Turbo Petrol vs Naturally Aspirated Engines Comparison : ప్రస్తుతం ఇండియన్ కార్ మార్కెట్లో టర్బో పెట్రోల్ ఇంజిన్ల హవా విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా కాంపాక్ట్ ఎస్‌యూవీలు, సెడాన్లు ఇంకా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లలో కంపెనీలు వీటినే ఎక్కువగా వాడుతున్నాయి. పాత కాలపు పెద్ద ఇంజిన్ల ప్లేస్‌లో చిన్న సైజు టర్బో యూనిట్లను ప్రవేశపెట్టడం ద్వారా అటు పర్ఫార్మెన్స్ ఇటు కాలుష్య నియంత్రణ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నాయి. అయితే తక్కువ మెయింటెనెన్స్ అలాగే స్మూత్ డ్రైవింగ్ కోరుకునే వారు ఇప్పటికీ నేచురల్లీ ఆస్పిరేటెడ్ (NA) ఇంజిన్ల వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ రెండు ఇంజిన్ల మధ్య అసలు తేడా ఏమిటో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.

Continues below advertisement

తేడా ఏంటంటే..?ముందుగా గాలి ఇంజిన్‌లోకి ఎలా వెళ్తుంది అనే అంశంపైనే ఈ రెండింటి డిఫరెన్స్ ఆధారపడి ఉంటుంది. టర్బో పెట్రోల్ ఇంజిన్లలో ఒక టర్బోచార్జర్ ఉంటుంది. ఇది కంబషన్ ఛాంబర్‌లోకి ఫోర్స్‌గా గాలిని పంపి చిన్న ఇంజిన్ అయినా సరే ఎక్కువ పవర్ ఇంకా టార్క్‌ను జనరేట్ చేసేలా చేస్తుంది. అదే నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్లు కేవలం వాతావరణ పీడనం (Atmospheric Pressure) మీద ఆధారపడి గాలిని పీల్చుకుంటాయి. దీనివల్ల పవర్ డెలివరీ చాలా లీనియర్‌గా, అంటే క్రమ పద్ధతిలో సాగుతుంది.

పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే టర్బో ఇంజిన్లదే పైచేయి అని చెప్పవచ్చు. సాధారణంగా 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్లు దాదాపు 170Nm నుండి 200Nm వరకు టార్క్‌ను ఇస్తాయి. కానీ అదే సైజులో ఉన్న నార్మల్ ఇంజిన్లు కేవలం 110Nm నుండి 145Nm టార్క్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తాయి. టర్బో ఇంజిన్లు తక్కువ ఆర్‌పీఎమ్ (RPM) దగ్గరే పీక్ టార్క్‌ను ఇస్తాయి కాబట్టి హైవేల మీద ఓవర్ టేక్ చేసేటప్పుడు లేదా స్పీడ్ పెంచేటప్పుడు ఇవి రాకెట్లా దూసుకుపోతాయి. హై స్పీడ్‌లో వెళ్తున్నప్పుడు పదే పదే గేర్లు మార్చాల్సిన అవసరం కూడా ఉండదు.

Continues below advertisement

న‌గ‌రాల్లో కంఫ‌ర్ట్..నగరాల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్లు చాలా కంఫర్ట్ ఇస్తాయి. ట్రాఫిక్‌లో తక్కువ స్పీడ్ వద్ద కారును కంట్రోల్ చేయడం వీటితో చాలా ఈజీ. టర్బో ఇంజిన్లలో స్టార్టింగ్‌లో కొంచెం లాగ్ (Turbo Lag) అనిపిస్తుంది. నేటి కాలంలో కంపెనీలు ఈ లాగ్‌ను తగ్గించినప్పటికీ, నార్మల్ ఇంజిన్లలో ఉండే ఆ స్మూత్ రెస్పాన్స్ వీటికి రాదు. ముఖ్యంగా డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ ఉన్న టర్బో కార్లు ట్రాఫిక్‌లో కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. అందుకే సిటీలో తిరిగే వారికి నార్మల్ ఇంజిన్లే సరైన ఛాయిస్ అవుతాయి.

ఇక అందరూ ఆశించే మైలేజీ విషయానికి వస్తే పేపర్ మీద టర్బో ఇంజిన్లు మంచి ఫిగర్స్ చూపిస్తాయి. ఎందుకంటే వాటి సైజు తక్కువ కాబట్టి తక్కువ ఇంధనం ఖర్చు చేస్తాయని అనుకుంటారు. కానీ రియల్ వరల్డ్ లో మైలేజీ అనేది మన డ్రైవింగ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది. హైవే మీద ఒకే స్పీడ్ తో వెళ్తే టర్బో ఇంజిన్లు అదిరిపోయే మైలేజీ ఇస్తాయి. అదే మనం దూకుడుగా ఎక్సలరేటర్ నొక్కితే మాత్రం పెట్రోల్ తాగేస్తాయి. నార్మల్ ఇంజిన్లు అలా కాదు, సిటీలోనైనా హైవేలోనైనా దాదాపు ఒకే రకమైన మైలేజీని నిలకడగా ఇస్తాయి.

మెయింట‌నెన్స్..లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ గురించి ఆలోచిస్తే నార్మల్ ఇంజిన్లు చాలా సింపుల్ గా ఉంటాయి. వీటిలో విడిభాగాలు తక్కువ కాబట్టి రిపేర్లు కూడా తక్కువ ఖర్చుతో అయిపోతాయి. కానీ టర్బో ఇంజిన్లు ఎక్కువ వేడి ఇంకా ప్రెజర్ వద్ద పనిచేస్తాయి. కాబట్టి వీటిని టైమ్ కి సర్వీస్ చేయించడం, మంచి క్వాలిటీ ఇంజిన్ ఆయిల్ వాడటం చాలా ముఖ్యం. ఒకవేళ వారంటీ పీరియడ్ అయిపోయిన తర్వాత టర్బోచార్జర్ పాడైతే మాత్రం జేబుకు చిల్లు పడటం ఖాయం.

చివరగా చెప్పాలంటే మీకు హైవే డ్రైవింగ్ ఎక్కువగా ఉండి, అదిరిపోయే పికప్ కావాలి అనుకుంటే టర్బో పెట్రోల్ కారు తీసుకోండి. అలా కాకుండా నాకు మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి, సిటీలో స్మూత్ గా డ్రైవ్ చేయాలి అనుకుంటే మాత్రం నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ బెస్ట్ ఆప్షన్. మీ అవసరాలకు తగ్గట్టుగా సరైన ఇంజిన్‌ను ఎంచుకోవడం వల్ల డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ బాగుంటుంది. కారు కొనేముందు ఈ రెండు రకాలను టెస్ట్ డ్రైవ్ చేసి మీకు ఏది సెట్ అవుతుందో చెక్ చేసుకోవడం మంచిది.