Toyota Hyryder Waiting Period: టయోటా కిర్లోస్కర్ మోటార్ 2022 ద్వితీయార్ధంలో భారతదేశంలో దాని మిడ్ రేంజ్ ఎస్‌యూవీ అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ కారును లాంచ్ చేసిన నాటి నుండి ప్రజలు దీన్ని చాలా ఇష్టపడుతున్నారు. మొదట్లో ఈ కారుకు సంబంధించి అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు వినియోగదారులు దాని డెలివరీ కోసం చాలా కాలం వేచి ఉండాల్సి వస్తుంది.


దీని కారణంగా ప్రజలు ఇప్పుడు హైరైడర్‌పై కాకుండా ఇతర ఆప్షన్లపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. దీని కారణంగా హైరైడర్ మార్కెట్‌కు దెబ్బ పడుతోంది. ఈ దెబ్బ వల్ల అతిపెద్ద ప్రయోజనం మారుతి సుజుకి గ్రాండ్ విటారాకు దక్కుతుంది. ఎందుకంటే ఈ రెండు కార్లు ఒకే ప్లాట్‌ఫారమ్‌పై తయారయ్యాయి. ఈ రెండిటి డిజైన్, లుక్ దాదాపుగా ఒకేలా ఉంటాయి. మరోవైపు టయోటా ఇన్నోవా హైక్రాస్ ఎంపీవీలో కొన్ని వేరియంట్‌ల వెయిటింగ్ పీరియడ్ ఏకంగా ఒకటిన్నర సంవత్సరం కంటే ఎక్కువగా ఉంది. అంటే మీరు దీని కోసం చాలా కాలం వేచి ఉండాలన్న మాట.


టయోటా హైరైడర్ వెయిటింగ్ పీరియడ్ ఎంత?
వినిపిస్తున్న వార్తల ప్రకారం ప్రస్తుతం కస్టమర్లు హైరైడర్ మోస్ట్ పవర్‌ఫుల్ హైబ్రిడ్ వేరియంట్ కోసం 12 నుంచి 18 నెలల పాటు వెయిటింగ్ పీరియడ్‌లో ఉండాల్సి వస్తుంది. అలాగే మైల్డ్ హైబ్రిడ్ వెర్షన్ కోసం ఎనిమిది నుంచి 10 నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ తప్పట్లేదు.


సద్వినియోగం చేసుకుంటున్న మారుతి
టయోటా హైరైడర్ కోసం ఎక్కువ వేచి ఉండకుండా మారుతి గ్రాండ్ విటారాను కొనుగోలు చేయడానికి చాలా మంది వినియోగదారులు ఇష్టపడుతున్నారు. దీని వెయిటింగ్ పీరియడ్ హైరైడర్ కంటే చాలా తక్కువగా ఉంది. మారుతి గ్రాండ్ విటారా డెల్టా మాన్యువల్ వేరియంట్ కోసం వినియోగదారులు నాలుగు నెలలు, మైల్డ్ హైబ్రిడ్ జీటా ట్రిమ్‌కు రెండు నెలలు, మైల్డ్ హైబ్రిడ్ రేంజ్ టాపింగ్ ఆల్ఫా ట్రిమ్‌కు కేవలం ఒక నెల మాత్రమే వెయిటింగ్ పీరియడ్ ఉంది.


మారుతి గ్రాండ్ విటారా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లకు నాలుగు నెలల వెయిటింగ్ పీరియడ్ లభిస్తుంది. అదే సమయంలో దాని సీఎన్‌జీ స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ వేరియంట్ల కోసం కేవలం రెండు నెలల వెయిటింగ్ పీరియడ్ మాత్రమే ఉంది.


భారీగా పెరిగిన గ్రాండ్ విటారా అమ్మకాలు
లాంగ్ వెయిటింగ్ పీరియడ్ కారణంగా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ అమ్మకాలు బాగా తగ్గాయి. దీని కారణంగా గ్రాండ్ విటారా ఎంతగానో లాభపడింది. 2023 మే నెలలో హైరైడర్‌కు సంబంధించి కేవలం 3,090 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. అదే సమయంలో వినియోగదారులు మారుతి సుజుకి గ్రాండ్ విటారా 8,877 యూనిట్లను కొనుగోలు చేశారు.


మరోవైపు మహీంద్రా తన ఎక్స్‌యూవీ 700, స్కార్పియో-ఎన్ సహా తన కీలక మోడళ్ల వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించడానికి ఉత్పత్తిని పెంచనుందనే వార్తలో ఎప్పట్నుంచో వినిపిస్తూనే ఉన్నాయి. మీరు బుక్ చేసే సిటీని బట్టి ఈ రెండు ఎస్‌యూవీల వెయిటింగ్ దాదాపు సంవత్సరం వరకు ఉందని తెలుస్తోంది. కానీ ఇప్పుడు మహీంద్రా ఎక్స్‌యూవీ 700, స్కార్పియో-ఎన్‌ల వెయిటింగ్ పీరియడ్ మూడు నుంచి నాలుగు నెలలకు తగ్గిందని సమాచారం.








Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!