Hyundai Creta Bookings: జనవరిలో లాంచ్ అయిన కొత్త హ్యుందాయ్ క్రెటా ఇప్పటివరకు భారతదేశంలో 75,000 యూనిట్ల బుకింగ్ మార్కును అధిగమించింది. 2024 ఫిబ్రవరి ప్రారంభంలో 51,000 యూనిట్ల బుకింగ్‌ను దాటిన తర్వాత ఒక నెలలోపే కంపెనీ దాదాపు 24,000 యూనిట్ల బుకింగ్‌లను నమోదు చేసింది. ఇది కాకుండా భారతదేశంలో ఇప్పటివరకు హ్యుందాయ్ క్రెటా మొత్తం 10 లక్షల యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ ఇటీవల ప్రకటించింది.


2024 హ్యుందాయ్ క్రెటా వేరియంట్లు
ఏడు ట్రిమ్ లెవల్స్‌లో కొత్త క్రెటా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే కస్టమర్‌లు మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్‌లలో టాప్ స్పెక్ ఎస్ఎక్స్(వో) ట్రిమ్‌ను ఇష్టపడుతున్నారు. క్రెటా ఎస్ఎక్స్(వో) ధర ఇంజిన్, ట్రాన్స్‌మిషన్ ఆధారంగా రూ. 17.24 లక్షల నుంచి రూ. 20 లక్షల మధ్య ఉంది. 1.5 పెట్రోల్ మాన్యువల్  మిడ్ స్పెక్ ఎస్ వేరియంట్ ధర రూ.13.39 లక్షలుగానూ, 1.5 డీజిల్ మాన్యువల్ మిడ్ స్పెక్ ఎస్ వేరియంట్ ధర రూ.14.82 లక్షలుగానూ ఉందని డీలర్ వర్గాలు వెల్లడించాయి.


కొత్త హ్యుందాయ్ క్రెటా ప్రస్తుతం రూ. 11 లక్షల ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర వద్ద అందుబాటులో ఉంది. కలర్ ఆప్షన్ల విషయానికొస్తే హ్యుందాయ్ క్రెటా అబిస్ బ్లాక్ పెర్ల్, రోబస్ట్ ఎమరాల్డ్ పెర్ల్, ఫైరీ రెడ్, రేంజర్ ఖాకీ, టైటాన్ గ్రే, అట్లాస్ వైట్, అట్లాస్ వైట్ విత్ అబిస్ బ్లాక్ రూఫ్ (డ్యూయల్ టోన్)తో సహా ఏడు పెయింట్ స్కీమ్‌లతో కొనుగోలు చేయవచ్చు.


హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీలో మూడు ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి, ఇందులో 1.5 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ IVT/IMT, 6 స్పీడ్ ఆటోమేటిక్, 7 స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్ వంటి అనేక ఆప్షన్లు ఇందులో ఉన్నాయి.


ఇది కాకుండా కొరియన్ వాహన తయారీ సంస్థ క్రెటా పెర్ఫార్మెన్స్ సెంట్రిక్ ఎన్ లైన్ వేరియంట్‌ను ఈ నెల 11వ తేదీన దేశంలో విడుదల చేయనుంది. దీని ఎక్స్‌టీరియర్, వేరియంట్ కలర్ ఆప్షన్స్, పవర్‌ట్రెయిన్, సేఫ్టీ ఫీచర్లు, వెయిటింగ్ పీరియడ్‌తో సహా అన్ని వివరాలు వెల్లడయ్యాయి. హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ... కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, స్కోడా కుషాక్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్‌లకు పోటీగా ఉంది.


క్రెటా 6 స్పీడ్ మాన్యువల్, సీవీటీ ఎంపికతో 115 హెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేసే 1.5 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లో కూడా భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉంది. కొత్తగా 160 హెచ్‌పీ పవర్ జనరేట్ చేసే 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కూడా అందించారు. ఇందులో 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ప్రామాణికంగా వస్తుంది. ఈ రెండు పెట్రోల్ వేరియంట్ల కోసం వెయిటింగ్ పీరియడ్ కూడా మూడు నుంచి నాలుగు నెలల వరకు ఉంది. క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఏడు కలర్ ఆప్షన్‌ల్లో అబిస్ బ్లాక్ ఫినిషింగ్‌లో ఒక వేరియంట్‌కు ఎక్కువ డిమాండ్ ఉందని తెలుస్తోంది. దీంతోపాటు టైటాన్ గ్రే మోడల్‌ను వినియోగదారులు తక్కువగా ఇష్టపడుతున్నారని కూడా తెలిసింది.


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!