Multibagger Penny Stocks 2023: స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడిదార్లు, తమ ఇన్వెస్ట్‌మెంట్‌ చాలా త్వరగా, భారీగా పెరిగిపోవాలని కోరుకుంటారు. ఇందుకోసం, కొందరు ఇన్వెస్టర్లు పెన్నీ స్టాక్స్‌ను (చాలా తక్కువ ప్రైస్‌తో ట్రేడయ్యే స్టాక్స్‌) ఎంచుకుంటారు. పెన్నీ స్టాక్స్‌ అయితే.. చాలా తక్కువ ధర వద్ద చాలా ఎక్కువ మొత్తంలో షేర్లను కొనవచ్చని, అవి కొంచం జంప్‌ చేసినా తక్కువ టైమ్‌లో ఎక్కువ రిటర్న్స్‌ సంపాదించవచ్చన్నది వాళ్ల ఆలోచన.


2023 క్యాలెండర్ ఇయర్‌లో ‍‌(CY23) ఇప్పటి వరకు 29 పెన్నీ స్టాక్స్‌ మల్టీబ్యాగర్స్‌గా మారాయి. ఇవన్నీ రూ. 500 కోట్ల కంటే తక్కువ మార్కెట్ విలువతో (market capitalization), ఒక్కో షేరు రూ. 20 కంటే తక్కువ ప్రైస్‌తో ట్రేడ్‌ అవుతున్నాయి. వీటి తాజా ట్రేడెడ్ వాల్యూమ్ & ఒక నెల సగటు ట్రేడెడ్ వాల్యూమ్ రెండింటిలోనూ 50 వేల కంటే ఎక్కువ వాల్యూమ్స్‌ ఉన్న స్టాక్స్‌ను మాత్రమే షార్ట్‌లిస్ట్‌ చేయడం జరిగింది. ఫైనల్‌గా, ఏడు స్టాక్స్‌ ఫైనల్‌ లిస్ట్‌లో చోటు సంపాదించాయి.


2023లో ఇప్పటి వరకు మల్టీబ్యాగర్‌ రిటర్న్స్‌ ఇచ్చిన 7 పెన్నీ స్టాక్స్‌:


మౌరియా ఉద్యోగ్ ‍‌(Mauria Udyog)    |    CY23లో ఇప్పటి వరకు ప్రైస్‌ రిటర్న్స్‌: 229%
మునుపటి ముగింపు (అక్టోబర్ 6, 2023): రూ. 11.50
చివరి ట్రేడ్ వాల్యూమ్: 59,172    |    ఒక నెల సగటు ట్రేడ్ వాల్యూమ్: 85,524


కంఫర్ట్ ఇంటెక్ (Comfort Intech)    |    CY23లో ఇప్పటి వరకు ప్రైస్‌ రిటర్న్స్‌: 203%
మునుపటి ముగింపు: రూ. 7.90
చివరి ట్రేడ్ వాల్యూమ్: 52,66,882    |    ఒక నెల సగటు ట్రేడ్ వాల్యూమ్: 24,18,523


వివంత ఇండస్ట్రీస్ (​Vivanta Industries)    |    CY23లో ఇప్పటి వరకు ప్రైస్‌ రిటర్న్స్‌: 202%
మునుపటి ముగింపు: రూ. 4.68
చివరి ట్రేడ్ వాల్యూమ్: 4,20,513    |    ఒక నెల సగటు ట్రేడ్ వాల్యూమ్: 6,03,508


BSEL ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రియాల్టీ (BSEL Infrastructure Realty )    |    CY23లో ఇప్పటి వరకు ప్రైస్‌ రిటర్న్స్‌: 160%
మునుపటి ముగింపు: రూ. 12.58
చివరి ట్రేడ్ వాల్యూమ్: 1,14,321    |    ఒక నెల సగటు ట్రేడ్ వాల్యూమ్: 2,12,030


మునుపటి ముగింపు: రూ. 8.47 చివరి ట్రేడ్ వాల్యూమ్: 1,11,994    |    ఒక నెల సగటు ట్రేడ్ వాల్యూమ్: 3,49,184


తరిణి ఇంటర్నేషనల్ (Tarini International)    |    CY23లో ఇప్పటివరకు ధర రాబడి: 146%
మునుపటి ముగింపు: రూ. 11.83
చివరి ట్రేడ్ వాల్యూమ్: 51,000    |    ఒక నెల సగటు ట్రేడ్ వాల్యూమ్: 58,235


తాటియా గ్లోబల్ వెంచర్ (Tatia Global Vennture)    |    CY23లో ఇప్పటివరకు ధర రాబడి: 117%
మునుపటి ముగింపు: రూ. 3.24
చివరి ట్రేడ్ వాల్యూమ్: 1,99,353    |    ఒక నెల సగటు ట్రేడ్ వాల్యూమ్: 1,66,960


స్టాక్‌ మార్కెట్‌లో పెన్నీ స్టాక్స్‌ ఎంత భారీ రిటర్న్స్‌ ఇస్తాయో, వాటి వల్ల అంతకుమించిన రిస్క్‌ కూడా ఉంటుందని గుర్తుంచుకోండి. సాధారణంగా, పెన్నీ స్టాక్స్‌లో చాలా తక్కువ ట్రేడింగ్ వాల్యూమ్స్‌ ఉంటాయి. ఈ కౌంటర్లలో వాల్యూమ్స్‌ హఠాత్తుగా పెరగడాన్ని కచ్చితంగా అనుమానించాలి. ఎందుకంటే, కొందరు మోసగాళ్లు పంప్‌ & డంప్‌ స్కీమ్‌ కోసం పెన్నీ స్టాక్స్‌ను ఎంచుకుంటారు. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: గవర్నమెంట్‌ రన్‌ చేస్తున్న పెన్షన్ స్కీమ్స్‌, నెలానెలా గ్యారెంటీ మనీ


Join Us on Telegram: https://t.me/abpdesamofficial