ABP Network Ideas Of India 2023: 


రెండు రోజుల సదస్సు..


ABP Network Ideas Of India సదస్సు రెండో ఎడిషన్ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 24, 25వ తేదీల్లో ఈ సమ్మిట్ జరగనుంది. దేశంలో పలు రంగాల్లో ప్రముఖులైన వాళ్లు తమ అభిప్రాయాలు, ఆలోచనలు ఈ వేదికగా పంచుకోనున్నారు. వాతావరణ మార్పుల నుంచి
గ్లోబల్ ప్లేయర్‌గా భారత్ ఎలా రాణించగలదు అన్న అంశం వరకూ అన్ని విషయాలపైనా చర్చలు జరగనున్నాయి. డాబర్ వేదిక్ టీ, డాక్టర్ ఆర్థో, Gallant Advance స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్న ఈ సమ్మిట్‌లో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, బ్రిటన్ మాజీ ప్రధాని లిజ్ ట్రస్, గేయ రచయిత, కవి జావేద్ అక్తర్ పాల్గొననున్నారు. వీరితో పాటు సింగర్ లక్కీ అలీ, శుభ ముద్గల్, రచయితలు అమితవ్ ఘోష్, దేవ్‌దత్త్ పట్నాయక్, సినీ నటులు సారా అలీఖాన్, జీనత్ అమన్,ఆయుష్మాన్ ఖురానా, మనోజ్ వాజ్‌పేయీ, సెలెబ్రటీ చెఫ్ వికాస్ ఖన్నా, క్రీడా ప్రముఖులు జ్వాలా గుప్తా, వినేష్ ఫోగట్‌ తదితరులు హాజరు కానున్నారు. ఈ సారి సమావేశంలో "నవ భారత్" పై చర్చ జరగనుంది. ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ఏం చేయాలన్న అంశంపై తమ ఆలోచనలు పంచుకోనున్నారు. 


నారాయణ మూర్తి స్పీచ్...


ఇన్‌ఫోసిస్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ NR నారాయణ మూర్తి ఈ సారి స్పీకర్‌గా వ్యవహరించనున్నారు. గతేడాది జరిగిన సదస్సులో నారాయణ మూర్తి ఐటీ రంగ భవిష్యత్‌పై చర్చించారు. ఈ సారి కార్పొరేట్ కల్చర్‌పై తన అభిప్రాయాలు పంచుకోనున్నారు. 1981లో Infosys సంస్థను స్థాపించారు నారాయణమూర్తి. 2002 వరకూ దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆ కంపెనీ CEOగా ఉన్నారు. ఆ తరవాత 2002 నుంచి 2011 వరకూ ఛైర్మన్ బాధ్యతలు తీసుకున్నారు. 2011లో ఈ పదవి నుంచి తప్పుకున్నప్పటికీ ఐదేళ్ల పాటు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగారు.



4 దశాబ్దాలుగా కార్పొరేట్ ఇండియా పురోగతిని పరిశీలించిన నారాయణ మూర్తి..."Father of the Indian IT sector" గా పేరు తెచ్చుకున్నారు. ఆయన సేవల్ని గుర్తించిన ప్రభుత్వం 2008లో పద్మశ్రీ, 2011లో పద్మ విభూషణ్ ఇచ్చి సత్కరించింది. ఈ సారి సమ్మిట్‌లో కార్పొరేట్ ప్రపంచంలోని కొత్త ట్రెండ్‌లపై మాట్లాడనున్నారు నారాయణ మూర్తి. ఆయన ఇంకే మాట్లాడతారో తెలుసుకోవాలంటే ఈ abplive.comని ఫాలో అవుతూ ఉండండి. ఫిబ్రవరి 25న ఆయన తన అభిప్రాయాలు పంచుకుంటారు.