Xiaomi New Car: షావోమీ ఎస్‌యూ7 కారును కంపెనీ అధికారికంగా రివీల్ చేసింది. దీంతో చైనీస్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ కార్ల రంగంలోకి కూడా ప్రవేశించింది. తన మొదటి కారుగా ఎలక్ట్రిక్ కారును కంపెనీ తీసుకురావడం విశేషం. 2023లోనే ఈ కారును చైనాలో మొదట రివీల్ చేశారు. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లలో కూడా అందుబాటులోకి రానుంది.


షావోమీ ఎస్‌యూ7 అనేది ఒక స్లీక్, స్పోర్టీ సెడాన్ కారు. బ్లూ కలర్‌లో ఇది అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇది పెర్ఫార్మెన్స్ సెడాన్ అని కంపెనీ తెలిపింది. ఫుల్లీ ఎలక్ట్రిక్ ఇంజిన్‌ను ఈ కారులో అందించారు. కేవలం 2.78 సెకన్లలోనే 0 నుంచి 60 మైళ్ల వేగాన్ని అందుకోవచ్చు. అంటే మూడు సెకన్లలోపే దాదాపు 100 కిలోమీటర్ల వేగం అందుకోవచ్చన్న మాట.


ఇందులో 101 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని కంపెనీ అందించింది. ఒకసారి ఛార్జింగ్ పెడితే ఏకంగా 497 మైళ్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ అంటోంది. అంటే దాదాపు 800 కిలోమీటర్ల దూరం. దీన్ని బట్టి ఈ ఫోన్ సింగిల్ ఛార్జితో లాంగ్ డ్రైవ్‌లకు కూడా వెళ్లవచ్చన్న మాట. ఈ కారు ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌తోనే 317 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చట. అంటే 15 నిమిషాలు ఛార్జింగ్ పెట్టి 500 కిలోమీటర్లు తిరిగేయచ్చన్న మాట. దీంతో పాటు షావోమీ 150 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీలను కూడా త్వరలో తీసుకురానుందట. ఇవి వస్తే 700 మైళ్ల వరకు రేంజ్ పెరగనుంది. కానీ దీనికి కొన్ని సంవత్సరాల వరకు సమయం పట్టవచ్చు.


ఈ కారు లాంచ్ వివరాలను షావోమీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అలాగే త్వరలో ప్రపంచంలోనే టాప్ ఫైవ్ ఆటోమోటివ్ కంపెనీల్లో చేరాలనేది షావోమీ లక్ష్యంగా పెట్టుకుంది. తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లున్న ఫోన్లను అందించడం ద్వారా షావోమీ స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇప్పుడు అదే టెక్నిక్‌ను కార్లలో కూడా ఫాలో అవుతుందో లేదో అనేది చూడాలి.


Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?



Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?