Xiaomi Electric Car: చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షావోమీ తన మొదటి ఎలక్ట్రిక్ కారును పరిచయం చేసింది. ప్రపంచంలోని టాప్ ఫైవ్ ఆటోమేకర్ల జాబితాలో చేరాలనే ఆకాంక్షను కూడా వ్యక్తం చేసింది. షావోమీ ఎస్‌యూ7 అనే సెడాన్ కారును పరిచయం చేసింది.
షావోమీ ఎస్‌యూ7 సెడాన్ సంస్థ తీసుకువస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మోడల్. అత్యంత ప్రజాదరణ పొందిన షావోమీ స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఇందులో ఉపయోగించవచ్చని భావిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లలో ధరల విషయంలో షావోమీ చాలా అగ్రెసివ్‌గా ఉంటుంది. మరి కార్ల విషయంలో ఎలా ఉంటుందో చూడాలి.
కార్ల విషయంలో కూడా షావోమీ పెద్ద లక్ష్యాలను కలిగి ఉంది. భవిష్యత్తులో పోర్షే, టెస్లా వంటి కార్లతో పోటీ పడేలా డ్రీమ్ కారును రూపొందించాలని అనుకుంటోంది. దీని కోసం రాబోయే 15, 20 సంవత్సరాలు పూర్తి స్థాయిలో శ్రమించాల్సి ఉంటుంది. టాప్ ఫైవ్ ఆటోమేకర్స్‌లో షావోమీ చేరడం వల్ల చైనా ఆటోమొబైల్ రంగానికి మరింత బలం చేకూరనుంది.
అనేక ఇతర కంపెనీల మాదిరిగానే షావోమీ కూడా ఈవీ సెక్టార్‌లో కొత్తగా ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తోంది. కంపెనీ ఈ కారును గురించి 2021లోనే మొదట మాట్లాడింది. వచ్చే దశాబ్దంలో ఆటో పరిశ్రమలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడం గురించి కూడా కంపెనీ తెలిపింది.
బీజింగ్‌లో జరుగుతున్న కార్యక్రమంలో షావోమీ వాహనాలలో ఉన్న ఆటోనోమస్ కెపాసిటీ ఈ విభాగంలో కనిపించే ఇతర వాహనాల కంటే భిన్నంగా ఉందని కంపెనీ తెలిపింది. షావోమీ బ్రాండ్ కార్లను చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని గ్రూప్ బీఏఐసీ యూనిట్ తయారు చేస్తుంది. వీరి వార్షిక సామర్థ్యం 2,00,000 యూనిట్లు కావడం విశేషం. అంటే సంవత్సరానికి రెండు లక్షల కార్లు ఇక్కడ తయారవుతున్నాయన్న మాట.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!