Tata Nexon EV EMI Calculator: భారత్ మార్కెట్‌లో ఈవీల జోరు పెరుగుతోంది. ఈ జోరును అందుకున్న టాటా సంస్థ నెక్సాన్ ఈవీని తీసుకొచ్చి మధ్యతరగతి, ప్రీమియం బయ్యర్లను ఆకట్టుకుంది. అందుకే నెక్సాన్ విడుదలైన ఎడాదిలోనే లక్షకుపైగా విక్రయాలతో సరికొత్త రికార్డు సృష్టించింది. ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్న టాటా నెక్సాన్ ఈవీని ఈఎంఐ ద్వారా కొనుగోలు చేయాలంటే ఎంత డౌన్‌పేమెంట్ చెల్లించాలి. నెలకు ఈఎంఐ ఎంత చెల్లించాలో చూద్దాం.
కారు కొనాలనే కల చాల మందికి ఉంటుంది. అయితే ఒకేసారి అంత మొత్తం చెల్లించలేక ఇబ్బంది పడుతుంటారు. అయితే అలాంటి వారు ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేక, నెలవారీగా చెల్లించుకుంటే మీ ఇంటి బడ్జెట్‌పై ఎఫెక్ట్ పడదు. టాటా నెక్సాన్ ఈవీ బేస్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర 12.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాప్ ఎండ్ వేరియంట్ 117.69లక్షల వరకు ఉంది. హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాల్లో దీని ఆన్‌రోడ్ ధరలు ఆ రాష్ట్ర పన్నలపై ఆధారపడి ఉంటాయి.
టాటా మోటార్స్ తన నెక్సాన్ ఈవీని రెండు ప్రధాన బ్యాటరీ ఆప్షన్స్‌లో ఇస్తుంది. ఒకటి 30kWh, రెండోది 45kWh. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా క్రియేటివ్ ప్లస్, ఫియర్‌లెస్, ఎంపవర్డ్ వేరియంట్స్‌లలో లభిస్తుంది.
హైదరాబాద్‌లో కారు కొనాలి అంటే ఆన్‌రోడ్ ధర 13.22 లక్షల నుంచి 18.77లక్ష వరక ఉంటుంది. ప్రభుత్వ సబ్సిడీలు, స్థానిక రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఇన్సూరెన్స్ ఆధారంగా ఈ ఆన్‌రోడ్ ధరలలో మార్పులు ఉంటాయి. బేస్ మోడ్ అయిన క్రియేటివ్ ప్లస్ 30kWh కారు ఎక్స్ షోరూమ్ ప్రైస్ 12.49 లక్షలు ఉంటే, అన్ని పన్నులు కలిపి ఆన్‌రోడ్ ధర 13.22 లక్షలు వరకు ఉంటుంది.
బేస్ వేరియంట్ ఈఎంఐ నెలకు 24, 410 రూపాయలు
టాటా నెక్సాన్ ఈవీ బేస్ వేరియంట్ అయిన క్రియేటివ్ ప్లస్ 30kWh మోడల్‌ను ఫైనాన్స్ ద్వారా కొనాలనుకుంటే కనీసం డౌన్‌పేమెంట్ 2 లక్షల రూపాయలు చెల్లించాలి. మిగతా 11,21,847 రూపాయలను బ్యాంకు లోన్ ద్వారా పొందవచ్చు. దీనికి 8.5 బ్యాంకు వడ్డీ వసూలు చేస్తే ఐదేళ్ల కాలపరిమితి తీసుకుంటే నెలకు ఈఎంఐ 23,016 చెల్లించాల్సి ఉంటుంది. ఐదేళ్లలో 2,59,113 రూపాయలు వడ్డీ రూపంలో చెల్లించాల్సి ఉంటాయి.
- ఇదే అమౌంట్‌ను తొమ్మిది శాతం వడ్డీకి తీసుకుంటే నెలకు 23,287 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
- ఇదే అమౌంట్‌ను తొమ్మిది శాతం వడ్డీకి నాలుగేళ్ల కాలపరిమితికి బ్యాంకు లోన్ తీసుకుంటే నెలకు 27,917 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
- ఇదే అమౌంట్‌ను తొమ్మిది శాతం వడ్డీకి మూడేళ్ల కాలపరిమితికి బ్యాంకు లోన్ తీసుకుంటే నెలకు 35,674 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
- ఇదే అమౌంట్‌ను తొమ్మిది శాతం వడ్డీకి రెండేళ్ల కాలపరిమితికి బ్యాంకు లోన్ తీసుకుంటే నెలకు 51,251 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
టాప్ వేరియంట్ ఈఎంఐ ఎంత?
లేటెస్ట్ టెక్నాలజీ, గరిష్ట రేంజ్ కావాలనుకునే వారి కోసం ఎంపవర్డ్ ప్లస్ ఏ 45kWh డార్క్ ఎడిషన్ ఎక్స్‌షోరూమ్ ధర 17.69లక్షలు. ఇది హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ప్రైస్ సుమారు 18.77లక్షలు. దీన్ని 9శాతం వడ్డీతో ఐదేళ్ల కాలపరిమితికి రెండు లక్ష రూపాయల డౌన్‌పేమెంట్ చెల్లించి 16,55,693 రూపాయలను ఐదేళ్ల కాలపరిమితికి లోన్ తీసుకుంటే నెలకు 34,369 రూపాయలుగా ఉంటుంది. నాలుగేళ్ల కాలపరిమితికి లోన్ తీసుకుంటే నెలకు 41,201 రూపాయలుగా ఉంటుంది. మూడేళ్ల కాలపరిమితికి లోన్ తీసుకుంటే నెలకు 52,650 రూపాయలుగా ఉంటుంది.
ఎంత సేవ్ అవుతుంది?
మీరు నెల నెల ఈఎంఐ చెల్లిస్తున్నప్పటికీ సాధారణమైన పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే నెక్సాన్ ఈవీ ఈ ఖర్చును భారీగా తగ్గిస్తుంది. రోజుకు యాభై కిలోమీటర్లు ప్రయాణించే వ్యక్తి పెట్రోల్ కారులో వెళ్తే నెలకు ఎనిమిది నుంచి పది వేల వరకు ఖర్చు అవుతుంది. అదే నెక్సాన్ ఈవీలో హోమ్ ఛార్జింగ్ వాడుకుంటే కరెంటు బిల్లు పదిహేను వందల వరకు వచ్చినా, నెలకు ఏడు వేల రూపాయలు సేవ్ అవుతాయి.
టాటా నెక్సాన్ ఏ వేరియంట్ ఎంత ప్రైస్ ఉంది?
హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ధర ఉన్న ఈ కింది వేరియంట్స్‌ను ఐదేళ్ల కాలపరిమితికి 9 శాతం వడ్డీతో రెండు లక్ష డౌన్‌పేమెంట్ చేసి తీసుకుంటే నెలకు ఎంత ఈఎంఐ పడుతుందూ ఈ పట్టికలో చూడవచ్చు.
| వేరియంట్ పేరు | ఎక్స్‌షోరూమ్ ధర | ఆన్‌రోడ్ ప్రైస్ | నెలవారీగా ఈఎంఐ(ఐదేళ్ల కాలపరిమితికి) |
| క్రియేటివ్ ప్లస్ 30.0kWh | ₹12,49,000 | ₹13,21,847 | ₹23,287 |
| ఫియర్‌లెస్30.0kWh | ₹13,29,000 | ₹14,16,000 | ₹25,023 |
| క్రియేటివ్ 45.0kWh | ₹14,14,000 | ₹15,15,000 | ₹ 27,006 |
| ఫియర్‌లెస్ 45.0kWh | ₹15,14,000 | ₹16,20,000 | ₹29,262 |
| ఎంపవర్డ్ 45.0kWh | ₹16,14,000 | ₹17,25,000 | ₹31,435 |
| ఎంపవర్డ్ ప్లస్ A 45.0kWh | ₹17,49,000 | ₹18,67,000 | ₹34,369 |
| ఎంపవర్డ్ ప్లస్ A 45.0kWh Dark | ₹17,69,000 | ₹18,77,000 | ₹34,804 |
ఈవీ చేసేటప్పుడు కేవలం నెలవారీ ఈఎంఐ మాత్రమే కాకుండా మీ రోజువారీ ప్రయాణాన్ని కూడా పరిగణలోకి తీసుకోండి. మీరు రోజూ నలభై కిలోమీటర్ల దూరం ప్రయాణించే వినియోగదారులు పెట్రోల్ వాహనం కంటే ఈవీ తీసుకోవడం మంచిది. మీరు కారు కొన్న మూడు నాలుగేళ్ల కాలంలోనే మీరు పెట్టిన ఖర్చు రికవరీ చేసుకోవచ్చు. బ్యాంకు లోన్ మీ సిబిల్ స్కోరుపై ఆధారపడి ఉంటుంది. సిబిల్ స్కోరు ఎక్కువ ఉంటే మీకు తక్కువ వడ్డీకే లోన్ లభిస్తుంది.
