Smart Car Gadgets: ఈ రోజుల్లో కారు ప్రయాణం మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా & ఎంజాయ్ చేసే స్మార్ట్ స్పేస్‌గా మారిపోయింది. మార్కెట్‌లోకి వస్తున్న కొత్త టెక్నాలజీ గాడ్జెట్లు డ్రైవింగ్ అనుభవాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. ఇన్‌స్టాలేషన్ కోసం పెద్ద హంగామా అవసరం లేకుండా, కేవలం నిమిషాల్లోనే ఉపయోగించగలిగే పరికరాలకు యువతతో పాటు ఫ్యామిలీ కార్ యజమానుల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. మీ కారులో తప్పనిసరిగా ఉపయోగపడే 8 స్మార్ట్ గాడ్జెట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Continues below advertisement

1. కుటుంబంతో ఎక్కువగా ప్రయాణించే వారికి బ్యాక్ సీట్ మల్టీ ఛార్జర్ ఎంతో ఉపయోగపడుతుంది. వెనుక సీట్లలో కూర్చున్న ప్రయాణికులు తమ ఫోన్లను ఒకేసారి సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఒకే పరికరంలో వేర్వేరు రకాల ఛార్జింగ్ కేబుళ్లు ఉండటంతో అదనంగా వైర్లు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. దీర్ఘ ప్రయాణాల్లో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

2. ఐఫోన్ ఉపయోగించే వారికి మ్యాగ్ సేఫ్ కార్ మౌంట్ ఛార్జర్ మంచి ఎంపిక. ఫోన్‌ను గట్టిగా పట్టుకుని ఉంచడంతో పాటు వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా అందిస్తుంది. గుంతలు ఉన్న రోడ్లపై ప్రయాణించినా ఫోన్ కదలకుండా మాగ్నెట్ బలంగా పట్టుకుని ఉంటుంది. నావిగేషన్ ఉపయోగించే వారికి ఇది మరింత సౌకర్యాన్ని అందిస్తుంది.

Continues below advertisement

3. డ్యాష్ క్యామ్ ఇప్పుడు దాదాపు ప్రతి కారులో ఉండాల్సిన ముఖ్యమైన గాడ్జెట్‌గా మారింది. రోడ్డు ప్రమాదాలు లేదా ఇతర అనుకోని సంఘటనలు జరిగితే వీడియో ఆధారాలను అందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. హై క్వాలిటీ వీడియో రికార్డింగ్, వైడ్ యాంగిల్ వ్యూ వంటి ఫీచర్లతో ప్రయాణాన్ని మరింత సురక్షితంగా ఉంచుతుంది.

ఇది కూడా చదవండి: హీరో ఎక్స్‌ట్రీమ్ 250R లేదా KTM 250 డ్యూక్? ధర, పనితీరు, ఫీచర్లలో ఏ బండి బెస్ట్‌?

4. వాయిస్ కమాండ్‌లతో కారును మరింత స్మార్ట్‌గా మార్చాలనుకునే వారికి అమెజాన్ ఎకో ఆటో అద్భుతమైన ఎంపిక. అలెక్సా సహాయంతో ఫోన్‌ను చేతిలోకి తీసుకోకుండా కాల్స్ చేయడం, పాటలు వినడం, సరైన దారి తెలుసుకోవడం వంటి పనులు చేయొచ్చు. బయట ఎంత శబ్దం ఉన్నా డ్రైవర్ వాయిస్‌ను గుర్తించే సామర్థ్యం ఈ పరికరానికి ప్రత్యేక ఆకర్షణ.

5. పాత కార్లలో బ్లూటూత్ సౌకర్యం లేకపోతే బ్లూటూత్ కార్ స్పీకర్ మంచి ప్రత్యామ్నాయం. దీని సహాయంతో హ్యాండ్స్ ఫ్రీ కాల్స్ మాట్లాడటంతో పాటు ఇష్టమైన పాటలను సులభంగా వినవచ్చు. కారు స్టార్ట్ చేసిన వెంటనే మొబైల్‌తో ఆటోమేటిక్‌గా కనెక్ట్ కావడం దీని మరో ప్రత్యేకత.

6. TPMS (టైర్‌ ప్రెజర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌) ప్రతి కారు డ్రైవర్‌/యజమానికి ఎంతో ఉపయోగపడే సేఫ్టీ గాడ్జెట్. టైర్లలో గాలి ఒత్తిడి తగ్గినా లేదా ఉష్ణోగ్రత పెరిగినా వెంటనే అలర్ట్ ఇస్తుంది. సరైన గాలి ఒత్తిడితో టైర్ల జీవితకాలం పెరగడమే కాకుండా ఇంధన వినియోగం కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా హైవేపై ప్రయాణించే వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 లిమిటెడ్ ఎడిషన్ - ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 యూనిట్లే, ధర రూ.5.75 లక్షలే!

7. OBD2 స్కానర్ కారులో వచ్చే సాంకేతిక సమస్యలను ముందుగానే గుర్తించడంలో సహాయపడుతుంది. దీనిని కారులోని ప్రత్యేక పోర్ట్‌కు కనెక్ట్ చేస్తే, మీ మొబైల్ యాప్‌లో వాహనానికి సంబంధించిన పూర్తి సమాచారం కనిపిస్తుంది. చిన్న లోపాలను ముందే గుర్తించడం వల్ల భారీ మరమ్మత్తు ఖర్చులను తగ్గించుకునే అవకాశం ఉంటుంది.

8. కారులో ఎప్పుడూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలని కోరుకునేవారికి స్మార్ట్ కార్ ఎయిర్ ఫ్రెషనర్ మంచి ఎంపిక. కారు స్టార్ట్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా పనిచేయడం & అవసరం లేనప్పుడు స్వయంగా ఆఫ్ అవ్వడం దీని ప్రత్యేకత. దీంతో బ్యాటరీ ఎక్కువ కాలం పనిచేయడంతో పాటు కారులో ఎప్పుడూ తాజా సువాసన ఉంటుంది.

ఈ చిన్న గాడ్జెట్లు కాస్త ఖరీదైనవిగా అనిపించినా, అవి అందించే ప్రయోజనాలు మాత్రం చాలా పెద్దవి. సేఫ్టీ, సౌకర్యం, వినోదం, వాహన నిర్వహణ వంటి ప్రతి అంశంలో ఇవి డ్రైవింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. తరచూ కారులో ప్రయాణించేవాళ్లు ఈ స్మార్ట్ గాడ్జెట్లను కారులో అమర్చుకుంటే ప్రతి ప్రయాణం మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా & స్మార్ట్‌గా మారుతుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.