Upcoming Cars: 2024 జనవరిలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో అనేక కార్లు మార్కెట్లోకి వచ్చాయి. దీంతో భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ కూడా చాలా కార్యకలాపాలను చూస్తుంది. దీంతో పాటు కొత్త మోడళ్లను విడుదల చేయడంతో ఫిబ్రవరి నెల కూడా జోరుగా ఉండనుంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్
మహీంద్రా ఇటీవల విడుదల చేసిన ఎక్స్‌యూవీ400 ఫేస్‌లిఫ్ట్ మాదిరిగానే ఎక్స్‌యూవీ300 కూడా డిజైన్, ఫీచర్ అప్‌గ్రేడ్‌లను పొందనుంది. 2025లో రానున్న మహీంద్రా బీఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ నుంచి ప్రేరణ పొంది ఈ సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీ రూపకల్పనలో అనేక ప్రధాన అప్‌డేట్లు చేశారు. 2024 మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్ దాని విభాగంలో పనోరమిక్ సన్‌రూఫ్, పెద్ద 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉన్న మొదటి ఎస్‌యూవీ కావడం విశేషం. మిడ్ లైఫ్ అప్‌డేట్‌లో 131 బీహెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేసే 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను అయిసిన్ సోర్స్డ్ 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కలిపి అందించనున్నారు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న 1.2 లీటర్ డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌లు కూడా అలాగే ఉంటాయి.
కొత్త తరం మారుతీ స్విఫ్ట్
కొత్త తరం మారుతి స్విఫ్ట్ కూడా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే దీని లాంచ్ తేదీని అధికారికంగా వెల్లడించలేదు. స్టీరింగ్ వీల్, ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్విచ్ గేర్, ఇతర మారుతి సుజుకి కార్ల మాదిరిగానే హెచ్‌వీఏసీ కంట్రోల్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. కొత్త స్విఫ్ట్‌లో 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉండనుంది. ఇది మైల్డ్ హైబ్రిడ్, నాన్ హైబ్రిడ్ టెక్నాలజీతో అందుబాటులో ఉండనుంది.
టాటా టియాగో సీఎన్‌జీ ఏఎంటీ
రాబోయే టాటా టియాగో, టిగోర్ సీఎన్‌జీ ఏఎంటీ మోడళ్ల కోసం బుకింగ్ ప్రారంభం అయింది. దీని కోసం రూ. 21,000 టోకెన్ బుకింగ్ అమౌంట్ ఫిక్స్ చేశారు. ఈ మోడల్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడిన భారతదేశపు మొదటి సీఎన్‌జీ కారు. సీఎన్‌జీ ఏఎంటీ వేరియంట్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. ఇది పెట్రోల్‌పై 113 ఎన్ఎం పీక్ టార్క్, 86 బీహెచ్‌పీ పవర్, సీఎన్‌జీపై 95 ఎన్ఎం పీక్ టార్క్, 73 బీహెచ్‌పీ పవర్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తాయి.
స్కోడా ఆక్టేవియా ఫేస్‌లిఫ్ట్
2024 స్కోడా ఆక్టావియా ఫేస్‌లిఫ్ట్ 2024 ఫిబ్రవరిలో గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ కానుంది. దీని ఇండియా లాంచ్‌పై అధికారిక ప్రకటన రాలేదు. అయితే కొన్ని మీడియా నివేదికలు ప్లగ్ ఇన్ హైబ్రిడ్ టెక్నాలజీతో భారత్‌కు వచ్చే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. టీజర్‌లో డయాగోనల్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, అప్‌డేట్ చేసిన ఫ్రంట్ గ్రిల్, కొత్త ఫ్రంట్, రియర్ బంపర్‌లు, కొత్త సెట్ అల్లాయ్ వీల్స్, అప్‌డేట్ చేసిన టెయిల్‌ల్యాంప్‌లతో కొత్తగా డిజైన్ చేసిన హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. ఇంటీరియర్‌లో వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, 10 అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లేతో కూడిన కొత్త 10 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది గ్లోబల్ మార్కెట్‌లో అనేక ఇంజన్ ఆప్షన్‌లతో రానుంది.