలోని టాప్ 10 మందిలో 8 మంది ధనవంతులు టెక్నాలజీ ఇండస్ట్రీకి చెందినవాళ్లు. ప్రపంచాన్ని ముందుకు నడిపించడంలో ఈ రంగం పోషిస్తున్న పాత్రను ఇది హైలైట్ చేస్తుంది. అంతేకాదు, టాప్-10లోని 9 మంది అమెరికన్లే. ప్రపంచ సంపదన అమెరికన్లు ఏ స్థాయిలో శాసిస్తున్నారన్న విషయానికి ఇది తార్కాణం.
టాప్-10 లిస్ట్‌లో హైలైట్స్
హైలైట్ నంబర్ 1) ప్రపంచ సంపన్నుల్లో నంబర్ 1 పొజిషన్‌లో ఉన్న ఎలాన్ మస్క్ మొత్తం నెట్‌వర్త్ (Elon Musk Net worth) 486 బిలియన్ డాలర్లు. అతను, 500 బిలియన్ డాలర్ల సంపదకు అతి దగ్గరలో ఉన్నాడు. మస్క్ జోరు చూస్తుంటే, అతి త్వరలో ఆ మైలురాయిని కూడా అధిగమించే సూచనలు కనిపిస్తున్నాయి.
హైలైట్ నంబర్ 2) 2, 3 స్థానాల్లో ఉన్న జెఫ్ బెజోస్ (Jeff Bezos) & మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) మొత్తం ఆస్తులు కలిపినా (250 + 219 = 469 బిలియన్ డాలర్లు) ఎలాన్ మస్క్ ఒక్కడి సంపదకు సాటిరావు.
హైలైట్ నంబర్ 3) నంబర్ 2 ర్యాంక్‌లో ఉన్న జెఫ్ బెజోస్ (250 బిలియన్ డాలర్లు) సంపద కంటే మస్క్ నెట్‌వర్త్ దాదాపు రెట్టింపు.
హైలైట్ నంబర్ 4) 3వ స్థానంలో ఉన్న మార్క్ జుకర్‌బర్గ్ (219 బిలియన్ డాలర్లు) సంపదతో పోలిస్తే, మస్క్ మామ నెట్‌వర్త్ రెట్టింపు కంటే ఎక్కువ.
హైలైట్ నంబర్ 5) మొదటి ఇద్దరు కుబేరుల మొత్తం నికర విలువ తొలిసారి 700 బిలియన్ డాలర్ల మార్క్‌ను క్రాస్ చేసి ముందుకెళ్లింది.
హైలైట్ నంబర్ 6) టాప్-3 సంపన్నుల సంపద కూడా మొట్టమొదటిసారి 950 బిలియన్ డాలర్లను దాటింది.
ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల జాబితా (Top 10 richest people in the world)
1. ఎలోన్ మస్క్ -- 486 బిలియన్ డాలర్లు -- యునైటెడ్ స్టేట్స్ -- టెక్నాలజీ
2. జెఫ్ బెజోస్ -- 250 బిలియన్ డాలర్లు -- యునైటెడ్ స్టేట్స్ -- టెక్నాలజీ
3. మార్క్ జుకర్‌బర్గ్ -- 219 బిలియన్ డాలర్లు -- యునైటెడ్ స్టేట్స్ -- టెక్నాలజీ
4. లారీ ఎల్లిసన్ -- 193 బిలియన్ డాలర్లు -- యునైటెడ్ స్టేట్స్ -- టెక్నాలజీ
5. బెర్నార్డ్ ఆర్నాల్ట్ -- 179 బిలియన్ డాలర్లు -- ఫ్రాన్స్ -- కన్జ్యూమర్
6. లారీ పేజ్ -- 174 బిలియన్ డాలర్లు -- యునైటెడ్ స్టేట్స్ -- టెక్నాలజీ
7. బిల్ గేట్స్ -- 165 బిలియన్ డాలర్లు -- యునైటెడ్ స్టేట్స్ -- టెక్నాలజీ
8. సెర్గీ బ్రిన్ -- 164 బిలియన్ డాలర్లు -- యునైటెడ్ స్టేట్స్ -- టెక్నాలజీ
9. స్టీవ్ బాల్మెర్ -- 157 బిలియన్ డాలర్లు -- యునైటెడ్ స్టేట్స్ -- టెక్నాలజీ
10. వారెన్ బఫెట్ -- 143 బిలియన్ డాలర్లు -- యునైటెడ్ స్టేట్స్ -- డైవర్సిఫైడ్
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎలాన్ మస్క్‌కు బాగా కలిసొచ్చాయి. ట్రంప్ గెలిచాక, టెస్లా కంపెనీ షేర్లు స్పేస్‌ఎక్స్ రాకెట్లలా నిట్టనిలువుగా దూసుకెళ్లాయి. దీనివల్ల ఎలాన్ మస్క్ సంపద అనూహ్యంగా పెరిగింది.
మరో ఆసక్తికర కథనం: ఎయిర్ ఇండియా టిక్కెట్ మీద 25 శాతం డిస్కౌంట్, మరెన్నో స్పెషల్ ఆఫర్లు - వీళ్లకు మాత్రమే