Yamaha EC-06 Price, Range And Features: బెంగళూరుకు చెందిన రివర్ స్టార్టప్‌తో కలిసి యమహా అభివృద్ధి చేసిన EC-06 ఎలక్ట్రిక్ స్కూటర్, ప్రీమియం కమ్యూటర్ విభాగంలోకి అడుగుపెట్టింది. 4kWh బ్యాటరీ ప్యాక్‌, 6.7kW గరిష్ట పవర్‌, 169 కి.మీ. IDC సర్టిఫైడ్ రేంజ్‌తో వచ్చిన ఈ స్కూటర్.. కాగితంపై ఆకట్టుకునే స్పెసిఫికేషన్లను అందిస్తోంది. అయితే వాస్తవంగా రోడ్డుపై దీని పనితీరు ఎలా ఉందో పరీక్షల్లో వెల్లడైంది.

Continues below advertisement

యాక్సిలరేషన్పరీక్ష సమయంలో వాతావరణం పూర్తిగా పొడిగా ఉండగా, బ్యాటరీ ఛార్జ్ 97 శాతం కంటే ఎక్కువగా ఉంది. స్కూటర్‌లో అందుబాటులో ఉన్న పవర్ మోడ్‌లో యాక్సిలరేషన్ పరీక్షలు నిర్వహించారు. ఈ మోడ్‌లో స్కూటర్ వేగంగా స్పందిస్తూ 0 నుంచి 40 కి.మీ వేగాన్ని కేవలం 3.46 సెకన్లలో చేరుకుంది. 0 నుంచి 60 కి.మీ వేగాన్ని అందుకోవడానికి 6.82 సెకన్లు పట్టగా, 0 నుంచి 80 కి.మీ వేగాన్ని 15.50 సెకన్లలో చేరుకుంది. నగర ప్రయాణాలకు అవసరమైన వేగాన్ని ఈ స్కూటర్ సులభంగా అందిస్తోందని ఈ ఫలితాలు సూచిస్తున్నాయి.

యమహా EC-06లో ఎకో, స్టాండర్డ్ & పవర్ అనే మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. అవసరాన్ని బట్టి ఎక్కువ రేంజ్ లేదా మెరుగైన పనితీరు కోరుకునే వారికి ఈ మోడ్‌లు ఉపయోగపడతాయి. ముఖ్యంగా పవర్ మోడ్‌లో స్కూటర్ స్పందన చాలా వేగంగా ఉండగా, స్టాండర్డ్ మోడ్ కూడా నగర ప్రయాణాలకు అనుకూలంగా ఉంది.

Continues below advertisement

ఇది కూడా చదవండి: ఏథర్ రిజ్టాకు LFP బ్యాటరీ ఆప్షన్‌ - కొత్త బ్యాటరీ ప్యాక్‌లు, 900W ఛార్జర్‌తో కీలక అప్‌డేట్

ఓవర్‌టేకింగ్‌రోల్-ఆన్ యాక్సిలరేషన్ పరీక్షల్లో కూడా EC-06 మంచి ఫలితాలు నమోదు చేసింది. 20 నుంచి 50 కి.మీ వేగాన్ని 3.31 సెకన్లలో అందుకుంది. 30 నుంచి 70 కి.మీ వేగాన్ని చేరుకోవడానికి 7.34 సెకన్లు పట్టగా, 50 నుంచి 80 కి.మీ వేగాన్ని 10.96 సెకన్లలో చేరుకుంది. ట్రాఫిక్‌లో వేగంగా ఓవర్‌టేక్ చేయాల్సిన సందర్భాల్లో స్టాండర్డ్ & పవర్ మోడ్‌లు మంచి పనితీరును అందిస్తున్నాయి. ఎకో మోడ్‌లో కూడా 50 కి.మీ వరకు సాఫీగా వేగాన్ని అందుకోవచ్చు. ఫ్లైఓవర్లు ఎక్కే సమయంలో కూడా ఈ మోడ్ ఉపయోగకరంగా ఉంటుంది.

బ్రేకింగ్ విభాగంలో కూడా EC-06 నిరాశపరచలేదు. ముందు & వెనుక భాగాల్లో డిస్క్ బ్రేక్‌లు అందించడంతో పాటు కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్‌ను అమర్చారు. 60 కి.మీ వేగం నుంచి పూర్తిగా ఆగడానికి కేవలం 22.87 మీటర్ల దూరమే పట్టింది. దీనికి తోడు రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా బలంగా పనిచేస్తుంది. ముఖ్యంగా నెమ్మదిగా సాగే ట్రాఫిక్‌లో తరచూ బ్రేక్ వేయాల్సిన అవసరాన్ని ఇది తగ్గిస్తుంది. వాహనం సాఫీగా నెమ్మదించడంతో రైడింగ్ అనుభవం మరింత మెరుగ్గా ఉంటుంది.

ఇది కూడా చదవండి: మీ డ్రైవింగ్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లే 8 స్మార్ట్ కార్ గాడ్జెట్లు - వీటిని ఒక్కసారి ట్రై చేస్తే ఇక వదిలిపెట్టరు!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 26Nm గరిష్ట టార్క్‌ను అందించే మోటార్‌ను అమర్చారు. మొత్తం బరువు 132 కిలోలు. ముందు 110/80-14 & వెనుక 120/70-14 పరిమాణంలో 14 అంగుళాల టైర్లు ఉన్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో 14 అంగుళాల చక్రాలు అరుదుగా కనిపిస్తాయి. ఇవి రోడ్డు స్థిరత్వాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే డ్యూయల్ పాడ్ వర్టికల్ LED హెడ్‌లైట్ స్కూటర్‌కు ప్రత్యేకమైన రూపాన్ని ఇస్తుంది.

ధరయమహా EC-06 ఎక్స్ షోరూమ్ ధర హైదరాబాద్‌లో రూ.1,67,600. ఆన్ రోడ్ ధర సుమారు రూ.1.81 లక్షలు. ఈ ధరతో ఇది భారత మార్కెట్‌లో లభిస్తున్న ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటిగా నిలుస్తోంది. అయితే శక్తివంతమైన మోటార్, ఎక్కువ రేంజ్, మెరుగైన యాక్సిలరేషన్‌, సమర్థవంతమైన బ్రేకింగ్ & ఆధునిక ఫీచర్లను కోరుకునే వినియోగదారులకు యమహా EC-06 మంచి ఎంపికగా నిలిచే అవకాశం ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.