Thalapathy68 First Look: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ఇటీవలే ‘లియో’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. విజయ్ తర్వాతి సినిమా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను నిర్మాతలు విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.






సుడిగాలి సుధీర్ హీరోగా తెలుగులో ‘G.O.A.T (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం)’ అనే సినిమా ఇప్పటికే షూటింగ్‌లో ఉంది. విష్వక్‌సేన్‌తో ‘పాగల్’ సినిమా తీసిన నరేష్ కుప్పిలి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ బ్యూటీ దివ్యభారతి ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ టైటిల్ కూడా ఇప్పటికే రిజిస్టర్ చేయించి ఉంటారు. దళపతి విజయ్‌కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. కాబట్టి ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ తెలుగులో కూడా కచ్చితంగా విడుదల అవుతుంది. మరి తెలుగులో వేరే టైటిల్‌తో వస్తుందా? లేకపోతే ఇదే టైటిల్‌తో వస్తుందా? అన్నది వేచి చూడాలి.


ఇక దళపతి విజయ్ ఫస్ట్ లుక్ విషయానికి వస్తే... ఇందులో హీరో రెండు లుక్స్‌లో కనిపిస్తున్నారు. ఒకటి ఓల్డ్ లుక్ కాగా, మరొకటి యంగ్ లుక్. మరి విజయ్ రెండు పాత్రల్లో నటిస్తున్నారా? లేకపోతే ఒక మనిషి జీవితంలోని వేర్వేరు దశల్లో ఈ కథ సాగుతుందా? అన్నది చూడాలి. ఫైటర్ జెట్ కాస్ట్యూమ్‌లో పారాచూట్ నుంచి ఇద్దరు విజయ్‌లు నడుచుకుంటూ రావడం ఇందులో చూడవచ్చు. ఇది ఏ తరహా చిత్రం అన్నది కూడా ఇంతవరకు బయటకు రాలేదు. ప్రతి డిటైల్‌ను నిర్మాతలు చాలా రహస్యంగా ఉంచుతున్నారు. 


2024 సమ్మర్‌లో ఈ సినిమా విడుదల అవుతుందని వార్తలు వస్తున్నాయి. కానీ పోస్టర్ మీద రిలీజ్ తేదీ కూడా ప్రకటించలేదు. ఇక పోస్టర్‌లో ‘LIGHT CAN DEVOUR THE DARKNESS BUT DARKNESS CANNOT CONSUME THE LIGHT’ అని క్యాప్షన్‌గా పెట్టారు. అంటే ‘వెలుగు చీకటిని వేగంగా మింగేయగలదు. కానీ చీకటి వెలుగును ఆక్రమించలేదు.’ అన్నది అర్థం అన్నమాట.


Also Readముట్టుకోవద్దని చెప్పాను కదరా... ప్రభాస్‌ను వాడుకున్న పోలీసులు


వెంకట్ ప్రభు తన సినిమాకు ఇచ్చుకునే ట్యాగ్‌లైన్ విభిన్నంగా ఉంటుంది. నాగచైతన్య హీరోగా గతేడాది తన దర్శకత్వంలో విడుదల అయిన ‘కస్టడీ’కి ‘ఎ వెంకట్ ప్రభు హంట్’ అనేది క్యాప్షన్‌గా పెట్టారు. అలాగే ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’కు కూడా కొంచెం కొత్తగా ‘ఎ వెంకట్ ప్రభు హీరో’ అని ట్యాగ్‌లైన్ ఉంచారు.


ఏజీయస్ బ్యానర్‌పై అర్చన కల్పాత్తి, ఐశ్వర్య కల్పాత్తి, కల్పాత్తి ఎస్ అగోరం, కల్పాత్తి ఎస్ గణేష్, కల్పాత్తి ఎస్ సురేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చాలా కాలం తర్వాత విజయ్ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా, మైక్ మోహన్, జయరాం, యోగిబాబు, అజ్మల్, వీటీవీ గణేష్, వైభవ్, ప్రేమ్‌జీ అమరన్, అరవింద్ ఆకాష్, అజయ్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 


Also Readగోపీచంద్ సినిమాకు 'వెంకీ' కామెడీ టచ్ - ఇంట్రెస్టింగ్ మేటర్ రివీల్ చేసిన శ్రీను వైట్ల