జాజ్ పల్సర్..  సూపర్ లుక్, అదిరిపోయే ఫీచర్లతో భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్ లో అమ్మకాల్లో దుమ్మురేపింది. పల్సర్ విక్రయాల వేగాన్ని ఇతర వాహనాలు తట్టుకోలేకపోయాయి. బజాజ్  2007లో 220ఎఫ్ బైకుని మార్కెట్లోకి విడుదల చేసింది. అమ్మకాల్లో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. అదే ఊపులో ఎన్250, ఎఫ్250 వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. 220ఎఫ్ మోడల్ ను అమ్మకాలను నిలిపివేసింది. తాజాగా మళ్లీ అదే మోడల్ ను రీలాంచ్ చేసింది.


తాజాగా 220ఎఫ్ కు సంబంధించిన బుకింగ్స్ ప్రారంభించింది. ఈ సరికొత్త బైక్ కు సంబంధించి డెలివరీలు ఈ నెల చివరి నుంచి ప్రారంభం కానున్నట్లు బజాజ్ సంస్థ ప్రకటించింది. అమ్మకాల పరంగా సరికొత్త గుర్తింపు తెచ్చుకున్న ఈ బైక్ ధరను ప్రస్తుతం  రూ. 1,39,686 (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది.


బజాజ్ పల్సర్ 220ఎఫ్ ఇంజిన్ ప్రత్యేకతలు


బజాజ్ పల్సర్ 220ఎఫ్ 220 సీసీ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ తో వస్తుంది.  20.9 బిహెచ్‌పి పవర్, 18.5 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌ బాక్స్‌ తో అటాచ్ చేయబడి ఉంటుంది.  ఈ బైక్ రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు, సింగిల్ ఛానల్ ABSను కలిగి ఉంటుంది. అటు టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్,  వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్ ను కలిగి ఉంటుంది. గతంలో విక్రయించిన BS6 మోడల్‌తో సమానంగా ఉంటుంది.


బజాజ్ పల్సర్ 220ఎఫ్ డిజైన్


ఇక ఈ లేటెస్ట్ బజాజ్ పల్సర్ 220ఎఫ్ డిజైన్ వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది. తాజాగా  దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త బజాజ్ పల్సర్ 220ఎఫ్ డిజైన్, గతంలో మాదిరిగానే ఉండనుంది. ఈ బైక్ భారీ ఫ్రంట్ ఫాసియా, స్ప్లిట్ సీటు, క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ ల్యాంప్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ ను కలిగా ఉంటుంది. మరింత స్టైలిష్ గా కనిపించనుంది.   


ఎన్ని రంగుల్లో అందుబాటులో ఉందంటే?  


కొత్త బజాజ్ పల్సర్ 220ఎఫ్ పలు రంగుల్లో లభిస్తుంది. బ్లూ బ్లాక్, రెడ్ బ్లాక్ తో పాటు మూడు డ్యూయెల్ టోన్ కలర్ ఆప్సన్స్‌ లో విడుదల చేసింది. ఈ బైకులను భారత్ తో పాటు 70 దేశాల్లో విక్రయిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.   


యమహా నుంచి రెండు స్కూటర్లు విడుదల


ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా మోటార్స్ రెండు కొత్తగా అప్‌డేట్ చేసిన స్కూటర్లు ఫాసినో, రే జెడ్‌ఆర్‌లను భారత మార్కెట్లో విడుదల చేసింది. కొత్త Fascino S 125 Fi హైబ్రిడ్ (డిస్క్) వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధరను రూ.91,030గా యమహా నిర్ణయించింది.కాగా, రే జెఆర్‌ను రే జెడ్‌ఆర్ 125, రే జెడ్‌ఆర్ స్ట్రీట్ ర్యాలీ అనే రెండు వేరియంట్‌ల్లో విడుదల చేశారు. ఇందులో రే జెడ్‌ఆర్ ధర రూ.89,530గా, స్ట్రీట్ ర్యాలీ ధర రూ.93,530గా ఉంది. కంపెనీ తన మోటార్‌సైకిళ్లు అయిన ఎఫ్‌జెడ్, ఆర్ 15, ఎంటీ 15 అప్‌డేటెడ్ వెర్షన్‌ను కొంతకాలం క్రితం మార్కెట్లో విడుదల చేసింది.


Read Also: సరికొత్త హ్యుందాయ్ వెర్నా బుకింగ్స్ ఓపెన్, ఫీచర్లు, డిజైన్, ఇంజిన్ ప్రత్యేకతలు ఇవే!