Best Selling 7 Seater Car: భారత మార్కెట్‌లో గత కొన్నేళ్ల నుంచి కార్ల విక్రయాలు పెరిగాయి. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి టైం నుంచి ఫ్యామిలీ జర్నీ కోసం కార్లకు ప్రియారిటీ ఇస్తున్నారు. ఈ క్రమంలో మారుతి సుజుకి ఈకోను దేశంలోనే అత్యంత చౌకైన, బెస్ట్ సెల్లింగ్ 7 సీటర్ కారుగా భావిస్తారు. అత్యుత్తమ మైలేజ్, ఎక్కువ క్యాబిన్ స్పేస్, తక్కువ ధర కారణంగా ఈ కారు ఫ్యామిలీ జర్నీకి సరిగ్గా సరిపోతుంది. ధర కారణంగా కమర్షియల్ కస్టమర్లు సైతం ఈ కారును విపరీతంగా కొంటున్నారు. జూలై 2026లో మారుతి సుజుకి ఈకో కారుపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది.  7 సీటర్ విభాగంలో మరోసారి కంపెనీ పేరును  మారుతి సుజుకి ఈకో నిలబెట్టింది. అమ్మకాల్లో ఇతర కార్లను కూడా వెనక్కి నెట్టిన ఈ కారు BS-6 ఇంజిన్‌తో వస్తుంది.  ఓసారి ఈ కారు ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు చూశాక.. నచ్చితే మీరు కూడా కొనేయండి. 

Continues below advertisement

మీది పెద్ద కుటుంబం అయితే, తక్కువగా బడ్జెట్లో 7 సీటర్ కారు కొనడం కోసం చూస్తున్నారా.. మీకు మారుతి సుజుకి ఈకో సరిగ్గా సరిపోతుంది. తక్కువ ధర, సులువైన మెయింటెనెన్స్, ఎక్కువ మంది సీటింగ్ సామర్థ్యం కారణంగా లక్షలాది భారత కుటుంబాలు ఈ కారు వైపు మొగ్గు చూపుతున్నాయి. అందుకే మారుతి సుజుకి ఈకో 2026 మొదటి అర్ధభాగంలో భారీ అమ్మకాలను నమోదు చేసింది. దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే వ్యాన్ విభాగంలో తన  స్థానాన్ని నిలబెట్టుకుంది. 2026 తొలి 6 నెలల్లో అత్యధికంగా అమ్ముడైన వ్యాన్ కేటగిరీ కార్లలో ఒకటిగా మారుతి సుజుకి ఈకో  నిలిచింది. మారుతి సుజుకి ఈకో భారత్‌లో 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు 12 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడై మార్కెట్లో సత్తా చాటుతోంది. 

తక్కువ ధరలోనే 7 సీటర్ కారు 

Continues below advertisement

దేశంలోనే అత్యంత తక్కువ ధరలో లభించే 7 సీటర్ కార్లలో మారుతి సుజుకి ఈకో ఒకటని చెప్పవచ్చు. ఇది 5 సీటర్, 7 సీటర్ రెండు ఆప్షన్లలోనూ మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ ఏడాది జూన్ వరకు మారుతి సుజుకి ఈకో కారును 71,424 మంది కొనుగోలు చేశారు. ఈ కారు ప్రారంభ ధర ₹5.23 లక్షల నుండి ₹6.41 లక్షల వరకు ఉండటంతో పాటు తక్కువ మెయింటెనెన్స్ కారణంగా రోజువారీ ప్రయాణాలకు సైతం ఈ కారు ఉపయోగిస్తున్నారు. 

Also Read: టాటా నెక్సాన్‌ను హైదరాబాద్‌లో 2 లక్షల డౌన్‌పేమెంట్‌తో కొనుగోలు చేస్తే EMI ఎంత చెల్లించాలి?

ఫ్యామిలీ జర్నీకే కాదు.. కమర్షియల్ పనులకు సైతం ఇదే కారుమారుతి ఈకోను కేవలం ఫ్యామిలీ కారుగానే కాకుండా, చిన్న వ్యాపారాలు, కమర్షియల్ అవసరాల కోసం సైతం అధికంగానే ఉపయోగిస్తారు. అందుకే ఈ కారుకు అన్ని వర్గాల నుంచి డిమాండ్ నిరంతరం ఉంటుంది. దాంతో ప్రతినెలా వేల యూనిట్లు అమ్మకాలతో దూసుకెళ్తోంది.

మారుతి సుజుకీ ఈకో మైలేజ్, ఇంజిన్ పవర్ మారుతి ఈకోలో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ వస్తుంది. పెట్రోల్‌లో ఇది 80.76 PS పవర్ అవుట్‌పుట్, 104.5 Nm టార్క్‌ జనరేట్ చేస్తుంది. CNG ఇంజిన్‌లో అయితే 71.65 PS పవర్ అవుట్‌పుట్, 95 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ కారు టూర్ వేరియంట్ పెట్రోల్ వర్షన్‌ లీటర్‌కు 20 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. CNG ఇంజిన్‌ అయితే ఒక కేజీకి 27.05 కి. మీ మైలేజ్ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేసింది. అయితే రోడ్లు, ట్రాఫిక్ బట్టి మైలేజీ మారుతుందని తెలిసిందే. సాధారణ మోడల్స్ పెట్రోల్ ఇంజిన్‌లో 19.7 కి.మీ, CNGతో 26.78 కిమీ వరకు మైలేజ్ ఇస్తుంది. రెండు ఆప్షన్లలో లభించే ఈ కారు తక్కువ ధరతో పాటు తక్కువ ఇంధన ఖర్చు వల్ల బడ్జెట్ కొనుగోలుదారులకు బెస్ట్ ఆప్షన్‌గా మారింది. 

Also Read: మోటార్ ఇన్సూరెన్స్ గడువు దాటనివ్వొద్దు - నో క్లెయిమ్‌ బోనస్‌తో పాటు చాలా కోల్పోతారు!