జపనీస్ ఆటోమొబైల్ తయారీదారు టయోటా సాలిడ్ స్టేట్ బ్యాటరీలతో నడిచే ఈవీ (ఎలక్ట్రిక్ వాహనం)పై పని చేస్తుంది. ఇది దాదాపు 1,200 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని తెలుస్తోంది. అయితే ఈ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి కేవలం 10 నిమిషాలు మాత్రమే పట్టనుంది. అంటే కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 1200 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చన్న మాట.


ఎలాన్ మస్క్ టెస్లా సూపర్ ఛార్జర్ 15 నిమిషాల్లో దాదాపు 200 మైళ్ల దూరాన్ని కవర్ చేస్తుంది. ఇప్పుడు టయోటా లాంచ్ చేయనున్న ఈ బ్యాటరీ మరింత వేగంగా ఛార్జ్ అవుతుంది. టయోటా తన కొత్త టెక్నాలజీ రోడ్‌మ్యాప్‌లో 2026 నాటికి తన తదుపరి తరం ఈవీ కోసం అధిక పనితీరు గల లిథియం అయాన్ బ్యాటరీని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు తెలిపింది.


మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం బ్యాటరీ వేగంగా ఛార్జింగ్ అవుతుంది. అలాగే సుమారు 1,000 కిలోమీటర్ల (620 మైళ్ళు) రేంజ్‌ను అందిస్తుంది. టయోటా (టయోటా ఫాస్ట్ ఛార్జింగ్ కారు) చెప్పాలంటే తదుపరి తరం బ్యాటరీలు, సోనిక్ టెక్నాలజీని అనుసంధానం చేయడం వంటి సాంకేతికత ద్వారా 1,000 కిలోమీటర్ల వాహన క్రూజింగ్ రేంజ్‌ను అందిస్తారు.


గత సంవత్సరం మెర్సిడెస్ బెంజ్ దాని లాంగ్ రేంజ్ విజన్ EQXX కాన్సెప్ట్ కారును ఆవిష్కరించింది. ఇది పూర్తిగా ఛార్జ్ చేయబడిన బ్యాటరీతో 1,000 కిలోమీటర్లకు రేంజ్‌ను అందించనుంది. ఇది ఒకే ఛార్జ్‌తో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించింది.


2030 నాటికి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్‌గా
టయోటా తెలుపుతున్న దాని ప్రకారం 2025 నాటికి ప్లగ్ ఇన్ హైబ్రిడ్‌లు, ఈవీలు వాటి దాని గ్లోబల్ అమ్మకాలలో సగభాగం కావాలని లక్ష్యంగా చేసుకున్నారు. అలాగే 2030 నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్‌గా మారాలని టయోటా యోచిస్తోంది.


భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారిస్తున్నాయి. ముఖ్యంగా తక్కువ సమయంలో ఎక్కువ రేంజ్ ఇచ్చే సాంకేతికతపై నిరంతరం పరిశోధనలు సాగుతున్నాయి. కంపెనీలు కొత్త ఈవీ ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నాయి. రాబోయే కాలంలో అత్యధిక రేంజ్ ఇవ్వడం పెద్ద సవాల్ కానుంది.


టొయోటా హైరైడర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ హైబ్రిడ్ వెర్షన్ ధరను కంపెనీ గతంలో అధికారికంగా ప్రకటించింది. ఎంట్రీ లెవల్ ఎస్-ట్రిమ్ ధర రూ.15.11 లక్షలుగా ఉంది. అదే ప్రారంభ ధర. ఇక టాప్ ఎండ్ వీ ట్రిమ్ ధరను రూ.18.99 లక్షలుగా నిర్ణయించారు. ఇక జీ వేరియంట్ ధరను రూ.17.49 లక్షలకు కొనుగోలు చేయవచ్చు.


ఈ హైబ్రిడ్ అర్బన్ క్రూజర్ హైరైడర్ 27.97 కిలోమీటర్ల మైలేజీని అందించనుందని కంపెనీ ప్రకటించింది. ఇందులో ఎలక్ట్రిక్ మోడ్ కూడా అందించారు. దీంతోపాటు హైరైడర్ మరో ఇంజిన్ ఆప్షన్ కూడా అందించారు. ఇది 1.5కే సిరీస్ పెట్రోల్ మోడల్. టొయోటా ఇందులో టాప్ ఎండ్ వీ ఆటోమేటిక్ ధరను రూ.17.09 లక్షలుగా నిర్ణయించింది. ఏడబ్ల్యూడీ సిస్టం, మాన్యువల్ గేర్ బాక్స్ ఫీచర్లు కూడా ఈ కారులో ఉన్నాయి.


మార్కెట్లో ఉన్న పోటీని తట్టుకోవడానికి హైరైడర్ ధరను వీలైనంత రీజనబుల్‌గానే నిర్ణయించారు. ఈ కారు అద్భుతమైన మైలేజ్‌ను అందించనుంది. టాప్ ఎండ్ హైరైడర్ మోడల్లో హెడ్స్ అప్ డిస్‌ప్లే, 360 డిగ్రీ వ్యూ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. 9 అంగుళాల టచ్ స్క్రీన్ కూడా అందించారు. రూ.20 లక్షల్లోపు బెస్ట్ కార్ల లిస్ట్ తీస్తే ఇది కూడా కచ్చితంగా ఉండనుంది.



Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!