TVS Jupiter 110 Price and Features: టీవీఎస్ మోటార్ ఇండియా తన కొత్త తరం మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. టీవీఎస్ జూపిటర్ 110 పలు సరికొత్త ఫీచర్లతో మార్కెట్లోకి విడుదల కానుంది. టీవీఎస్ మోటార్ కంపెనీ తన సోషల్ మీడియా హ్యాండిల్ నుండి ఈ స్కూటర్ లాంచ్‌కు సంబంధించిన అప్‌డేట్‌లను కూడా షేర్ చేస్తోంది.


టీవీఎస్ జూపిటర్‌కు మంచి డిమాండ్
మార్కెట్లో స్కూటర్లకు ఉన్న డిమాండ్‌ను పరిశీలిస్తే హోండా యాక్టివా తర్వాత టీవీఎస్ జూపిటర్ అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో ఒకటి. టీవీఎస్ మోటార్ కంపెనీ ఈ స్కూటర్‌ను ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేస్తూనే ఉంటుంది. టీవీఎస్ జూపిటర్‌లో కొత్త వేరియంట్‌లు, వాటిలో కొత్త ఫీచర్లు, స్పెషల్ ఎడిషన్‌లను కంపెనీ ఎప్పటికప్పుడు తీసుకువస్తోంది.


టీవీఎస్ జూపిటర్ 110 కొత్త టీజర్
టీవీఎస్ జూపిటర్ 110 కొత్త టీజర్ ప్రకారం ఈ కొత్త తరం మోడల్‌లో అనేక కొత్త ఫీచర్లు ఉండనున్నాయని తెలుస్తోంది. ఈ స్కూటర్‌లో అతిపెద్ద సీటు ఉంటుంది. అలాగే ఈ వాహనంలో ఫ్రంట్ ఫ్యూయల్ ఫీచర్ కూడా అందించనుందని తెలుస్తోంది.


Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే


టీవీఎస్ జూపిటర్ ఎన్నో ఫీచర్లతో మార్కెట్లోకి రాబోతోంది. ఈ స్కూటర్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ, మొబైల్ ఛార్జింగ్ కోసం యూఎస్‌బీ పోర్ట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎక్స్‌టర్నల్ ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్, చాలా పెద్ద అండర్ సీట్ స్టోరేజ్ ఉన్నాయి. టీవీఎస్ జూపిటర్ 110లో ఎలాంటి కొత్త ఫీచర్లు ఉండనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.


టీవీఎస్ జూపిటర్ ఇంజిన్
TVS జూపిటర్‌లోని ఇంజిన్‌ను రిఫైన్ చేశారు. దీని కారణంగా ఈ స్కూటర్‌ను సిటీలో సులభంగా నడపవచ్చు. ఈ స్కూటర్ ఇంజిన్ మంచి ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ నగరాల్లో కూడా లీటరుకు 45 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఈ ద్విచక్ర వాహనం చాలా లెగ్ రూమ్‌ను కూడా అందిస్తుంది.


Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?