Toyota Fortuner EMI Calculator: టయోటా ఫార్చ్యూనర్ అనేది మనదేశంలో ఎంతో ఫేమస్ అయిన 7 సీటర్ కారు. ఈ పెద్ద కారుకు భారతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ టయోటా కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 33.43 లక్షల నుంచి మొదలై రూ. 51.44 లక్షల వరకు ఉంటుంది. కానీ చాలా మందికి కారు కొనే సమయంలో మొత్తం డబ్బులు ఒకేసారి చెల్లించడం కష్టం. దీని కోసం మీరు కారును ఈఎంఐలో కొనుగోలు చేయవచ్చు. తద్వారా మొత్తం డబ్బులను ఒకేసారి డిపాజిట్ చేయడానికి బదులుగా మీరు ప్రతి నెలా కొంత ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఈఎంఐలో కారును కొనుగోలు చేసే పూర్తి ప్రక్రియ ఏమిటో తెలుసుకుందాం.
ఈఎంఐలో ఫార్చ్యూనర్‌ని ఎలా కొనుగోలు చేయాలి?
మీరు టయోటా ఫార్చ్యూనర్‌కు సంబంధించిన 4*2 పెట్రోల్ వేరియంట్‌ని కొనుగోలు చేస్తే ఈ కారు ఆన్ రోడ్ ధర రూ. 38 లక్షల వరకు ఉంది. ఈ కారును కొనుగోలు చేసేందుకు మీరు రూ.34.78 లక్షల రుణం పొందవచ్చు. కారు లోన్ తీసుకునేటప్పుడు బ్యాంకు విధించే వడ్డీ రేటు ప్రకారం మీ నెలవారీ వాయిదాను నిర్ణయిస్తారు. లోన్ ప్రాసెస్ సమయంలో అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవడం ముఖ్యం. ఎలాంటి ఇబ్బంది లేకుండా కారు లోన్ పొందడానికి మంచి క్రెడిట్ స్కోర్ కూడా కలిగి ఉండాలి.
Also Read: భారీగా పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ సేల్స్ - విదేశాల్లో కూడా విపరీతమైన క్రేజ్!
- టయోటా ఫార్చ్యూనర్‌కు సంబంధించిన ఈ వేరియంట్‌ను కొనుగోలు చేయడానికి మీరు రూ. 3.87 లక్షల డౌన్‌పేమెంట్ చెల్లించాలి.
- ఈ కారు లోన్‌పై బ్యాంకు 9 శాతం వడ్డీని వసూలు చేసి ఈ రుణాన్ని నాలుగేళ్ల కాల వ్యవధితో తీసుకుంటే మీరు ప్రతి నెలా రూ. 86,500 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.
- అదే ఐదేళ్ల టైమ్ పీరియడ్‌తో ఈ లోన్ తీసుకుంటే ప్రతి నెలా రూ. 72,200 ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది.
- మీరు టయోటా ఫార్చ్యూనర్‌ను కొనుగోలు చేయడానికి ఆరేళ్ల కాలవ్యవధితో లోన్ తీసుకుంటే ప్రతి నెలా రూ. 62,700 ఈఎంఐ బ్యాంకుకు కట్టాల్సి ఉంటుంది.
- ఏడేళ్ల పాటు రుణం తీసుకుంటే ప్రతి నెలా రూ.56 వేల వరకు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.
Also Read: దేశంలో అత్యంత చవకైన బైక్‌లు ఇవే - బెస్ట్ మైలేజీ కూడా!