గతేడాది ఆటోమోటివ్ అమ్మకాలు దేశ వ్యాప్తంగా జోరుగా కొనసాగాయి. చాలా మంది తయారీదారులు తమ ఆల్-టైమ్ సేల్స్ రికార్డును బద్దలు కొట్టారు. చిన్న కార్లు, SUVలే కాదు, లగ్జరీ కార్ల తయారీదారులు కూడా దేశంలో అత్యుత్తమ విక్రయాల రికార్డును కొనసాగించారు. 2023లోనూ ఇదే జోరును కొనసాగించేందుక ఆయా కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం తక్కువ ధరలో బెస్ట్ కార్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నాయి. మరి ఈ ఏడాది మంచి బడ్జెట్ కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే, 2023లో రూ.5 లక్షల నుంచి 10 లక్షలలోపు వచ్చే టాప్ కార్లు ఏమిటో చూసేయండి.
1. 2023 హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ హ్యుందాయ్ ఇండియా నుంచి వచ్చిన చిన్న హ్యాచ్‌బ్యాక్. అంతేకాదు, అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి. త్వరలో హ్యుందాయ్ కారు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను పరిచయం చేయబోతోంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ పేరుతో ఈ కారు రాబోతోంది. దీని అంచనా ధర రూ. 6 లక్షలు.
2. 2023 మారుతి సుజుకి స్విఫ్ట్
మారుతి సుజుకి నుంచి వచ్చిన అత్యంత ప్రజాదరణ పొందిన కారు స్విఫ్ట్. ప్రస్తుతం కొత్త తరం లేదంటే ఫేస్‌లి ఫ్ట్‌ను పరిచయం చేయాలని కంపెనీ భావిస్తోంది. దీని ప్రారంభ ధర రూ. 6 లక్షలుగా అంచనా వేయబడుతుంది.
3. హ్యుందాయ్ మైక్రో SUV
హ్యుందాయ్ ఇండియా టాటా పంచ్ వంటి వాటితో పోటీపడే మైక్రో SUVని అందుబాటులోకి తీసుకురాబోతోంది. అత్యాధునికి ఫీచర్లు, డిజైన్ తో ఈ కారు వినియోగదారుల ముందుకు రాబోతోంది. దీని ప్రారంభ ధర రూ. 6.5 లక్షలుగా ఉండబోతోంది.
4. సిట్రోయెన్ eC3
సిట్రోయెన్ తన రెండవ కారును 2022 ప్రారంభంలో దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు ఎలక్ట్రిక్ వెర్షన్‌ను గత ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేయాలి అనుకుంది. కారణం ఏంటో తెలియదు కానీ, వాయిదా పడింది. C3 ఎలక్ట్రిక్ వెర్షన్ ఈ ఏడాది ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సిట్రోయెన్ ఇండియా ఇటీవలి పోస్ట్ లు కారు పేరును 'eC3'గా ప్రకటించింది. టాటా టియాగో EVతో పోటీ పడే ఈ కారు ధర రూ. 10 లక్షలలోపు ఉండే అవకాశం ఉంది.
5. హోండా సబ్-4M SUV
హోండా సబ్-కాంపాక్ట్ SUVని మార్పులు చేసి భారతీయ మార్కెట్లోకి సబ్-4M SUVని పరిచయం చేయాలని చూస్తోంది. ఈ హోండా సబ్-4M SUV ధర దాదాపు రూ. 8 లక్షల వరకు ఉండవచ్చు.
6. హోండా బ్రయో
హోండా కంపెనీ ఇప్పటికే ఒక SUVని ప్లాన్ చేస్తున్నందున, దానిని హ్యాచ్ బ్యాక్ గా తీసుకురావాలనుకుంది. హోండా బ్రయో పేరుతో విడుదలకు చేయాలని భావిస్తోంది. దీని ప్రారంభ ధర రూ. 5 లక్షలుగా అంచనా వేయబడింది.
7. టయోటా బెల్టా సెడాన్
టయోటా అంతర్జాతీయ మార్కెట్ కోసం మారుతి సుజుకి సియాజ్ ఆధారంగా సెడాన్‌ను అభివృద్ధి చేసింది. దానికి టయోటా బెల్టా అని పేరు పెట్టింది. భారతదేశంలో సియాజ్ విజయాన్ని చూస్తుంటే టయోటా తమ వెర్షన్‌ను భారత మార్కెట్‌లో పరిచయం చేయాలని చాలా కాలంగా భావిస్తున్నారు. తేలికపాటి మరియు బలమైన హైబ్రిడ్ టెక్నాలజీతో టయోటా బీటా సెడాన్‌ను త్వరలో భారతీయ మార్కెట్‌కు పరిచయం చేసే అవకాశం ఉంది. దీని ప్రారంభ ధర రూ. 9 లక్షలుగా అంచనా వేయబడింది.
Read Also: బజాజ్ పల్సర్ మళ్లీ వచ్చేస్తోంది - లుక్, ఫీచర్స్ అదుర్స్, ధర ఎంతంటే..