TVS X Electric Two Wheeler: భారతదేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీలలో టీవీఎస్ కూడా ఒకటి. పెట్రోల్ ఇంజన్ బైక్‌లు, స్కూటర్‌లతో పాటు ఎలక్ట్రిక్ స్కూటర్ ఐక్యూబ్‌ను కూడా టీవీఎస్ విక్రయిస్తుంది. కంపెనీ తన తదుపరి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కూడా ఆవిష్కరించింది. ఇది ఒక ఫ్యూచరిస్టిక్ ఈవీ. ఇందులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, టెయిల్ ల్యాంప్ చూడవచ్చు.
టీవీఎస్ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను 4.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్, 11 కేడబ్ల్యూ పీఎంఎస్ఎం మోటార్‌తో ఎక్విప్ చేసింది. ఇది 140 కిలోమీటర్ల రేంజ్‌ను అందించగలదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 105 కిలోమీటర్లుగా ఉంది. అలాగే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 2.6 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. 0 నుంచి 50 శాతం ఛార్జింగ్ కేవలం గంటలోనే ఎక్కగలదు.
టీవీఎస్ ఎక్స్ డిజైన్, ఫీచర్లు ఇలా
టీవీఎస్ తన స్కూటర్‌ను కొత్త డిజైన్‌తో లాంచ్ చేసింది. ఈ ప్లాట్‌ఫారమ్‌లో 10.2 అంగుళాల టచ్ స్క్రీన్ అందించారు. దీంట్లో వీడియో గేమ్‌లు, వీడియోలు చూడటం, సెట్టింగ్ థీమ్‌లు, డిజిటల్ కీలు, జియో ఫెన్సింగ్ వంటి నావిగేషన్ ఫీచర్లు, థెఫ్ట్ అలర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్ హిల్ హోల్డ్, క్రూయిజ్ కంట్రోల్, ఏబీఎస్ ఉన్నాయి. అయితే దీని ధరను కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు. ఎక్స్‌టీహెల్త్, ఎక్స్‌టీరైడ్, క్సానిక్ అనే మూడు రైడ్ మోడ్స్ ఇందులో ఉన్నాయి.
వీటితో పోటీ
టీవీఎస్ నుంచి వచ్చిన ఈ హై పెర్ఫామెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిన ఓలా ఎస్1 ప్రో, ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీ పడనుంది. కంపెనీ ధరను వెల్లడిస్తే వేటితో పోటీ పడనుందని క్లారిటీ వస్తుంది.
టీవీఎస్ ఎక్స్ ధర ఎంత?
దీని ధరను మనదేశంలో రూ.2,49,900గా (ఎక్స్ షోరూం) నిర్ణయించారు. రూ.ఐదు వేలు చెల్లించి దీన్ని బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మనదేశంలో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ వాహనం ఇదే కానుంది.
మరోవైపు బజాజ్ ఆటో తన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 'పండుగ ఆఫర్'ను అందిస్తోంది. ఈ ఆఫర్ కింద ఫేమ్-2 సబ్సిడీ తర్వాత ఇప్పుడు ఢిల్లీ/బెంగళూరులో ఈ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1.30 లక్షలకు చేరింది. అంటే ఇప్పుడు వినియోగదారులకు ఈ పండుగ సీజన్ సందర్భంగా ఈ వాహనం కొనుగోలుపై రూ. 14,000 భారీ తగ్గింపు లభించనుందన్న మాట.
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial