Mileage Comparison Of Cheapest Bikes: భారతీయ మార్కెట్లో చాలా గొప్ప బైక్‌లు ఉన్నాయి. ఈ మోటార్ సైకిళ్ల ధర వేల నుంచి లక్షల రూపాయల వరకు ఉంటుంది. అదే సమయంలో మార్కెట్లో కొన్ని మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. దీని ధర చాలా తక్కువగా ఉంటుంది. ఈ బైక్‌లు కూడా మంచి మైలేజీని ఇస్తాయి. ప్రజలు తమ రోజువారీ అవసరాలకు ఈ బైక్‌లను ఉపయోగిస్తున్నారు. తక్కువ ధర, మెరుగైన మైలేజీ ఇచ్చే మోటార్‌సైకిళ్ల జాబితాలో హీరో నుంచి హోండా వరకు మోడళ్లు ఉన్నాయి. ఈ బైక్‌ల ధర ఎంత? ఏ బైక్ మంచి పనితీరును ఇస్తుందో తెలుసుకుందాం.
హీరో స్ప్లెండర్ (Hero Splendor)
హీరో స్ప్లెండర్ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మోటార్‌సైకిళ్లలో ఒకటి. ఈ బైక్‌లో ఎయిర్ కూల్డ్, 4 స్ట్రోక్, సింగిల్ సిలిండర్, ఓహెచ్‌సీ ఇంజన్ అమర్చారు. ఈ ఇంజన్ 8,000 ఆర్పీఎం వద్ద 5.9 కేడబ్ల్యూ పవర్‌ని, 6,000 ఆర్పీఎం వద్ద 8.05 ఎన్ఎం పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ బైక్‌లో ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్‌ను అమర్చారు. ఈ బైక్ లీటరుకు 70 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. హీరో స్ప్లెండర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.75,441 నుంచి ప్రారంభం అవుతుంది.
Also Read: రూ.10 లక్షల్లో బెస్ట్ సీఎన్‌జీ కార్లు ఇవే - ఆల్టో కే10 నుంచి పంచ్ వరకు!
హోండా షైన్ (Honda Shine)
మెరుగైన మైలేజీని ఇచ్చే బైక్‌ల జాబితాలో హోండా షైన్‌ను కూడా చేర్చవచ్చు. ఈ హోండా బైక్‌లో 4 స్ట్రోక్ ఎస్ఐ బీఎస్ 6 ఇంజన్ ఉంది. ఈ బైక్ 7,500 ఆర్పీఎం వద్ద 7.9 కేడబ్ల్యూ పవర్‌ని జనరేట్ చేస్తుంది. అలాగే 6,000 ఆర్పీఎం వద్ద 11 ఎన్ఎం టార్క్‌ను కూడా పొందుతుంది. ఈ బైక్ ఒక లీటర్ పెట్రోల్‌కు 55 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుందని పేర్కొంది. హోండా షైన్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 81,251 నుంచి మొదలై రూ. 85,251 వరకు ఉంది.
బజాజ్ పల్సర్ 125 (Bajaj Pulsar 125)
బజాజ్ పల్సర్ 125 మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌లలో ఒకటి. ఈ మోటార్‌సైకిల్ 50 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ బైక్‌లో 4 స్ట్రోక్ 2 వాల్వ్, ట్విన్ స్పార్క్ బీఎస్ 6 డీటీఎస్-ఐ ఇంజన్ అమర్చబడి ఉంది. ఇది 8500 ఆర్పీఎం వద్ద 8.68 కేడబ్ల్యూ పవర్‌ని, 6500 ఆర్పీఎం వద్ద 10.8 ఎన్ఎం టార్క్‌ను ఇస్తుంది. ఈ బజాజ్ బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ.89,606 నుంచి ప్రారంభం అవుతుంది.
Also Read: సింగిల్ ట్యాంక్ ఫుల్‌తో 1000 కిలోమీటర్లు నడిచే టాప్ 5 కార్లు - లిస్ట్‌లో ఏమేం ఉన్నాయి?