Toyota Fortuner Makeover: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీమియం SUVల్లో Toyota Fortuner ఒకటి. ఈ SUVకు ప్రత్యేకమైన అభిమాన వర్గం ఉండటంతో మార్కెట్లో అనేక రకాల ఆఫ్టర్‌మార్కెట్ మోడిఫికేషన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. తాజాగా, ఓ Toyota Fortuner ఓనర్ తన పాత తరం SUVకు పూర్తిగా కొత్త రూపాన్ని ఇచ్చాడు. నెక్స్ట్ జనరేషన్ Fortunerను తలపించేలా ప్రత్యేక బాడీ కిట్‌ను అమర్చడంతో ఈ SUV ఇప్పుడు చూడటానికి కొత్త మోడల్‌లా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను Auto Gallery తన Instagram పేజీలో షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎలాంటి మార్పులు చేశారంటే...ఈ మోడిఫికేషన్‌లో SUV ముందు భాగాన్ని పూర్తిగా మార్చేశారు. అసలు మోడల్‌లో ఉన్న హెడ్‌ల్యాంప్స్, గ్రిల్, బంపర్, బోనెట్ & ఫెండర్లను తొలగించి కొత్త డిజైన్ భాగాలను అమర్చారు. దీంతో Fortuner ముందు భాగం అంతర్జాతీయ మార్కెట్లలో కనిపించిన నెక్స్ట్ జనరేషన్ Fortunerను పోలి కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి: 1,000cc, 280hp పవర్‌తో సంచలనం - ప్రపంచంలోనే అరుదైన 8 సిలిండర్ టూస్ట్రోక్ బైక్ ఆవిష్కరణ

కొత్త ఫ్రంట్ ఫాసియాలో పెద్ద రెక్టాంగులర్ గ్రిల్‌కు హనీకాంబ్ ఇన్‌సర్ట్స్‌ను అందించారు. కొత్త LED హెడ్‌ల్యాంప్స్‌తో పాటు వెడల్పాటి ఎయిర్ డ్యామ్, ఫాక్స్ స్కిడ్ ప్లేట్‌తో రూపొందించిన బంపర్ SUVకు మరింత రగ్గడ్ లుక్‌ను తీసుకొచ్చింది. ఫాగ్ ల్యాంప్స్‌ను కూడా బంపర్ దిగువ భాగంలో అమర్చడం ద్వారా ముందు భాగం మరింత ఆకర్షణీయంగా మారింది.

ఇంతటితో ఆగకుండా కొత్త బోనెట్, రీడిజైన్ చేసిన ఫెండర్లు & పెద్ద వీల్ ఆర్చ్ క్లాడింగ్‌ను కూడా అమర్చారు. అలాగే Fortuner Legenderలో ఉండే 18 అంగుళాల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్‌ను ఈ SUVకు ఉపయోగించారు. డ్యూయల్ టోన్ ఎక్స్‌టీరియర్ కలర్‌తో పాటు బ్లాక్ రూఫ్ ఇవ్వడం వల్ల SUV ప్రీమియం లుక్‌ను సొంతం చేసుకుంది.

ముందు భాగంలో భారీ మార్పులు చేసినప్పటికీ సైడ్ ప్రొఫైల్‌లో మాత్రం పెద్దగా మార్పులు కనిపించవు. వెనుక భాగంలో పరిమిత మార్పులు మాత్రమే చేశారు. కొత్త ఆఫ్టర్‌మార్కెట్ LED టెయిల్ ల్యాంప్స్‌తో పాటు మధ్యలో కనెక్టెడ్ లైట్ బార్‌ను అమర్చారు. డైనమిక్ లైటింగ్ ఎలిమెంట్స్, కొత్త రియర్ బంపర్ & అదనపు బాడీ క్లాడింగ్‌తో వెనుక భాగాన్ని మరింత స్టైలిష్‌గా తీర్చిదిద్దారు. అయితే ఇది అసలు నెక్స్ట్ జనరేషన్ Fortuner రియర్‌ డిజైన్‌కు పూర్తి పోలిక కాదు.

ఇది కూడా చదవండి: కొత్త లుక్‌లో TVS Ntorq 125 - హైదరాబాద్, విజయవాడలో ఆన్‌రోడ్ ధరలు ఇవే

క్యాబిన్‌లో...క్యాబిన్‌లో కూడా గణనీయమైన మార్పులు చేశారు. ఇంటీరియర్‌ను బ్లాక్ & లైట్ బ్రౌన్ డ్యూయల్ టోన్ థీమ్‌తో రీడిజైన్ చేశారు. కొత్త డోర్ ప్యాడ్స్‌కు అంబియంట్ లైటింగ్‌ను జోడించారు. స్టీరింగ్ వీల్‌ను కొత్త లెదర్ ర్యాప్‌తో అలంకరించగా, 13 అంగుళాల ఆఫ్టర్‌మార్కెట్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా అమర్చారు. దీంతో క్యాబిన్ మరింత ఆధునికంగా కనిపిస్తోంది.

ఈ మోడిఫికేషన్‌లో ప్రధానంగా బాహ్య రూపాన్ని పూర్తిగా మార్చినప్పటికీ ఇంజిన్ & మెకానికల్ వ్యవస్థలో ఎలాంటి మార్పులు చేయలేదు. అంటే పనితీరు యథాతథంగానే కొనసాగుతుంది. నెక్స్ట్ జనరేషన్ Fortuner కొనుగోలు చేయలేని వారు తక్కువ ఖర్చుతో తమ పాత Fortunerకు కొత్త లుక్ ఇవ్వాలని భావిస్తే ఇలాంటి ఆఫ్టర్‌మార్కెట్ బాడీ కిట్లు ఒక మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం ఈ మోడిఫైడ్ Toyota Fortuner వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతుండగా, SUV ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.